India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దీపావళి ముంగిట సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. భారీ ఆఫర్లంటూ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ వెబ్‌సైట్ల లింకులు, APK ఫైళ్లను వాట్సాప్ నంబర్లకు పంపుతున్నారు. ఏదైనా వస్తువు కోసం డబ్బు చెల్లించినా డెలివరీ కావట్లేదు. వ్యక్తిగత సమాచారం దుండగుల చేతుల్లోకి వెళ్తోంది. అలాగే బంపర్ డ్రా, లాటరీల పేరుతోనూ స్కామ్‌లు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
AP ఆర్థిక రాజధాని విశాఖకు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్ రాబోతున్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్‌పోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా సంస్థలు రాబోతున్నాయి. అమరావతిలో 5 బిలియన్ డాలర్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం’ అని ఆయన చెప్పారు.
AP: విశాఖ-విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ 9.35amకు విశాఖలో బయలుదేరి 10.35amకు గన్నవరం చేరుతుంది. తిరిగి 7.55pmకు విజయవాడ నుంచి బయలుదేరి 9pmకు విశాఖకు చేరుతుంది. ఇండిగో సర్వీసు 7.15pmకు విజయవాడ నుంచి విశాఖకు వెళ్లి, 8.45pmకు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుతుంది. ఈ నగరాల మధ్య విమానాల సంఖ్య 3కి చేరింది.
AP: 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకునేందుకు విధివిధానాలు రూపొందిస్తోంది. ఈమేరకు ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి లోకేశ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టనుంది.
విక్టరీ వెంకటేశ్-మీనా నటించిన ‘దృశ్యం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందులో వారి పెద్దకూతురిగా కృతిక, చిన్నకూతురిగా ఎస్తేర్ అనిల్ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. తాజాగా ఎస్తేర్ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా ‘ఆ అమ్మాయి ఇప్పుడు ఇలా అయిందా?’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ ఎస్తేరే నటించారు.
Swiggy IPO పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6-8 తేదీల మధ్య జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. $11.3 బిలియన్ల (₹93,790 కోట్లు) IPO వాల్యుయేషన్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. IPO ప్రైమరీ కాంపోనెంట్‌ను సుమారు ₹4,500 కోట్లకు పెంచారు. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా OFS కాంపోనెంట్‌నూ సవరించినట్లు తెలిసింది. మొత్తం IPO పరిమాణం ₹11,700 కోట్ల నుంచి ₹11,800 కోట్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్‌ను సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ(85) ఆరోగ్య పరిస్థితి కలవరపెడుతోంది. ఖమేనీ తీవ్ర అనారోగ్యం బారిన పడినట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు ఇజ్రహీం రైసీ మృతితో దేశంలో అస్థిరత ఏర్పడడంతో తాజాగా ఖమేనీ అనారోగ్యం ఇరాన్‌ను దిగులు పెడుతోంది. ఖమేనీ వారసుడిగా రెండో పెద్దకుమారుడు మొజ్తాబా పగ్గాలు చేపడతారని తెలుస్తోంది.
నాన్ టెక్నికల్ కేటగిరీ(NTPC)లో 3,693 పోస్టులకు RRB దరఖాస్తులు స్వీకరిస్తోంది. అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో 18 నుంచి 33 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఈ నెల 27 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500. మహిళలు, ఎస్టీ, ఎస్సీ, ఈబీసీలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/
AP: రాష్ట్ర ప్రజలను ఉదయం పూట చలి వణికిస్తుంటే మధ్యాహ్నం ఎండ బాదుతోంది. శీతాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అటు పగటిపూట ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు AI పరిష్కారాల కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. IndiaAI ఇనిషియేటివ్‌లో భాగంగా నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ (NCRP)లో పౌరులు సులభంగా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసే విధంగా, నేర విధానాల ఆధారంగా వాటి విభజనకు అవసరమైన Natural Language Processing వృద్ధికి ఔత్సాహికులను ఆహ్వానించింది. రోజూ నమోదయ్యే 6K కేసుల నిర్వహణ, నేరాల నియంత్రణకే ఈ ప్రయత్నాలని ఓ అధికారి తెలిపారు.
Sorry, no posts matched your criteria.