news

News April 18, 2024

టాస్ ఓడిన ముంబై

image

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముంబై: రోహిత్, ఇషాన్ (WK), సూర్య, తిలక్, హార్దిక్ (C), టిమ్ డేవిడ్, నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయస్ గోపాల్, గెరాల్డ్ కొయెట్జీ, బుమ్రా.
పంజాబ్: రూసో, ప్రభ్‌సిమ్రాన్, సామ్ కరన్ (సి), లివింగ్‌స్టోన్, జితేశ్ (WK), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్, రబాడ.

News April 18, 2024

VVPAT అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

image

VVPAT అంటే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్‌. దీన్ని EVMకు కనెక్ట్ చేస్తారు. EVMలో ఓటేయగానే.. అభ్యర్థి గుర్తు, పార్టీ పేరు మిషన్‌లోని తెరపై కనిపిస్తాయి. వెంటనే ఆ వివరాలు చిన్నకాగితంలో ప్రింటయ్యి అడుగున ఉన్న ఖాళీ బాక్సులో పడుతుంది. కౌంటింగ్ సమయంలో కొన్ని ప్రాంతాల VVPATలు, EVM ఓట్లను సరిపోల్చుతారు. కాగా మాక్‌పోల్‌లో BJPకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని విపక్షాలు <<13076328>>సుప్రీంను<<>> ఆశ్రయించాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

‘పుష్ప-2’ డిజిటల్ రైట్స్‌కు రూ.275 కోట్లు?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్ పోటీ పడగా.. నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.275 కోట్లకు డీల్ ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాతి స్థానంలో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా (రూ.170 కోట్లు) ఉంది.

News April 18, 2024

44,163 మంది వాలంటీర్ల రాజీనామా

image

ఏపీలో పోలింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 1,017 మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించామని పేర్కొన్నారు. కాగా, వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు పలు నియోజకవర్గాల్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు.

News April 18, 2024

T20ల్లో రోహిత్‌దే ఫస్ట్ డబుల్ సెంచరీ: కేన్

image

టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ చేసే సత్తా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉందని న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ ఓపెనర్ కాబట్టి ఎప్పుడైనా అతడి బ్యాట్ నుంచి ద్విశతకం రావచ్చు. ఈ IPLలో ఆ ఫీట్ నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రోహిత్‌కు ఇప్పటికే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన అనుభవం ఉంది కాబట్టి టీ20ల్లో కూడా అంత కష్టమేమీ కాదని అనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 18, 2024

జగన్‌పై దాడి.. నిందితుడికి 14 రోజుల రిమాండ్

image

AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు <<13078182>>సతీశ్‌కు<<>> విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని నెల్లూరు సబ్‌జైలుకు పోలీసులు తరలించనున్నారు. సీఎంను హతమార్చే ఉద్దేశంతోనే అతను రాయితో వచ్చాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపిన విషయం తెలిసిందే. కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడిని గుర్తించామన్నారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, కీలక ఆధారాలు సేకరించామని చెప్పారు.

News April 18, 2024

ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించి ప్రస్తావించొద్దు: కోర్టు

image

AP: ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మాట్లాడకూడదని కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య గురించి ప్రస్తావించొద్దని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, పురందీశ్వరి, బీటెక్ రవి, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతను ఆదేశించింది.

News April 18, 2024

6 చోట్ల పోలింగ్ సమయాల్లో మార్పు

image

AP: 6 అసెంబ్లీ స్థానాలు తప్ప అన్ని చోట్ల ఉ.7 నుంచి సా.6 వరకు పోలింగ్ జరుగుతుందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉ.7 నుంచి సా.4 వరకు, పాలకొండ, కురుపాం, సాలూరులో ఉ.7 నుంచి సా.5 వరకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. పోలింగ్ విధుల్లో 3.3 లక్షల మంది సిబ్బంది ఉంటారని, 300 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వస్తాయని వివరించారు.

News April 18, 2024

రేపటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

image

TG: టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రేపటి నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఎల్లుండి కర్ణాటకలో ప్రచారం చేస్తారు. 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.

News April 18, 2024

వారికి మాత్రమే ఓటు వేసే ఛాన్స్

image

TS: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈనెల 30న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. ఆ జాబితానే పోలింగ్‌కు ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే అందులో ఓటు హక్కు ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఈ నెల 30న ఓటుహక్కు పొందుతారు. రాష్ట్రంలో 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నట్లు ఫిబ్రవరిలో ఈసీ ప్రకటించింది.
<<-se>>#Elections2024<<>>