India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ప్రభుత్వ స్కూళ్లలో ఐటీ స్కిల్ కోర్సులపై విద్యార్థులకు శిక్షణనివ్వడానికి ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌ను ప్రభుత్వం నియమించనుంది. జిల్లాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫైనలియర్ చదువుతున్న టాప్-3 స్టూడెంట్స్‌ను ఎంపిక చేయాలని DEOలను ఆదేశించింది. మూడు స్కూళ్లకు ఒకరి చొప్పున మొత్తం 2,379 మందిని నియమించనుంది. వీరికి నెలకు రూ.12వేల గౌరవ వేతనం, ప్రతి KM దూరం ప్రయాణానికి రూ.2 చొప్పున చెల్లించనుంది.

ఏపీలో అత్యధికంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ రికార్డు అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఎంపీ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖలో 71.11% పోలింగ్ నమోదు అయింది.

10 సిక్సర్లు- బుమ్రా (311 బాల్స్)
10- జడేజా (264)
11- బౌల్ట్ (254)
11- దయాల్ (259)
14- అశ్విన్ (258)
14- సునీల్ నరైన్ (282)
15- భువనేశ్వర్ (270)
15- తుషార్ దేశ్ పాండే (264)
15- అక్షర్ పటేల్ (264)

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఐటీఐ <

ప్రధాని మోదీ పోటీ చేయనున్న వారణాసిలో 41 మంది నామినేషన్ వేశారు. చివరిరోజు కావడంతో కమెడియన్ శ్యామ్ రంగీలాతో సహా 27మంది విజయవంతంగా నామినేషన్ వేశారు. దీనిపై శ్యామ్ రంగీలా స్పందిస్తూ.. ‘మీ సపోర్ట్‌తో విజయవంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాను. నా ఎన్నికల భవిష్యత్తు ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది. ప్రజాస్వామ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. రాబోయే మూడు రోజులు కీలకం’ అని ట్వీట్ చేశారు.

AP: కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారం గనిలో 2024 చివరికల్లా బంగారం ఉత్పత్తి మొదలవనున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో ఇదే తొలి ప్రైవేటు బంగారు గని. దీని కోసం జెమైర్‌సోర్ సర్వీసెస్ కంపెనీ ఇప్పటికే 250ఎకరాల భూసేకరణ చేసింది. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు 60%పూర్తయినట్లు సమాచారం. ఇది ప్రారంభమైతే ఏటా 750కిలోల బంగారం ఉత్పత్తవుతుందని అంచనా. దీనిపై ఇప్పటి వరకు రూ.200కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సంస్థ తెలిపింది.

*అల్లూరి- 70.20 *అనకాపల్లి- 83.84
*అనంతపురం- 79.25 *అన్నమయ్య- 76.23
*బాపట్ల- 84.98 *చిత్తూరు- 82.65
*డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ- 83.91 *ఈస్ట్ గోదావరి- 80.94
*ఏలూరు- 83.55 *గుంటూరు- 78.81
*కాకినాడ- 80.31 *కృష్ణా- 84.05
*కర్నూలు- 75.83 *నంద్యాల- 80.92 *ఎన్టీఆర్- 79.68 (మిగిలిన జిల్లాల వివరాలు తర్వాతి ఆర్టికల్‌లో)

*పల్నాడు- 85.65 *పార్వతీపురం- 77.10
*ప్రకాశం- 87.09 *నెల్లూరు- 78.10
*సత్యసాయి- 82.77 *శ్రీకాకుళం- 76.07
*తిరుపతి- 77.82 *విశాఖ- 68.63
*విజయనగరం- 81.34 *వెస్ట్ గోదావరి- 82.70
*వైఎస్సార్- 79.40

‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న తేజా సజ్జతో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ సినిమా చేయనున్నారట. ఇందుకు సంబంధించి కథాచర్చలు జరుగుతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం హీరో రామ్‌తో ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ విడుదల తర్వాత తేజతో చేసే సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.

AP: ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్రబలగాలు సైతం పహారా కాస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.