news

News May 21, 2024

కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ: పొంగులేటి

image

TG: ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ‘అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తాం. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’ అని ఆయన హామీ ఇచ్చారు.

News May 21, 2024

VIRAT KOHLI: ఆడి.. ఆడించి..

image

నెలరోజులు గెలుపు మొహమే చూడని RCB తర్వాత పుంజుకుని ప్లేఆఫ్స్ చేరడం స్ఫూర్తిదాయకం. కానీ RCB దశ తిరగడానికి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రధాన కారణం. కోహ్లీ పట్టుదలతోనే ఆ జట్టు ప్లేఆఫ్స్ వరకు వచ్చింది. టోర్నీలో ఇప్పటివరకు ఆయన 708రన్స్ బాదారు. అతడిని ఆదర్శంగా తీసుకొని పాటీదార్, డుప్లెసిస్, యశ్ దయాల్ వంటి ప్లేయర్స్ రాణిస్తున్నారు. కోహ్లీలోని కసి అందరికీ పాకింది. దీంతో ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది.

News May 21, 2024

వడ్లకు బోనస్‌ పేరుతో కాంగ్రెస్ బోగస్: కేటీఆర్

image

TG: సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ అని మంత్రి పొంగులేటి <<13283753>>ప్రకటించడంపై<<>> కేటీఆర్ Xలో మండిపడ్డారు. ‘ప్రచారంలో వరి పంటకు బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? రైతు భరోసా రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇవ్వలేదు. డిసెంబర్ 9నే రూ.2 లక్షల రుణమాఫీ చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు బోనస్ విషయంలోనూ ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు’ అని ఫైరయ్యారు.

News May 21, 2024

వరంగల్‌లో రంజీ మ్యాచ్‌లు: జగన్

image

TG: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌లో రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. వరంగల్‌లో కొత్త స్టేడియం నిర్మాణంపై అపెక్స్‌లో చర్చిస్తామన్నారు. ‘త్వరలోనే వరంగల్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేస్తాం. ప్రతీ జిల్లాలో స్టేడియం నిర్మిస్తాం. రాష్ట్ర స్థాయి టీ20 టోర్నమెంట్ నిర్వహిస్తాం. ప్రతిభావంతులను గుర్తించేందుకే సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.

News May 21, 2024

బీజేపీ అభ్యర్థుల్లో 106 మంది వలస పక్షులే!!

image

ఈసారి BJP దేశవ్యాప్తంగా 435 MP స్థానాల్లో పోటీ చేస్తుండగా, అందులో 106 మంది రాజకీయ ఫిరాయింపుదారులే. వారిని గత పదేళ్లలో వివిధ పార్టీల నుంచి కమల దళం ఆకర్షించింది. బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవడానికే BJP ఈ పని చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. APలో ఐదుగురు, తెలంగాణలో 11 మంది వలసదారులే కావడం గమనార్హం. ఈ ఫార్ములా కాషాయ పార్టీకి మరోసారి విజయాన్ని కట్టబెడుతుందేమో వేచి చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

News May 21, 2024

USలో ఇండియా ‘జనరిక్స్’దే హవా

image

తక్కువ ధరకు జనరిక్ మందుల సరఫరాలో భారత కంపెనీలు సత్తా చాటుతున్నాయి. 2022లో USలోని రోగులు వినియోగించిన మొత్తం జనరిక్స్‌లో 47% మన కంపెనీలవే. మానసిక రుగ్మతలు, హైపర్ టెన్షన్, లిపిడ్ రెగ్యులేటర్స్, యాంటీ అల్సర్స్, డయాబెటిస్ సంబంధ మందులు ఎక్కువగా వాడుతున్నారట. దీనివల్ల 2022లో US హెల్త్ డిపార్ట్‌మెంట్ 219 బిలియన్ డాలర్లు ఆదా చేయగలిగింది. 2013-2022 మధ్య ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లను పొదుపు చేసింది.

News May 21, 2024

మాటలు రాని పిల్లల కోసం అమ్మ యాప్

image

TG: వరంగల్ NIT విద్యార్థులు మాటలు సరిగా రాని పిల్లల కోసం అమ్మ పేరుతో ఓ యాప్‌ను రూపొందించారు. తొలిదశలో 50 పదాలతో ఆటల రూపంలో మాటలు మాట్లాడేలా, మాటలు రాని, బుద్ధిమాంధ్యం గల 3-5 ఏళ్లలోపు పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని ఆవిష్కరించారు. చిన్నారులకు త్వరగా మాటలు వచ్చేలా ఈ యాప్ ఒక వ్యాయామంలా ఉపయోగపడుతుందని దాన్ని రూపొందించిన విద్యార్థులు తెలిపారు. త్వరలోనే గూగుల్ ప్లే‌స్టోర్‌లో దీనిని అందుబాటులో ఉంచనున్నారు.

News May 21, 2024

రావణుడి పాత్ర కోసం రియల్ గోల్డ్?

image

నితేశ్ తివారి తెరకెక్కిస్తోన్న ‘రామాయణ’లో రావణుడి పాత్ర చేస్తున్న యశ్ నిజమైన బంగారు అభరణాలు వినియోగించనున్నట్లు సమాచారం. రావణుడు స్వర్ణ నగరమైన లంకాధిపతి కాబట్టి ఇలా చేయనున్నట్లు తెలుస్తోంది. సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్ కపూర్ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీకి సహనిర్మాతగానూ యశ్ వ్యవహరిస్తున్నారు.

News May 21, 2024

మహిళలకు గుడ్‌న్యూస్

image

AP: 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.27 లక్షల పొదుపు సంఘాలకు ₹32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని AP ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల్లో చేరిన లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో 5.39 లక్షల సంఘాలకు ₹20,437 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ₹42,533 కోట్ల రుణాలు అందించామంది. ఈసారి కూడా లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని తెలిపింది.

News May 21, 2024

అత్యధిక సిజేరియన్‌లు చేసిన ఆస్పత్రులకు నోటీసులు

image

AP: గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో 362 మాతృమరణాలు చోటుచేసుకోగా, ఇందులో 189 మంది సిజేరియన్ చేయించుకున్నవారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో 90 శాతంపైగా సీసెక్షన్‌లే ఉంటున్నాయి. దీంతో అలాంటి 125 ఆస్పత్రులకు రాష్ట్ర వైద్య శాఖ నోటీసులు పంపింది. ఎక్కువ సిజేరియన్లు చేయడానికి గల కారణాలు తెలపాలని ఆదేశించింది.