news

News May 16, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.

News May 16, 2024

కేజ్రీవాల్‌కు ED సమన్లపై జూలై 11న విచారణ

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జూలై 11న విచారణ జరపనున్నట్లు ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. కాగా.. ఈడీ ఇచ్చిన సమాధానంపై బదులివ్వడానికి కేజ్రీవాల్‌కు మరో నాలుగు వారాలు సమయం ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇదే లిక్కర్ కేసులో జైలుకెళ్లిన ఆప్ నేత మనీశ్ సిసోడియా కస్టడీని మే 30 వరకు పొడిగించింది. తదుపరి వాదనలూ అదే రోజు వింటామని కోర్టు పేర్కొంది.

News May 16, 2024

ఈ ఏడాదితో ముగియనున్న కామన్ అడ్మిషన్ల గడువు

image

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం TG విద్యాసంస్థల్లో AP విద్యార్థులకు పదేళ్ల పాటు సీట్లు కల్పించే గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియనుంది. దీంతో 2025-26 విద్యాసంవత్సరం నుంచి AP కోటాకు(15%) బ్రేక్ పడనుంది. సీట్లన్నీ TG విద్యార్థులకే ఇవ్వనున్నారు. ఈ ఏడాది నోటిఫికేషన్లన్నీ జూన్‌కు ముందే రావడంతో కామన్ అడ్మిషన్లకు ఛాన్సుంది. ఈసారి TS EAPCET సహా పలు ప్రవేశ పరీక్షలకు AP స్టూడెంట్స్ నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి.

News May 16, 2024

స్టెయిన్ బౌలింగ్ వీడియోలు 100 సార్లు చూశా: రోహిత్ శర్మ

image

తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ డెయిల్ స్టెయిన్ అని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. అప్పట్లో బ్యాటింగ్ చేసే ముందు అతని బౌలింగ్ వీడియోలను 100 సార్లు చూసేవాడినని చెప్పారు. అతను వేగంగా వేయడంతో పాటు బాల్‌ను స్వింగ్ చేస్తారని, అందుకే ఆడటం కష్టంగా ఉంటుందన్నారు. తాను ఇంకా కొన్నేళ్లు క్రికెట్ ఆడతానని, వరల్డ్ క్రికెట్‌లో ఇంపాక్ట్ చూపించాలనుకుంటున్నానని ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు.

News May 16, 2024

‘ఉపాధి హామీ’లో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్

image

ఉపాధి హామీ పథకంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పనిదినాలను ప్రభుత్వం కల్పించింది. మొత్తం 32.37 లక్షల కుటుంబాలు రూ.1,713.27 కోట్ల మేర లబ్ధి పొందాయి. కాగా 45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు కల్పించి తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, బిహార్ ఉన్నాయి.

News May 16, 2024

అమృత్‌పాల్ సింగ్ నామినేషన్‌కు ఆమోదం.. ఎంపీగా పోటీ

image

ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ నామినేషన్‌ను ఈసీ ఆమోదించింది. ఆయన పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆయన అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు. వారిస్ పంజాబ్ దే వ్యవస్థాపకుడు దీప్ సిద్ధూ మరణం తర్వాత అమృత్‌పాల్ వెలుగులోకి వచ్చాడు. తనకు తాను అధినేతగా ప్రకటించుకున్నాడు. ఇతడికి ISISతోనూ సంబంధాలున్నట్లు తేలింది.

News May 16, 2024

పీజీలో అడ్మిషన్ కావాలా?

image

TG: పీజీ కాలేజీల్లో అడ్మిషన్లకు మే 18 నుంచి జూన్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జులై 5న కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET) జరగనుంది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, JNTUH పరిధిలోని 297 పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఈడీ లాంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సైట్: http://www.ouadmissions.com/doa/

News May 16, 2024

దేవర సాంగ్ వింటే ‘హుకుం’ మర్చిపోతారు: నాగవంశీ

image

‘దేవర’ సినిమా నుంచి ఈనెల 19న విడుదల కానున్న ఫియర్ సాంగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ప్రముఖ సినీనిర్మాత నాగవంశీ తెలిపారు. Jr.NTR ఫ్యాన్స్‌కి ఇది పర్ఫెక్ట్ మాస్ ఆంథమ్ అని, ఈ పాట విని ‘జైలర్’ సినిమాలోని ‘హుకుం’ సాంగ్‌ను మర్చిపోతారని ట్వీట్ చేశారు. ‘దేవర ముంగిట నువ్వెంత’ అనే ఓ లైన్‌ను తన పోస్టులో రాసుకొచ్చారు. దేవర సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

News May 16, 2024

నేడు నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసనలు

image

TG: నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తానని సీఎం చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. అలాగే రైతుభరోసా ఇవ్వట్లేదని, వడ్లు కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తిన కేసీఆర్.. BRS కార్యకర్తలు రైతుల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు.

News May 16, 2024

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

image

AP: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఛైర్మన్.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.