news

News January 7, 2025

9 మంది RSS స‌భ్యుల‌కు యావ‌జ్జీవ శిక్ష‌

image

కేర‌ళ‌లో 19 ఏళ్ల క్రితం నాటి హ‌త్య కేసులో 9 మంది RSS స‌భ్యుల‌కు త‌ల‌స్సేరి కోర్టు యావ‌జ్జీవ శిక్ష విధించింది. 2005 అక్టోబరు 3న కన్నాపురం చుండాకు చెందిన 25 ఏళ్ల CPM సభ్యుడు రిజిత్ శంకరన్‌ను రాజ‌కీయ వ‌ర్గ‌పోరు వ‌ల్ల RSS కార్యకర్తలు ఆయుధాల‌తో దాడి చేసి హ‌త్య చేశారు. మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసులో జనవరి 4న నిందితులను దోషులుగా నిర్ధారించిన తలస్సేరి కోర్టు తాజాగా శిక్ష ఖ‌రారు చేసింది.

News January 7, 2025

ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో బుమ్రా

image

ఐసీసీ ప్రతి నెలా ఉత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే. గత నెలకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా బౌలర్ డేన్ ప్యాటర్సన్‌ను నామినేట్ చేసింది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లతో రాణించగా కమిన్స్ 25 వికెట్లు, 159 పరుగులు చేశారు. ఇక ప్యాటెర్సన్ పాక్‌తో 2 టెస్టుల్లో 13 వికెట్లు పడగొట్టారు.

News January 7, 2025

ఏసీబీ ఆఫీసులో కీలక భేటీ

image

TG: హైదరాబాద్ ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ పోలీసులు చేరుకున్నారు. ఏసీబీ ఉన్నతాధికారులతో ఏసీపీ, సీఐ, పలువురు సిబ్బంది సమావేశమయ్యారు. KTR క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News January 7, 2025

స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఆదుకుంటుంది: పురందీశ్వరి

image

AP: రేపు PM మోదీ వైజాగ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను రాష్ట్ర BJP చీఫ్ పురందీశ్వరి పరిశీలించారు. స్టీల్ ప్లాంట్‌ను గాడిలో పెట్టాలని కేంద్రం భావిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘కూటమి సర్కారు ఏర్పడ్డాక తొలిసారిగా PM విశాఖకు వస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మంచి ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది’ అని వెల్లడించారు.

News January 7, 2025

ఎల్లుండి నుంచి SA టీ20 లీగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

image

జనవరి 9 నుంచి సౌతాఫ్రికా ప్రీమియర్ T20 క్రికెట్ లీగ్(SA20) సీజన్ 3 జరగనుంది. ఫిబ్రవరి 8 వరకు 34 మ్యాచులు జరగనుండగా డిస్నీ+హాట్ స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ 2, స్పోర్ట్స్18 2లో ప్రసారం కానున్నాయి. తొలి రెండు సీజన్లలో సన్ రైజర్స్ ఈస్టర్న్ విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంఛైజీకి ఓనర్ కావ్య మారన్ కావడం గమనార్హం.

News January 7, 2025

ఆస్ప‌త్రిలో చేరిన ప్ర‌శాంత్ కిషోర్‌

image

జైలు నుంచి విడుద‌లైన జ‌న్ సురాజ్ ఫౌండ‌ర్ ప్ర‌శాంత్ కిషోర్ డీహైడ్రేష‌న్‌, ఇన్ఫెక్ష‌న్‌తో ఆస్ప‌త్రిలో చేరారు. బిహార్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష‌ల్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద జనవరి 2న ఆయన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగారు. దీంతో PKను పోలీసులు Mon అరెస్టు చేశారు. తాజాగా ఆయ‌న‌కు బెయిల్ మంజూరైంది. ఆస్ప‌త్రిలో చేరినా త‌న దీక్ష‌ను కొన‌సాగిస్తాన‌ని PK తెలిపారు.

News January 7, 2025

నిన్నటితో పోలిస్తే బంగారం ఎంత పెరిగిందంటే..

image

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. డాలర్ విలువ పెరుగుతుండటమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.51 పెరిగి రూ.81,789గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.47 ఎగిసి రూ.74,973 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.1,00,000 వద్ద ఉంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 ఎగిసి రూ.25,740 వద్ద ట్రేడవుతోంది. మరికొన్ని రోజులు ధరలు ఇలాగే కొనసాగొచ్చని నిపుణులు చెప్తున్నారు.

News January 7, 2025

ఈ తెలుగు IASను అభినందించాల్సిందే!

image

సివిల్ సర్వీసెస్ అంటే ఓ బాధ్యత అని నిరూపించారు TGలోని కరీంనగర్‌కు చెందిన IAS నరహరి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన సెకండ్ అటెంప్ట్‌లో 78వ ర్యాంకు సాధించి MPలో కలెక్టర్‌గా చేస్తున్నారు. 10 ఏళ్లపాటు ప్రభుత్వ కోచింగ్ సెంటర్లలో టీచింగ్ చేసి 400 మంది UPSC ఉత్తీర్ణులవడంలో సహాయం చేశారు. లింగనిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు కృషి చేశారు. ఇండోర్‌ను క్లీనెస్ట్ సిటీగా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేశారు.

News January 7, 2025

ఇంకెప్పుడు విశాల్‌ను కలవొద్దనుకున్నా: దర్శకుడు సుందర్

image

తొలిసారి విశాల్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు తన ఆఫీసులో లేకపోవడం కోపాన్ని తెప్పించినట్లు ‘మదగదరాజు’ దర్శకుడు సుందర్ తెలిపారు. అప్పుడే ఇక ఆయనను కలవొద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే 2 నెలల తర్వాత విశాల్ తన వద్దకు వచ్చి సారీ చెప్పాడన్నారు. తన సన్నిహితులకు మెడికల్ ఎమర్జెన్సీ వల్ల ఆ రోజు అందుబాటులో లేరని ఆయన ద్వారా తెలిసిందన్నారు. విశాల్ మంచి వ్యక్తి అని, తన తమ్ముడి లాంటి వాడన్నారు.

News January 7, 2025

మరో క్షిపణిని పరీక్షించిన నార్త్ కొరియా

image

ఉత్తర కొరియా మరో హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దేశ అధికారిక మీడియా KCNA ఈ విషయాన్ని ప్రకటించింది. శబ్దవేగానికి 12 రెట్లు వేగంతో 1500 కి.మీ దూరం ప్రయాణించిన క్షిపణి లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని పేర్కొంది. అయితే, క్షిపణి పరీక్ష నిజమే కానీ ప్యాంగ్యాంగ్ చెప్పే స్థాయిలో దాని సామర్థ్యం లేదని దక్షిణ కొరియా కొట్టిపారేసింది. అయితే ఆ ప్రయోగాలపై మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది.