news

News April 30, 2024

20 జట్లు.. 55 మ్యాచ్‌లు

image

టీ20 వరల్డ్ కప్-2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొననున్నాయి. వెస్టిండీస్‌లో 6, అమెరికాలో 3 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్‌ 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. భారత్‌-పాక్‌ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమ్ఇండియా మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి.

News April 30, 2024

కోవిషీల్డ్ తీసుకున్నాక ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

తమ వ్యాక్సిన్ (కోవిషీల్డ్) తీసుకున్న వాళ్లలో కొందరికి అరుదైన సందర్భాల్లో Thrombocytopenia Syndrome వస్తుందని ఆస్ట్రాజెనెకా కంపెనీ కోర్టుకు చెప్పింది. దీని వల్ల రక్తం గడ్డకట్టడంతో పాటు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో తీవ్ర తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్లలో వాపు, మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News April 30, 2024

ప్లేట్ పానీ పూరీ రూ.333

image

ప్లేట్ పానీ పూరీ ధరను మనం ఇప్పటివరకు రూ.పదుల్లో చూసుంటాం. కానీ ముంబై ఎయిర్‌పోర్టులో ఏకంగా రూ.333కు విక్రయించడంపై ఓ పారిశ్రామికవేత్త అవాక్కయ్యారు. ఓ కంపెనీ సీవోవో కౌశిక్ ఈ స్నాక్స్ ధరలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ముంబై ఎయిర్‌పోర్టులో ధరలు ఎక్కువని తెలుసు. కానీ మరీ ఇంతలా ఉంటాయని ఊహించలేదు’ అంటూ అక్కడి ధరలను షేర్ చేశారు. ఇది చూసి నెటిజన్లు ‘పానీ పూరీ కాస్ట్‌లీ అయిపోతోంది’ అని అంటున్నారు.

News April 30, 2024

కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫొటో పెట్టొద్దని బీజేపీ చెప్పింది: సీఎం జగన్

image

AP: TDP-JSP-BJP కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. అన్నమయ్య జిల్లా కలికిరి సభలో మాట్లాడుతూ.. ‘బీజేపీ అధిష్ఠానం చంద్రబాబుకు ఫోన్ చేసింది. మేనిఫెస్టోలో మీ ఫొటోలు పెట్టుకోండి కానీ మోదీ ఫొటో పెడితే ఒప్పుకోబోమని స్పష్టం చేసింది. కూటమిలోని ముగ్గురి ఫొటోలు మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి లేదు. ప్రజలను మోసం చేయడానికి CBN బరితెగించారు. ఆయన హామీలు మోసమని తేలిపోయింది’ అని మండిపడ్డారు.

News April 30, 2024

కేజ్రీవాల్‌ను ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేశారు?: సుప్రీం

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్నికల ముందు అరెస్ట్ చేయడంపై ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారించింది. ‘పిటిషనర్ ఎత్తిచూపుతున్నట్లు ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు? కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు చూపండి’ అని ఆదేశించింది. దీనిపై మే 3న ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

News April 30, 2024

పుష్ప-2 నుంచి అల్లు అర్జున్ పోస్టర్ విడుదల

image

సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న పుష్ప-2 నుంచి ‘పుష్ప పుష్ప’ సాంగ్‌ రేపు సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఆ పాటలో అల్లు అర్జున్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలో తన ట్రేడ్ మార్క్ బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఓ భుజం పైకెత్తి, సిగరెట్ తాగుతూ ఉన్న ఐకాన్ స్టార్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో పాట రిలీజవుతుంది.

News April 30, 2024

మనకంటే నిఖార్సైన హిందువులు ఎవరైనా ఉన్నారా?: CM

image

BJP మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనతో కేంద్రం 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. మనం హిందువులం కాదా? బతుకమ్మ ఆడట్లేదా? దసరా, దీపావళి జరుపుకోవట్లేదా? మనకంటే నిఖార్సైన హిందువులు ఎవరైనా ఉన్నారా? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి’ అని అన్నారు.

News April 30, 2024

రిజల్ట్స్ c/o వే2న్యూస్

image

పబ్లిక్ పరీక్షల ఫలితాల విషయంలో Way2News మరోసారి నం.1గా నిలిచింది. AP ఇంటర్, TG ఇంటర్ తర్వాత ఇవాళ విడుదలైన TG SSC ఫలితాలనూ ఎక్కువ మంది వే2న్యూస్ ద్వారా తెలుసుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు TG SSC పరీక్షలు రాస్తే ఇవాళ ఏకంగా 96% మంది మన ప్లాట్‌ఫాం ద్వారా రిజల్ట్స్ పొందారు. మిగతా సైట్లు, ప్లాట్‌ఫాంలతో పోలిస్తే వేగంగా, సులువుగా, సేఫ్‌గా రిజల్ట్స్ ఇస్తామనే మీ నమ్మకం వల్లే ఇది సాధ్యమైంది.

News April 30, 2024

IPL: ప్లేఆఫ్స్‌కు ఇంగ్లండ్ ప్లేయర్లు దూరం

image

IPLలో పలు జట్లకు బిగ్ షాక్ తగలనుంది. ప్లేఆఫ్స్‌కు ఇంగ్లండ్ ప్లేయర్లు దూరం కానున్నారు. మే 22 నుంచి ఇంగ్లండ్ టీమ్ పాక్‌తో నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది. WCకు ఎంపిక చేసిన జట్టునే ఆ పర్యటనకు సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న బట్లర్, సాల్ట్, మొయిన్ అలీ, బెయిర్‌స్టో, జాక్స్, కరన్, టాప్లే, లివింగ్‌స్టోన్ ఆ సిరీస్ కోసం వెళ్లనున్నారు. మరోవైపు మే 21 నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి.

News April 30, 2024

సులువుగా వార్తలు వెరిఫై చేయండి

image

Way2News పేరుతో కొందరు ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. వీటిని వెరిఫై చేయడం చాలా సులువు. మేము పబ్లిష్ చేసే ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీకు వచ్చే స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. ఫార్వర్డ్‌గా పొందిన కంటెంట్ ఇక్కడ కన్పిస్తే అది మా వార్త. ఒకవేళ మీకు వేరే వార్తను చూపించినా, ఏది చూపించకపోయినా ఆ ఫార్వర్డ్ ఫేక్ అన్నట్లే. వీటిని grievance@way2news.comకు మెయిల్ చేయండి.