news

News May 9, 2024

ఇజ్రాయెల్‌కు అమెరికా బిగ్ షాక్!

image

తమ మిత్ర దేశం ఇజ్రాయెల్‌కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశానికి బాంబుల సరఫరా నిలిపేసింది. 3,500 బాంబులను పంపాల్సి ఉండగా.. తాజాగా వాటి సరఫరాను ఆపింది. బాంబులు పంపిస్తే రఫాపై ఇజ్రాయెల్ విరుచుకుపడే ఛాన్స్ ఉండటంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. రఫాపై దాడి చేయొద్దని ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరించింది. కానీ అగ్రరాజ్యం మాటలను ఇజ్రాయెల్ లెక్కచేయకపోగా.. రఫాపై దాడులను మరింత ఉద్ధృతం చేస్తోంది.

News May 9, 2024

RCBvsPBKS.. రేసులో నిలిచేదెవరో?

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లూ పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు కలిగి ఉన్నాయి. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. నేడు గెలిచిన టీమ్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 32 మ్యాచ్‌లు జరగ్గా పంజాబ్ 17, బెంగళూరు 15 గెలిచింది.

News May 9, 2024

నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటన

image

AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాజంపేటలో ఆయన ప్రచారం చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

News May 9, 2024

600 మార్కులకు 572 వచ్చినా సూసైడ్.. కారణమేంటంటే?

image

యూపీలో పది ఫలితాల్లో స్కూల్ టాపర్ కంటే 3 మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో పాండేపూర్‌కు చెందిన సాక్షికి 600 మార్కులకు 572 వచ్చాయి. స్కూల్ టాపర్‌కు 575 మార్కులు వచ్చాయి. టాపర్ కాలేదని మనస్తాపంతో సాక్షి సోమవారం రాత్రి 9 గంటలకు ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

News May 9, 2024

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’

image

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’ పేరుతో గూగుల్ ఓ డిజిటల్ వాలెట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో మీ పేమెంట్ కార్డులు, టికెట్లు, ఐడీలు మొదలైనవి భద్రపరుచుకోవచ్చు. అయితే ఇందులో గూగుల్ పే తరహాలో చెల్లింపులు చేసే సదుపాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. మెట్రో ట్రైన్ టికెట్లు కూడా సేవ్ చేసుకునే విధంగా హైదరాబాద్, కొచ్చి మెట్రో యాజమాన్యాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

News May 9, 2024

నేడు రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాక

image

TG: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్, 6 గంటలకు సరూర్ నగర్‌లో జరిగే జనజాతర సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నకిరేకల్ జనజాతర సభకు హాజరవుతారు. 11న కామారెడ్డి, తాండూరులో జరిగే జనజాతర సభలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు.

News May 9, 2024

1,377 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తుల <>గడువు<<>>ను నవోదయ విద్యాలయ సమితి మరోసారి పొడిగించింది. మొత్తం 1,377 పోస్టులకు మే 14వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30తోనే గడువు ముగిసింది. ఈ క్రమంలో మే 7 వరకు గడువును పొడిగించగా.. తాజాగా ఆ సంస్థ మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

News May 9, 2024

IPL: ముంబై కథ ముగిసింది

image

లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపుతో ముంబై ఇండియన్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. ప్రస్తుతం టాప్ 6లో ఉన్న జట్లే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబైకి ఏమాత్రం ఛాన్స్ లేదు. కాగా హార్దిక్ నేతృత్వంలో ముంబై ఈ సీజన్‌లో ఘోర ప్రదర్శన చేసింది.

News May 9, 2024

రికార్డు సృష్టించిన ‘హీరామండీ’

image

భారీ తారాగణంతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండీ’. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది వీక్షించిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా నిలిచింది. 43 దేశాల్లో టాప్-10లో ట్రెండింగ్‌లో ఉంది. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ ముఖ్య పాత్రల్లో నటించిన ‘హీరామండీ’ మే 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

News May 9, 2024

చరిత్ర సృ‌ష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

image

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఆ జట్టు 146* సిక్సర్లు నమోదు చేసింది. 12 మ్యాచ్‌లలోనే SRH ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 145 (2018) రికార్డును బద్దలుకొట్టింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 143 (2019), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 142 (2016), ముంబై ఇండియన్స్ 140 (2023) ఉన్నాయి.