India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫిట్నెస్ ట్రాకర్లు వచ్చాక రోజుకు ‘10000 STEPS’ టార్గెట్గా పెట్టుకోవడం అలవాటైంది. ఈ ట్రెండుపై కాస్త ఆలోచించాలని పరిశోధకులు అంటున్నారు. ఆయు ప్రమాణం పెరగాలంటే ‘10000’ అవసరమేమీ లేదంటున్నారు. శ్రద్ధగా రోజుకు 2300 అడుగులు వేసినా గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని అంటున్నారు. 3300 అడుగులేస్తే డెత్ రిస్క్ 15% తగ్గుతుందని, అదనంగా వేసే ప్రతి 500 స్టెప్స్కు 7% కార్డియో డెత్ రిస్క్ తగ్గుతుందని వెల్లడించారు.
AP: రాష్ట్రంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకినట్లు తేలింది. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు ఇదే కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 17 మంది ఆసుపత్రిలో చేరారు. తాగునీరు కలుషితం కావడంతో ఇక్కడ ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి.
TG: నవంబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కార్తీక మాస ఉత్సవాలను నిర్వహించాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించాలని తెలిపింది. దీపోత్సవంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని ఆలయాల ఈవోలు, సహాయక కమిషనర్లు ఇవి అమలయ్యేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రీపోల్ సర్వేలు అమెరికాలో ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా CNN నిర్వహించిన సర్వేలో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ సమానంగా 47% చొప్పునా (1704 శాంపిల్స్) మద్దతు పొందారు. ఇటీవల న్యూయార్క్టైమ్స్, సియెనా కాలేజీ సర్వేలోనూ ఇద్దరికీ చెరో 48% మద్దతు దక్కింది. ఇక ఆర్థిక అంశాలపై ఫైనాన్షియల్ టైమ్స్, మిచిగాన్ వర్సిటీ సర్వేలో 44% మంది మద్దతుతో కమల కంటే ట్రంప్ 1% పైచేయి సాధించారు.
రైళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై DMK MP అబ్దుల్లా వేసిన ప్రశ్నలకు కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టు హిందీలో బదులిస్తూ లేఖ రాశారు. తనకు హిందీ రాదని, బిట్టు లెటర్లో ఒక్క ముక్క అర్థం కాలేదని అబ్దుల్లా ఆయన ఆఫీస్కు ఫోన్ చేశారు. ఈ విషయం తాను గతంలోనూ చెప్పానని, ఇంగ్లిష్లో రిప్లై ఇవ్వాలని చెప్పారు. ఇదే విషయంపై తమిళంలోనూ రిటర్న్ లేఖ రాశారు. కాగా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని DMK విమర్శిస్తోంది.
న్యూజిలాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను కైవసం చేసుకునేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డే గెలిచిన భారత్ ఈరోజు అహ్మదాబాద్ వేదికగా రెండో వన్డేలో తలపడనుంది. మ్యాచ్ మ.1.30గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో ప్రసారం అవుతుంది. కాగా ఇందులో గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలవాలని భారత్ చూస్తుంటే ఇందులో ఎలాగైనా గెలిచి రేసులో నిలవాలని కివీస్ భావిస్తోంది.
APPSC ఛైర్పర్సన్గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న AR అనురాధ ముందు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అనేక సవాళ్లు ఉన్నాయి. ఆయుష్ విభాగంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై అభ్యర్థులు పోస్టింగ్స్ కోసం చూస్తున్నారు. గ్రూప్-1, 2 DYEO, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు వంటి పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
AP: 16,347 DSC ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు పరిశీలించి నివేదిక పంపించాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. గతంలో జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్లు, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్, స్పోర్ట్స్ కోటా అమలుపై వివరాలను ఈ నెల 28లోగా పంపాలంది. కాగా వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సుంది.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా Nov 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశంకానున్నాయి. Nov 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే లోక్సభ, రాజ్యసభ సభ్యులు భేటీ అవుతారు. గతంలో Nov 26న National Law Day నిర్వహించే వారు. అయితే, 2015లో అంబేడ్కర్125వ జయంతిని పురస్కరించుకొని ఆ రోజును Constitution Dayగా ప్రకటించారు.
TG: హైడ్రా సైలెంట్ కాలేదని, మరింత బలోపేతం అవుతోందని హైడ్రా ఏర్పడి వందరోజులైన సందర్భంగా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇకపై పక్కా ప్లాన్, ఆధారాలతో ముందడుగు వేస్తామన్నారు. త్వరలోనే చెరువులన్నింటికీ FTL, బఫర్ జోన్లు ఫిక్స్ చేస్తామని చెప్పారు. గడిచిన వంద రోజుల్లో ఆక్రమణదారులకు హైడ్రా సింహస్వప్నంలా మారిందని రంగనాథ్ వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా అన్నీ చెక్ చేసుకున్నాకే స్థలాలు కొంటున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.