India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐపీఎల్‌లో ఒకే వేదికలో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఆరో బౌలర్‌గా అశ్విన్ నిలిచారు. నిన్న చెన్నైలో CSKతో జరిగిన మ్యాచులో ఈ ఘనత సాధించారు. అతనికంటే ముందు నరైన్ (కోల్‌కతా -70), మలింగా (68-ముంబై), అమిత్ మిశ్రా (ఢిల్లీ-58), చాహల్ (బెంగళూరు-52), బుమ్రా (ముంబై-52) ఈ ఫీట్‌ను అందుకున్నారు.

దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.35 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. ఏపీలో 9.21 శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఇదే సమయానికి ఏపీలో 10శాతం ఓటింగ్ నమోదవడం గమనార్హం. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు.

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగతో హైదరాబాద్ ఖాళీ అయింది. నిత్యం విపరీతమైన రద్దీ ఉండే అమీర్‌పేట మెట్రో స్టేషన్ వెలవెలబోతోంది. సాధారణ రోజుల్లో అక్కడ కాలు పెట్టేందుకు కూడా వీలుండదు. ఈ ఉదయం మాత్రం పూర్తిగా ఖాళీగా కనిపించింది.

AP: ఈ సారి రాష్ట్రంలో కొత్త ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. 18-19 ఏళ్ల వారు 10,30,616 మంది ఉన్నారు. వీరు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.68 లక్షల మంది యువకులు, 4.62 లక్షల మంది యువతులు ఉన్నారు. అభ్యర్థుల తలరాతను వీరు మార్చబోయే అవకాశం ఉంది.

TG: ఖమ్మం(D) ఏన్కూరు(M) రాయమాదారం గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదని పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు యాదాద్రి జిల్లా పోచంపల్లి(M) కనుముక్కలలో రైతులు ధర్నా చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.

TG: బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఓటు వేసి మోదీ పేరును ప్రస్తావించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కోరారు.

IPL-2024లో వరుసగా 5 మ్యాచులు గెలిచిన జట్టుగా RCB రికార్డు సృష్టించింది. నిన్న ఢిల్లీపై 47 రన్స్ తేడాతో గెలవడంతో ఈ ఘనతను సాధించింది. తొలి 8 మ్యాచుల్లో ఒకటే విజయం సాధించిన బెంగళూరు, ఆ తర్వాత జరిగిన 5 మ్యాచుల్లోనూ గెలుపొందింది. GT(2 సార్లు), SRH, PBKS, DC జట్లను చిత్తుచేసింది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈనెల 18న చెన్నైతో కీలక పోరులో తలపడనుంది.

AP: ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ సుపరిపాలన చూశారని సీఎం జగన్ అన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటు వేస్తారని పులివెందులలో మాట్లాడారు. మరోవైపు ఓటు జీవితాన్ని మారుస్తుందని ఉండవల్లిలో ఓటు వేసిన అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగమవ్వాలని.. ఎవ్వరూ అశ్రద్ధ చేయొద్దని కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో పలువురు లోక్‌సభ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఓటు వేశారు.

మీ ఓటును వేరే వాళ్లు వేసినట్లు గుర్తిస్తే వెంటనే ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటర్ ఐడీ లేదా మరేదైనా గుర్తింపు పత్రం సమర్పించాలి. అధికారి ఇచ్చే ఫామ్ 17(బి) పై పేరు రాసి, సంతకం చేయాలి. ఆ తర్వాత టెండర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దానిపై ఓటు వేయాలి. ఆ పేపర్‌ను ప్రత్యేక కవర్‌లో కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 49(పి) ప్రకారం పొందే ఈ ఓటును టెండర్/ఛాలెంజ్ ఓటు అంటారు. దీనిని EVM ద్వారా వేయడం కుదరదు.
Sorry, no posts matched your criteria.