India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు(D) ఎమ్మిగనూరు ఆసక్తికర రాజకీయాలకు వేదిక. ఇద్దరు నేతల మధ్యే దశాబ్దాలుగా పోరు నడిచింది. 1985 నుంచి వరుసగా 4 సార్లు TDP అభ్యర్థి బి.వి మోహన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి రెండేసి సార్లు కాంగ్రెస్, YCP తరఫున నెగ్గారు. ఈసారి సిట్టింగ్ MLA చెన్నకేశవరెడ్డిని కాదని మాజీ MP బుట్టా రేణుకను YCP బరిలోకి దింపింది. టీడీపీ నుంచి మాజీ MLA బీవీ జయనాగేశ్వరరెడ్డి నిలిచారు. <<-se>>#ELECTIONS2024<<>>

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్(42) మూడోసారి విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారి(30) నుంచి ఆమె 8 నెలల కిందటే విడిపోగా, తాజాగా లాస్‌ఏంజెలిస్ కోర్టు డివోర్స్ మంజూరు చేసింది. కాగా బ్రిట్నీ 2004లో చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్‌ను పెళ్లాడి ఏడాదికే విడిపోయారు. తర్వాత కెవిన్ ఫెడెర్‌లైన్‌ను వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్నారు.

AP: అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్ అమలు చేస్తామని TDP చీఫ్ చంద్రబాబు ధర్మవరం సభలో ప్రకటించారు. ‘దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచుతాం. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24వేలు ఇస్తాం. పింఛన్ కోసం జగన్ వృద్ధులను పొట్టన పెట్టుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని EC సూచించినా.. మండుటెండలో సచివాలయానికి రావాలని ఇబ్బంది పెట్టారు. శవ రాజకీయాలు చేసే సీఎంను ఇంటికి పంపాలి’ అని పిలుపునిచ్చారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌లో అభివృద్ధిని చూసి POK ప్రజలు స్వచ్ఛందంగా భారత్‌లో చేరాలనుకుంటున్నారని అన్నారు. ‘జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయి. అక్కడ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసే సమయం దగ్గర్లోనే ఉంది. హోంశాఖ దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకోనుంది’ అని పేర్కొన్నారు.

AP: గత ఎన్నికల సమయంలో అమిత్ షా చేసిన ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్తారని ఆశిస్తున్నామని YCP ట్వీట్ చేసింది. ‘చంద్రబాబు పనితీరును అమిత్ షా విమర్శించారు. ఆయన జాతీయవాదాన్ని ప్రశ్నించారు. CMగా అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్‌తో అపవిత్ర పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్, వాజ్‌పేయీకి వెన్నుపోటు పొడిచారన్నారు. వీటన్నిటికీ బాబు తగిన సమాధానం చెప్పాలి’ అని రాసుకొచ్చింది.

ముంబై ఫ్లైట్‌లో వెళ్తున్న సమయంలో SRH ఆటగాడు రాహుల్ త్రిపాఠీ బ్యాట్ మిస్ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. ‘మా జట్టు SRHతో ఇండిగో విమానం(6E5099)లో హైదరాబాద్ నుంచి ముంబై ప్రయాణిస్తుండగా నా క్రికెట్ కిట్ నుంచి బ్యాట్ మిస్ అయింది. ఇది నాకు చాలా బాధ, నిరాశ, అసహనాన్ని కలిగించింది. ఇండిగో సంస్థ వెంటనే స్పందించి నా బ్యాట్ తిరిగి నాకు వచ్చేలా చూడాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు.

మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఒకే గ్రూపులో ఉన్న ఇండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 6న మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం 23 మ్యాచులు నిర్వహించనున్నారు. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనుండగా, 20న ఫైనల్ జరగనుంది. భారత్ ఆడే మ్యాచులు అక్టోబర్ 4, 6, 9, 13 తేదీల్లో జరగనున్నాయి.

AP: ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జగన్‌కు ముందే తెలుసని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. ‘గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా చేశారు. ఇప్పుడేమో గులకరాయి దాడి నాటకాలు ఆడుతున్నారు. ఓటమి ఖాయమని తెలిసి.. కొత్త నాటకాలు మొదలుపెట్టారు. పెన్షన్ విషయంలో వృద్ధులను పొట్టన పెట్టుకున్నారు. మండుటెండలో సచివాలయాలకు రమ్మని ఇబ్బంది పెట్టారు. శవ రాజకీయాలు చేసే సీఎంను ఇంటికి సాగనంపాలి’ అని కోరారు.

మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ చేసిన తాజా వ్యాఖ్యలు నెట్టింట ఆయనపై ట్రోలింగ్‌కు దారి తీశాయి. నిన్న రాత్రి ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మళ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే మ్యాక్స్‌వెల్ అత్యంత ఓవర్‌రేటెడ్ ఆటగాడు అంటూ పార్థివ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ అయింది. పలువురు ఆర్సీబీ, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఆయన హైట్‌ను హేళన చేస్తూ ట్రోల్ చేశారు.

ఉత్తరం-దక్షిణం, కులం-మతం.. ఇలా పలు వైరుధ్యాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలామంది బ్రిటిష్ కాలం నుంచి ఎత్తులు వేస్తున్నారు. కానీ ఓటర్లు చాలా పరిణతి చెందారు. దక్షిణాది ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని నేను హామీ ఇస్తున్నా. అలాగే అన్ని మతాల అభివృద్ధితో కూడిన వికసిత్ భారత్ కోసం ప్రజలు ఐక్యంగా ఉన్నారు. తమ ఓటు ద్వారా ఆ విషయాన్ని నిరూపిస్తారన్న నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.