news

News April 26, 2024

అరెరె.. హెడ్ వీక్‌నెస్ తెలిసిపోయిందే!

image

SRH విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ బలహీనతను ప్రత్యర్థి జట్లు పట్టేశాయి. స్పిన్ బౌలింగ్‌లో ఆయన తడబడతారని తెలుసుకున్నాయి. ఇదే వ్యూహంతో నిన్న RCB తొలి ఓవరే స్పిన్నర్ విల్ జాక్స్‌తో వేయించింది. అనుకున్నట్లుగానే హెడ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఔటయ్యారు. IPLలో ఇప్పటివరకు స్పిన్నర్ల బౌలింగ్‌లో హెడ్ 150 స్ట్రైక్‌రేట్‌తో 63 పరుగులే చేశారు. అదే ఫాస్ట్ బౌలింగ్‌లో ఏకంగా 236 స్ట్రైక్‌రేట్‌తో 262 రన్స్ బాదారు.

News April 26, 2024

‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నటించినందుకు బన్నీ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు టాక్. ‘పుష్ప 1’కు అర్జున్ రూ.100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

News April 26, 2024

ఉపవాసం చేసి.. ఇద్దరు మృతి

image

గోవాలో మితిమీరిన ఉపవాసం ఇద్దరిని బలితీసుకుంది. ‘సోదరులు జూబేర్ ఖాన్ (29), ఆఫాన్ ఖాన్ (27) సహా తల్లి రుక్సానా కొంతకాలంగా రోజుకు ఒక ఖర్జూరం చొప్పున ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీంతో వారి ఆరోగ్యం క్షీణించింది. ఈ ఉపవాసాలపై విభేదాలు తలెత్తి వేరుగా ఉంటున్న రుక్సానా భర్త బుధవారం వారి ఇంటికి వచ్చి చూడగా సోదరులు విగత జీవులుగా కనిపించారు. స్పృహకోల్పోయిన రుక్సానా చికిత్స పొందుతోంది’ అని పోలీసులు తెలిపారు.

News April 26, 2024

గూగుల్ యాడ్స్‌కు బీజేపీ రూ.101కోట్లకుపైగా ఖర్చు

image

ప్రచారానికి బీజేపీ భారీగా ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గూగుల్, యూట్యూబ్‌లో యాడ్స్ కోసం ఏకంగా రూ.101కోట్లకుపైగా ఖర్చు చేసిన తొలి భారతీయ పార్టీగా నిలిచింది. కాంగ్రెస్, DMK పార్టీలు సహా I-PAC సంస్థ సంయుక్తంగా ఖర్చు చేసిన మొత్తంతో ఇది సమానమట. 2018 మే 31 నుంచి 2024 ఏప్రిల్ 25 మధ్య పబ్లిష్ అయిన గూగుల్ యాడ్స్‌లో BJP వాటా 26%గా ఉంది. మరోవైపు కాంగ్రెస్ రూ.45కోట్లు, DMK రూ.42కోట్లు ఖర్చు చేశాయి.

News April 26, 2024

ఆ సినిమా వల్ల సిగరెట్‌కు బానిసయ్యా: విద్యాబాలన్

image

తాను నటించిన ‘డర్టీపిక్చర్’ సినిమా వల్ల సిగరెట్లకు బానిసనయ్యానని హీరోయిన్ విద్యాబాలన్ తెలిపారు. ‘డర్టీ పిక్చర్‌లో సిగరెట్లు తాగే సీన్లు ఎక్కువగా చేశా. అలా సిగరెట్లు తాగడంతో దానికి అడిక్ట్ అయ్యా. ఆ సినిమా తర్వాత కూడా రోజుకు 2, 3 సిగరెట్లు తాగితే కానీ మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. ప్రస్తుతం తాగడం లేదు. అయితే కాలేజీ రోజుల్లోనే ఎవరైనా సిగరెట్ తాగితే ఆ పొగ ఆస్వాదించేదాన్ని’ అని ఆమె చెప్పారు.

News April 26, 2024

T20 WC బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్

image

టీ20 వరల్డ్ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమాల్లో యువీ పాల్గొననున్నారు. కాగా జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. వెస్టిండీస్, అమెరికాలో జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొననున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.

News April 26, 2024

బయటికి రావొద్దు: వాతావరణ శాఖ

image

TG: మండుతున్న ఎండల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 3 రోజులపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని పేర్కొంది. గత కొన్ని రోజుల కంటే 2,3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించింది. కాగా భానుడి ప్రతాపంతో హైదరాబాద్‌లోని పలు రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

News April 26, 2024

మంత్రి బుగ్గన నామినేషన్ పెండింగ్?

image

AP: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్‌ను డోన్ ఎన్నికల అధికారి పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు సమర్పించలేదని అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ అఫిడవిట్‌పై జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు అభ్యంతరం తెలిపారు. నెల్లూరు TDP MP అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అఫిడవిట్‌పై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారు.

News April 26, 2024

ఫేక్ న్యూస్‌ను కట్టడి చేద్దాం

image

Way2News పేరుతో కొందరు చేసే అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండండి. ఈ ఫేక్ న్యూస్ గుర్తించడం చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీకు వచ్చే స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. సెర్చ్‌లో సేమ్ ఆర్టికల్ వస్తే అది మేము పబ్లిష్ చేసిన వార్త. వేరే కంటెంట్ వచ్చినా, ఏ వార్త రాకపోయినా అది మా లోగో వాడి రూపొందించిన ఫేక్ న్యూస్. వీటిని grievance@way2news.comకు పంపండి.

News April 26, 2024

షర్మిల నిన్నటి వరకే చెల్లి: మంత్రి బొత్స

image

AP: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్నటి వరకే సీఎం జగన్‌కు చెల్లి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘వైఎస్ షర్మిల ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు. ఇక చెల్లి, అన్న సంబంధాలు ఎక్కడ ఉంటాయి? విమర్శలు చేసేటప్పుడు ఆమె సంయమనం పాటించాలి’ అని ఆయన తెలిపారు. సీఎం జగన్ తలకు పెట్టుకున్న బ్యాండేజీ ఎప్పుడు తీసేయాలన్న విషయాన్ని వైద్యులు చూసుకుంటారని మంత్రి బొత్స వివరించారు.