India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: డ్రగ్స్ తయారీ యూనిట్ <<17630840>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ డ్రగ్స్‌ను కేజీ రూ.50 లక్షల చొప్పున విజయ్ ఓలేటి అనే వ్యక్తి హైదరాబాద్‌లో అమ్మినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని దందా చేశారని అధికారులు వెల్లడించారు. దీంతో రూ.వందల కోట్లు సంపాదించినట్లు తెలిపారు. ముంబై నార్కోటిక్ పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా చేరి పక్కాగా వివరాలు సేకరించారన్నారు.
Enteromix అనే క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. ఇది ట్యూమర్లను కరిగించి వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. లంగ్స్, బ్రెస్ట్, పెద్దపేగు తదితర క్యాన్సర్లకు చెక్ పెడుతుందని చెప్పింది. ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్‌లో 100% ఫలితాలొచ్చినట్లు వెల్లడించింది. దీని వినియోగానికి ఆరోగ్యశాఖ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.
AP: పలువురు లిక్కర్ కేసు నిందితులు బెయిల్‌పై విడుదలవ్వడంపై YCP నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ‘నీ లక్ష్యం నెరవేరకుండానే SIT చితికినట్లుంది. జర చూసుకో సూట్ కేసు. అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు’ అంటూ మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేసి సెటైర్లు వేశారు.
విదేశీయులు రూ.27 వేలకే పర్మినెంట్ రెసిడెన్సీ పొందేందుకు బ్రెజిల్ అనుమతి ఇస్తోంది. 2 వేల డాలర్ల ఆదాయం ఉన్నవారు కూడా ముందుగా తాత్కాలిక నివాసానికి అర్హులవుతారు. ఆ తర్వాత పర్మినెంట్ రెసిడెన్సీగా మార్చుకోవచ్చు. పాస్‌పోర్టు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, లీగల్ ఎంట్రీ, జాబ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ సర్టిఫికెట్ ఉంటే శాశ్వత నివాస హక్కు వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తానికి 4 నుంచి 6 నెలలు పడుతుంది.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, హన్మకొండ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.
కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో సూపర్ ఉమెన్ కథాంశంతో తెరకెక్కిన ‘కొత్త లోక’ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ 10 రోజుల్లోనే రూ.159+ కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.74 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.10.15 కోట్లు వసూలు చేసిందని వెల్లడించాయి. ఇప్పటికే రెట్టింపు లాభాలు వచ్చాయని పేర్కొన్నాయి. ఈ సినిమాకు హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించారు.
AP: చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూసివేస్తే శ్రీకాళహస్తి టెంపుల్ మాత్రం తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో నవగ్రహ అలంకార కవచం వల్ల గ్రహణ ప్రభావం గుడిపై పడదని పండితులు చెబుతున్నారు. రోజులాగే రాత్రి 9 గంటలకు టెంపుల్ మూసివేసి, గ్రహణ సమయంలో రాత్రి 11 గంటలకు తెరిచి గ్రహణకాల అభిషేకాలు, శాంతిపూజలు నిర్వహిస్తారు. అయితే భక్తులకు రేపు ఉదయం 6 గంటలకు దర్శనం కల్పిస్తారు.
జపాన్ PM షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ఎగువ సభలో పరాజయం చెందింది. దీనికి బాధ్యత వహించాలంటూ ఆయనపై సొంత పార్టీ(లిబరల్ డెమోక్రటిక్) నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. అంతర్గత విభేదాలకు స్వస్తి పలికేందుకు షిగెరు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోనుంది.
TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా ఈ నెల 15న కామారెడ్డి సభ ఉండనుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. BJP నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారని ఫైరయ్యారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్‌కు చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. కవిత ఎపిసోడ్ KCR ఆడించే డ్రామా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగవుతుందన్నారు.
ఈ నెల 15 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్(P2M)కు UPI లిమిట్‌ను రోజుకు రూ.10 లక్షలకు పెంచుతూ NPCI నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు రూ.లక్ష మాత్రమే UPI ద్వారా పంపొచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్లకు ఇది ఇబ్బందిగా మారడంతో ఒక్కసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.10 లక్షలు పంపుకునే వెసులుబాటు కల్పించింది. కాగా మనం (P2P) స్నేహితులు, బంధువులకు పంపే లిమిట్ మాత్రం రూ.లక్షగానే ఉంది.
Sorry, no posts matched your criteria.