news

News May 16, 2024

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం: లోకేశ్

image

AP: రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజానికి పాల్పడుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘వైజాగ్‌లో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. టీడీపీకి ఓటు వేశారని దాడి చేయడం దుర్మార్గం. ఓటమి ఖాయమని తెలిసే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. ఇది మహిళలపై జరిగిన దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’ అని ఆయన పేర్కొన్నారు.

News May 16, 2024

ఎన్నికల హింసపై సిట్.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి: సీఈసీ

image

ఏపీలో ఎన్నికల హింసపై నమోదైన ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని, సిట్ ఏర్పాటు చేసి విచారించాలని CEC ఆదేశించింది. FIRలు నమోదు చేసి IPC, ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టాలని స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారంపై 2 రోజుల్లో నివేదిక సమర్పించాలంది. రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలంటూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. హింసపై కఠినంగా వ్యవహరించాలని సీఎస్, డీజీపీకి సూచించింది.

News May 16, 2024

ఏపీలో హింస.. సీఈసీ కీలక ఆదేశాలు

image

ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత జరిగిన హింసపై సీఈసీ అధికారిక ప్రకటన చేసింది. సీఎస్, డీజీపీ వివరణ తర్వాత.. వారు సూచించిన ఆరు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పల్నాడు కలెక్టర్ పైనా వేటు వేసింది. ఆ మూడు జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది.

News May 16, 2024

హైదరాబాద్‌కు జేసీ ఫ్యామిలీ తరలింపు

image

AP: జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు తాడిపత్రి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ ఉండటానికి వీల్లేదంటూ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు పవన్ రెడ్డిని భద్రత మధ్య తాడిపత్రి నుంచి పంపించారు. మరోవైపు లంగ్స్ ఇన్ఫెక్షన్‌కు గురైన ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. అల్లర్లలో పాల్గొన్న 90 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News May 16, 2024

కాంగ్రెస్ వల్లే POKపై పట్టు కోల్పోయాం: జైశంకర్

image

కాంగ్రెస్ పార్టీ బలహీనత వల్లే POK (పాక్ ఆక్రమిత కశ్మీర్‌) పై పట్టు కోల్పోయామని విదేశాంగ మంత్రి జై శంకర్ విమర్శించారు. ‘ఇప్పటికీ పీఓకేను భారత్‌లో భాగంగానే పరిగణిస్తున్నా. కొందరి బలహీనత వల్లే అది చేజారింది. ఇందుకు వారి పొరబాటే ప్రధాన కారణం. భారత భూభాగాలను ఆక్రమించుకోలేరని పాకిస్థాన్, చైనాకు చాలాసార్లు చెప్పాం. ఆ భూభాగాలపై భారత్‌కే పూర్తి హక్కు ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు.

News May 16, 2024

IPL: ఉప్పల్‌లో మళ్లీ వర్షం.. టాస్ మరింత ఆలస్యం

image

SRH-GT మ్యాచ్ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టనుంది. వర్షం తగ్గడంతో రా.8 గంటలకు టాస్ వేయాలని అంపైర్లు భావించారు. అంతలోనే వర్షం మళ్లీ మొదలైంది. ఉప్పల్‌ స్టేడియం వద్ద ప్రస్తుతం చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

News May 16, 2024

పోలీసులకు స్వాతి మాలివాల్ ఫిర్యాదు

image

తనను వేధించిన ఘటనపై ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆమె ఆయన నివాసానికి వెళ్లారు. స్వాతి వేచి ఉన్న గదిలోకి వెళ్లిన కేజ్రీవాల్ పీఏ.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన దురదృష్టకరమన్న ఆప్.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఇవాళ మీడియా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్‌ను ఈ ఘటనపై ప్రశ్నించగా.. ఆయన మౌనంగా ఉండిపోయారు.

News May 16, 2024

SRH-GT: రా.8 గంటలకు టాస్

image

ఉప్పల్‌లో SRH-GT మధ్య మ్యాచ్‌ టాస్ రాత్రి 8 గంటలకు వేయనున్నారు. 8.15 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. అయితే ప్రస్తుతం మళ్లీ వర్షం పడే అవకాశం ఉండటంతో తొలగించిన కవర్లను తిరిగి పిచ్‌పై కప్పారు.

News May 16, 2024

విడాకులపై ట్రోల్స్‌‌.. ఆవేదన వ్యక్తం చేసిన సింగర్ సైంధవి

image

విడాకుల తర్వాత తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు యూట్యూబ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారని గాయని సైంధవి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేం బలవంతంగా విడిపోలేదు. ప్రకాశ్.. నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరినా అసంబద్ధమైన ఆరోపణలతో ఒకరి వ్యక్తిత్వంపై ట్రోల్స్ చేయడం దారుణం. 24 ఏళ్లుగా జీవీ నేను ఫ్రెండ్స్. అదే బంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం’ అని సైంధవి ట్వీట్ చేశారు.

News May 16, 2024

ఒక్కో చెట్టు నరికినందుకు 100 మొక్కలు నాటాలి: సుప్రీంకోర్టు

image

ఆరావళి శ్రేణుల్లో మైనింగ్ అనుమతులు ఇవ్వొద్దని తాము ఆదేశించినా ఢిల్లీలో 458 చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మండిపడింది. రోడ్డు విస్తరణ కోసం ఈ పనిచేసిన ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌ సుభాషిశ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధమైంది. ఒక్కో చెట్టు నరికినందుకు 100 మొక్కలు నాటాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆరావళి పర్వతాలు ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించాయి.