news

News May 8, 2024

అంబానీ, అదానీ గురించి ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు?: మోదీ

image

TG: ఇన్నాళ్లూ అంబానీ, అదానీ అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఎందుకు వాళ్ల గురించి మాట్లాడటం లేదని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘ఆ యువరాజు(రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) పొద్దున లేస్తే అంబానీ, అదానీ అని మాట్లాడేవాడు. మరి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నాడు. వారి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంత తీసుకుంది? గుట్టలకొద్దీ డబ్బుల కట్టల గురించి ఆ పార్టీ సమాధానం చెప్పాలి’ అని మోదీ డిమాండ్ చేశారు.

News May 8, 2024

BUZZ: ప్రభాస్ కోసం మహేశ్ వాయిస్ ఓవర్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, సినిమాపై మరింత ఆత్రుత పెంచేందుకు మేకర్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబును రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విష్ణు అవతారంలో ఉన్న ప్రభాస్‌ను పరిచయం చేసే సన్నివేశానికి మహేశ్‌తో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే నాగ్ అశ్విన్ టీమ్ బాబుని సంప్రదించినట్లు టాక్.

News May 8, 2024

అవినీతిలో BRS, కాంగ్రెస్ ఒక్కటే: మోదీ

image

కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు విచారణ జరపట్లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ‘అవినీతిలో BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా లేదు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు BRS అవినీతి గురించి మాట్లాడింది. ఇప్పుడు దర్యాప్తు చేయట్లేదు. ఓటుకు నోటు కేసులో చిక్కిన కాంగ్రెస్ నాయకులపై ఇప్పటివరకు దర్యాప్తు లేదు. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని మోదీ విమర్శించారు.

News May 8, 2024

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఫ్యామిలీ ఫస్ట్: మోదీ

image

TG: బీజేపీకి నేషనల్ ఫస్ట్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఫ్యామిలీ ఫస్ట్ అని వేములవాడ సభలో ప్రధాని మోదీ విమర్శించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలను అవినీతే కలుపుతోంది. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాపాడాలి. మాజీ ప్రధాని పీవీ నరసింహరావును కాంగ్రెస్ అవమానించింది. చివరికి ఆయన పార్థివదేహాన్ని తమ పార్టీ ఆఫీస్‌లోకి రానివ్వలేదు’ అని మోదీ మండిపడ్డారు.

News May 8, 2024

మూడో ఫేజ్‌లో కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయింది: మోదీ

image

TG: వేములవాడ సభలో ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఇండియా కూటమికి పరాభవమే ఎదురైంది. మూడో ఫేజ్‌లో వారి ఫ్యూజ్ ఎగిరిపోయింది. మిగిలిన 4 విడతల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైంది’ అని మోదీ తెలిపారు.

News May 8, 2024

మారిన వాతావరణం.. తగ్గిన విద్యుత్ వినియోగం

image

TG: రాష్ట్రంలో వాతావరణం మారిపోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 2000 మెగావాట్ల వాడకం తగ్గిపోగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురవడంతో వినియోగం తగ్గిపోయింది. ఒక్క ఖమ్మంలోనే సోమవారం 315 మెగావాట్ల కరెంట్ వినియోగించగా.. మంగళవారానికి అది 55 మెగావాట్లకు పడిపోవడం గమనార్హం. వచ్చే 3,4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వినియోగం తక్కువగా ఉండనుంది.

News May 8, 2024

ఏపీలో ఎవరి జ్యోతిషం నిజం కాబోతోంది?

image

ఇప్పుడు ఎన్నికల్లో ప్రజా సమస్యలు, పరిష్కారాలు, మేనిఫెస్టోలతో పాటు జ్యోతిషాలూ ప్రభావిత అంశాలుగా మారాయి. ఏపీ విషయానికొస్తే ఈసారి కూటమికి విజయావకాశాలు ఎక్కువని ప్రముఖ ఆస్ట్రాలజర్ విజయేంద్ర మన్యం చెబుతున్నారు. గ్రహాల కదలికలను బట్టి 140కి పైగా స్థానాలు త్రయం సొంతం కావచ్చన్నారు. అటు జగన్ మరోసారి సీఎం అవుతారనేది శ్రీధర్ స్వామి అంచనా. మరి ఎవరి అంచనాలు నిజం అవుతాయో జూన్ 4న తేలిపోనుంది. మీరేమంటారు?

News May 8, 2024

కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే ప్రధాని మోదీ: బండి

image

TG: వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న ఒకే ఒక్క PM నరేంద్ర మోదీ అని BJP నేత బండి సంజయ్ తెలిపారు. ‘కాశీ(వారణాసి)లో పోటీ చేస్తున్న ఆయన ఈ దక్షిణ కాశీ(వేములవాడ)కి విచ్చేయడంతో నా ఒల్లు పులకరించిపోతోంది. స్వయంగా ఆ కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే PM మోదీ. ఇంత అదృష్టం కల్పించిన కొండగట్టు అంజన్నకు, ధర్మపురి లక్ష్మీనరసింహుడికి, నన్ను కన్న తల్లికి పాదాభివందనం’ అంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.

News May 8, 2024

సిక్ లీవ్‌లో ఎయిర్ ఇండియా సిబ్బంది.. 70 విమానాలు రద్దు!

image

ఎయిర్ ఇండియాకు చెందిన 70కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఒక విభాగంలోని సిబ్బంది అంతా ఉన్నట్టుండి సిక్ లీవ్ పెట్టారని, దీంతో నిన్న రాత్రి నుంచి నేటి ఉదయం వరకు పలు విమానాలు రద్దయినట్లు సంస్థ తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటూ ప్రయాణికులను క్షమాపణలు కోరింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకి వచ్చే ముందు తమ ఫ్లైట్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది.

News May 8, 2024

SRH vs లక్నో మ్యాచ్.. వర్షంపై UPDATE

image

ఇవాళ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-లక్నో మధ్య జరిగే మ్యాచుకు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షం పడే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని, స్వల్ప అంతరాయం తప్ప మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశమే లేదని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల వాతావరణం చల్లగా ఉంటుందని చెప్పారు.