news

News May 6, 2024

పవన్ నా కుటుంబాన్ని రోడ్డుకు లాగాడు: ముద్రగడ

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్‌ తన కుటుంబాన్ని రోడ్డుకు లాగాడని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ‘నేను చిరంజీవి, పవన్‌ గురించి ఏరోజూ మాట్లాడలేదు. నా కుటుంబంలో పవన్ చిచ్చు పెట్టాడు. నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీ కుటుంబంలో డ్రగ్స్‌తో పట్టుబడిన అమ్మాయిని, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని, మీరు వదిలేసిన ఇద్దరు భార్యల్ని ఎందుకు పరిచయం చేయట్లేదు? నాపై ప్రేమ నటించొద్దు’ అని పేర్కొన్నారు.

News May 6, 2024

భారత్‌లో అవకాశాలు అపారం: వారెన్ బఫెట్

image

భారత మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి అపార అవకాశాలున్నాయని అమెరికా వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ పేర్కొన్నారు. తమ సంస్థ బెర్క్‌షైర్ హాత్‌వే త్వరలోనే ఆ అవకాశాలను దక్కించుకోనుందని తెలిపారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. సంస్థ వార్షిక సమావేశంలో బఫెట్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇక యాపిల్‌లో తమ వాటాలను తగ్గించుకోవడం వెనుక ఎటువంటి దీర్ఘకాలిక వ్యూహం లేదని స్పష్టం చేశారు.

News May 6, 2024

LT యాక్ట్‌కి మాజీ ఐఏఎస్ బలయ్యారు: టీడీపీ

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు <<13191140>>తాను<<>> ప్రత్యక్ష బాధితుడినని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ చేసిన ట్వీట్‌పై టీడీపీ స్పందించింది. ‘36 ఏళ్ల పాటు ఐఏఎస్‌గా సేవలందించిన ఉన్నతాధికారి కూడా జగన్ తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌కి బలయ్యారు. ఇక ఈ భూ దొంగల ముఠా చేతిలో సామాన్యుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, మన ఊహకి కూడా అందదు. చివరకు మీరు కష్టపడి సంపాదించిన మీ సొంత ఇల్లు కూడా మీది కాదు’ అని ట్వీట్ చేసింది.

News May 6, 2024

IPL: ధోనీ రికార్డు బ్రేక్ చేసిన జడేజా

image

CSK ప్లేయర్ రవీంద్ర జడేజా ఆ జట్టు తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు(16) గెలుచుకున్న ఆటగాడిగా నిలిచారు. దీంతో ఇప్పటివరకు ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ(15) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. పంజాబ్‌తో మ్యాచులో అతను ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో రైనా(12), గైక్వాడ్(11), హస్సీ(10) ఉన్నారు.

News May 6, 2024

ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి

image

Way2News పేరుతో కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మా వార్తలను సులువుగా వెరిఫై చేయొచ్చు. మేము పబ్లిష్ చేసే ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీరు పొందిన ఫార్వర్డ్ స్క్రీన్‌షాట్‌పై ఉన్న కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. వేరే వార్తను చూపించినా, ఏ వార్త రాకపోయినా మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ ఆర్టికల్ మాది కాదని గ్రహించండి. ఇలాంటి ఫేక్ వార్తలను grievance@way2news.comకు మెయిల్ చేయండి.

News May 6, 2024

గణపతి ప్రతిమను తీసుకెళ్తా: సునీతా విలియమ్స్

image

మరోసారి అంతరిక్షయానానికి సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ (59) ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రయాణంలో వెంట గణపతి ప్రతిమను తీసుకెళ్తానని, దీంతో అదృష్టం కలిసొస్తుందని భావిస్తానన్నారు. కాగా గత రెండు అంతరిక్షయానాల్లోనూ ఆమె వెంట భగవద్గీత తీసుకెళ్లారు. వీరు ప్రయాణించనున్న బోయింగ్ స్టార్ లైనర్‌ రేపు USలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం గం.8.00కి (భారత కాలమానం ప్రకారం) లాంచ్ కానుంది.

News May 6, 2024

వచ్చే నెల 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

సికింద్రాబాద్‌లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నివీర్(GD), అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ TDN పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 20న తె.5గం.కు మొదటి EME సెంటర్, 4వ ట్రైనింగ్ బెటాలియన్, కోటేశ్వర్‌ద్వార్ వద్దకు రావాలని తెలిపారు. వివరాల కోసం 040-27863016 లేదా ఆర్మీ <>వెబ్‌సైట్‌<<>>లో సంప్రదించాలన్నారు.

News May 6, 2024

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో 2024-25 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 8న ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. https://rgukt.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు RGUKT <>వెబ్‌సైట్<<>> చూడండి.

News May 6, 2024

నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ బాధితుడిని: పీవీ రమేశ్‌

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తాను ప్రత్యక్ష బాధితుడినని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ తెలిపారు. ‘కృష్ణా జిల్లా విన్నకోటలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీఓ వెనక్కి పంపించేశారు. 36ఏళ్ల పాటు ఐఏఎస్‌గా సేవలందించిన అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల దుస్థితిని ఊహించలేం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News May 6, 2024

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2014లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘గీతాంజలి’ మూవీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. గత నెల 11న థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.