India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈనెల 19న కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. ఆయన తరఫున సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. ఆరోజు ఉదయం కుప్పం లక్ష్మీపురంలోని శ్రీవరదరాజస్వామి ఆలయానికి చేరుకోకున్న భువనేశ్వరి.. నామినేషన్ పత్రాలకు పూజలు చేయించనున్నారు. అనంతరం పాతపేట చెరువుకట్ట కూడలి నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకుంటారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగిన వెంటనే లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా, యెమెన్ రెబల్స్ సైతం దాడులు ప్రారంభించాయి. ఇరాన్ మద్దతుతో నడిచే ఈ మిలిటెంట్ గ్రూపులు డ్రోన్లు, రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు హమాస్ సైతం కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. గాజాను వీడితేనే కాల్పులు విరమిస్తామని తేల్చి చెప్పింది.

AP: సీఎం జగన్‌పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ‘ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. ఇక ‘రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా!’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ 2019లో కోడికత్తి, 2024లో రాయి అని వాటి ఫొటోలు పోస్ట్ చేశారు.

అనువాదంలో జరిగిన చిన్న పొరపాటుకు భారతీయ రైల్వే నెట్టింట విమర్శలను ఎదుర్కొంటోంది. హటియా నుంచి ఎర్నాకులం రైలు పేర్ల అనువాదంలో నిర్వహకులు తప్పు చేశారు. హటియా అనే పేరును హత్య అనుకుని దానికి మలయాళంలో అదే అర్థం వచ్చే ‘కోలపతకం’గా దానిని అనువదించారు. ఆ రైలు బోర్డు మీద అదే రాశారు. ఈ ఫొటో కాస్త వైరలవడంతో తప్పు గ్రహించిన అధికారులు దానిని సరిదిద్దుకున్నారు.

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో సిబ్బంది ఇటీవల సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. 20వ పిల్లర్ కుంగిన నేపథ్యంలో 6,7,8 బ్లాక్‌లలో ఈ పరీక్షలు జరిపారు. మరోవైపు మిగతా బ్లాక్‌లలో పరిస్థితులు తెలుసుకునేందుకు నిర్మాణ సంస్థ, సంబంధిత అధికారులు పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్, జియో ఫిజికల్ పద్ధతిలో జీపీఆర్ టెస్ట్ వంటి పరీక్షలు చేపట్టనున్నారు.

TG: ఇప్పటికే 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై కాంగ్రెస్ గతకొంతకాలంగా తర్జనభర్జన పడుతోంది. నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అనంతరం దీనిపై తుది ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం గం.6.30కు శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఈ మీటింగ్ జరగనుంది.

అయోధ్య రామమందిరం ఊపులో యూపీలోని 80 లోక్‌సభ సీట్లూ గెలవాలనుకుంటున్న బీజేపీకి పశ్చిమ యూపీ తలనొప్పిగా మారింది. గతంలో ఇక్కడ బీజీపీకి మద్దతు వచ్చినా ఈసారి ఆ పరిస్థితి లేదు. రాజ్‌పుత్, త్యాగీ, సైనీ వర్గాలు అసంతృప్తితో ఉండటమే కారణం. ముఖ్యంగా తమ వర్గానికి తక్కువ సీట్లు కేటాయించడంపై రాజ్‌పుత్‌లు పెదవి విరుస్తున్నారట. మరోవైపు ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. <<-se>>#Elections2024<<>>

స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళను ఆఫీసుకు రమ్మని ఆమె పనిచేసే కంపెనీ బాస్ లేఖ రాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు ఎంత ఫిట్‌గా ఉందో తెలుసుకునేందుకు వైద్యుల నుంచి లేఖ తేవాలని ఆమె కోరింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఓ మహిళ అయ్యి ఉండి తోటి మహిళతో ఇలా ప్రవర్తించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. క్యాన్సర్ బాధితురాలనే కనికరం లేకుండా ఆఫీసుకు రమ్మనడం సరికాదని మండిపతున్నారు.

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలో ఈనెల 24 నుంచి న్యాయ విచారణ ప్రారంభంకానుంది. నాలుగు రోజుల పాటు విచారణ జరగనుందని సమాచారం. ఈనెల 25న మేడిగడ్డ ప్రాజెక్టును జస్టిస్ ఘోష్ సందర్శించనున్నారు. విచారణలో పలువురికి సమన్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కమిషన్.. న్యాయవాదులు, బ్యారేజీలకు సంబంధించిన సాంకేతిక సిబ్బంది, నిపుణులను నియమించుకోనుంది.

తమను కాదని విదేశీ సంస్థలు భారత్‌వైపు మొగ్గుచూపడంపై చైనా అక్కసువెళ్లగక్కింది. ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని స్థాపించేందుకు ఆసక్తి కనబర్చడాన్ని డ్రాగన్ తప్పుపట్టింది. ‘భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్ స్థాపిస్తే అది వర్కౌట్ కాకపోవచ్చు. స్థిరత్వం లేని, ఇంకా పూర్తిగా వృద్ధి చెందని మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం తొందరపాటు చర్య అవుతుంది’ అని చైనా అధికారిక పత్రిక ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
Sorry, no posts matched your criteria.