news

News February 14, 2026

BRS విప్ ఇస్తే గైర్హాజరయ్యేలా ఆ MLAల ప్లాన్!

image

TG: ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే MP, MLA, MLCలు కీలకంగా మారారు. ఈ తరుణంలో తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉంటున్న MLAల విషయంలో BRS తర్జనభర్జన పడుతోంది. విప్ జారీచేయాలని, దాన్ని ఉల్లంఘిస్తే కనుక అనర్హత కేసుకు బలం చేకూరుతుందని భావిస్తోంది. కాగా BRS విప్ ఇస్తే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం.

News February 14, 2026

చెన్నైలోని NITTTRలో ఉద్యోగాలు

image

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(NITTTR)12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. MTS పోస్టుకు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nitttrc.ac.in

News February 14, 2026

IND vs PAK: వర్షం అడ్డంకి లేదు.. ఫుల్ గేమ్ గ్యారంటీ?

image

రేపు కొలంబోలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణుల అంచనా. IND vs PAK మ్యాచ్ ప్రారంభమయ్యే టైమ్‌(7PM)కు స్కై క్లియర్‌గా ఉంటుందని అంటున్నారు. ఆట సమయంలో వర్షం పడే ఛాన్స్ తక్కువగా ఉందన్నారు. అదే జరిగితే ఓవర్ల తగ్గింపు లేకుండా పూర్తి మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం వర్షం వల్ల అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్నా రాత్రికల్లా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది.

News February 14, 2026

పనసలో కాయకుళ్లును ఎలా నివారించాలి?

image

పనసలో కాయకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజం 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున కలిపి పిందె సమయంలో పిచికారీ చేయాలి. మళ్లీ కాయ పెరుగుదల సమయంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చెట్టు చుట్టూ రాలిన ఆకులు, కుళ్లిన భాగాలను తొలగించి శుభ్రంగా ఉంచాలి. చెట్టుకు సరైన గాలి ప్రసరణ ఉండేలా కొమ్మలను కత్తిరించాలి. సరైన పోషకాలు, నీటి యాజమాన్యం పాటించాలి.

News February 14, 2026

ఎమ్మెల్యేలు మారకపోతే వారికే నష్టం.. CBN వార్నింగ్

image

AP: తాను గతంలో ఉన్నట్లే ఉంటానని, MLAలు మారకపోతే వాళ్లకే నష్టమని CM CBN హెచ్చరించారు. ‘9 పారామీటర్లతో సర్వే చేయించి వారికి సీల్డ్ కవర్‌లో ఇస్తున్నా. అది MLAల పనితీరుకు నిలువుటద్దం. వారికి తెలియని ఇంకొన్ని పారామీటర్లు నా వద్ద ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఇక మంగళగిరి చీరలకు లోకేశ్ బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని చెప్పారు. ఇవాళ మహిళా సభ్యులు ఒకేరకమైన చీరలతో సభకు రావడం వారి ఐక్యతకు నిదర్శనమని తెలిపారు.

News February 14, 2026

శివ నామాలు అర్థాలు ‘‘లింగోద్భవ’’

image

బ్రహ్మ, విష్ణువుల మధ్య ‘ఎవరు గొప్ప?’ అనే వివాదం తలెత్తినప్పుడు శివుడు ఒక అనంతమైన అగ్ని స్తంభంలా వెలిశాడు. దాని ఆది, అంతాలను ఎవరూ కనుగొనలేకపోయారు. ఆ అగ్ని స్తంభం నుంచే శివుడు ఆవిర్భవించాడు. ఇదే ‘లింగోద్భవ’ మూర్తి. అహంకారాన్ని వీడినప్పుడే దైవం కనిపిస్తుందని ఈ కథ చెబుతుంది. శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. ఆ పరమాత్మకు మొదలు, చివర లేదనే అనంతత్వానికి ఈ రూపం నిదర్శనం.

News February 14, 2026

ఏపీ పోలీస్ శాఖకు బడ్జెట్‌లో వరాలు

image

* కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు రూ.20 లక్షలు-రూ.45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పునరుద్ధరణ.
* టీఏ, డీఏలు, సెలవు బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం రూ.500 కోట్లు.
* పోలీస్ శాఖకు త్వరలోనే 3,000 కొత్త వాహనాలు.
* ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు.
* 94 ఎకరాల్లో కొత్త పోలీస్ అకాడమీ ఏర్పాటుకు రూ.15 కోట్లు.

News February 14, 2026

మున్సిపల్ ఎలక్షన్స్.. ఫైనల్ రిపోర్ట్ ఇదే

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలుచుకున్న వార్డుల వివరాలను SEC ప్రకటించింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2,995 వార్డులకుగాను కాంగ్రెస్ అత్యధికంగా 1,537 వార్డుల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్‌ 781, బీజేపీ 336, MIM 70, బీఎస్పీ 2, CPM 13, ఇతర పార్టీలు 73, స్వతంత్రులు 183 చోట్ల గెలిచారు.

News February 14, 2026

INDvsPAK.. మేం ఏ పక్షమూ వహించం: కబీర్

image

ఇండియాతో, అక్కడి ప్రజలతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నామని BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ అడ్వైజర్ హుమయూన్ కబీర్ వెల్లడించారు. తాము పర్యటించే దేశాల్లో భారత్ కూడా ఒకటని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పాక్‌వైపు మొగ్గుచూపుతున్నారా? అన్న ప్రశ్నకు ‘IND, PAK మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. కానీ మేం ఏ పక్షమూ వహించం. పరస్పర గౌరవం, జాతీయ ప్రయోజనాల ఆధారంగా మేము సంబంధాలను కొనసాగిస్తాం’ అని తెలిపారు.

News February 14, 2026

కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసింది: KTR

image

TG: లోకల్ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావం బాగా పెరిగిందని BRS నేత KTR పేర్కొన్నారు. కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆశించిన సీట్లు రాలేదని INCలో అసంతృప్తి ఉంది. BJPకి ఓట్లు, వార్డులు తక్కువ వచ్చినా అంతా బాగున్నట్లు చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదు. మా పార్టీ గట్టిగా పోరాడింది. ఇప్పుడున్న 17 మున్సిపాల్టీలతో పాటు హంగ్ స్థానాల్లోనూ ఎక్కువ గెలుచుకుంటాం’ అని మీడియాతో చెప్పారు.