news

News April 27, 2024

రణ్‌బీర్ ‘రామాయణ’ ఫొటోలు లీక్!

image

రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. షూటింగ్ జరుగుతుండగా తీసిన ఫొటోలు లీక్ అయినట్లు తెలుస్తోంది. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్’ హీరో యశ్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు.

News April 27, 2024

వైసీపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలు

image

➢రైతు భరోసా సొమ్ము ఏడాదికి రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు. కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూముల సాగుదార్లకు రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు కొనసాగింపు.
➣చేనేత నేస్తం రూ.లక్షా 20 వేల నుంచి రూ.2లక్షల 40వేల వరకు పెంపు
➢మత్స్యకార భరోసా రూ.లక్ష వరకు, వాహన మిత్ర రూ.లక్ష వరకు పెంపు
➢మహిళలకు రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ కింద రుణాలు
➢YSR షాదీతోఫా, కళ్యాణమస్తు కొనసాగింపు.

News April 27, 2024

గాజాలో బాంబులు తొలగించడానికి 14ఏళ్లు పడుతుంది: UN మాజీ అధికారి

image

ఇజ్రాయెల్ దాడులతో గాజా అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. నగరం అంతా పేలని బాంబులు, భవనాల శిథిలాలతో నిండిపోయింది. ప్రతి చదరపు మీటరుకు సగటున 300కిలోల శిథిలాలు ఉన్నాయట. గాజా వ్యాప్తంగా 37 మెట్రిక్ టన్నుల (37వేల కిలోలు) శిథిలాలు ఉన్నట్లు UN మాజీ అధికారి వెల్లడించారు. వీటిని తొలగించడానికి 14ఏళ్లు పడుతుందని వెల్లడించారు. బాంబులు ఉన్న నేపథ్యంలో శిథిలాలను తొలగించడం సవాల్‌తో కూడుకున్నదని తెలిపారు.

News April 27, 2024

కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాం: సీపీఎం

image

TG: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేందుకు సీపీఎం అంగీకారం తెలిపింది. ‘బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండేందుకు వారు అంగీకరించారు. ఒకట్రెండు విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తాం. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నా’ అని తన నివాసంలో సీపీఎం నేతలతో భేటీ అనంతరం సీఎం రేవంత్ వెల్లడించారు.

News April 27, 2024

తొలి ట్వీట్ చేసిన కేసీఆర్

image

TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ట్విటర్(ఎక్స్‌) ఖాతా నుంచి తొలి పోస్ట్ పెట్టారు. ‘బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేసీఆర్ ట్వీట్ చేశారు. దీనికి ఉద్యమం నాటి ఫొటోను జతచేశారు. ఆయన ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేల మంది ఫాలోవర్లు యాడ్ అయ్యారు.

News April 27, 2024

1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలోని ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టుల ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయో పరిమితి, పోస్టులు, ఇతర వివరాల కోసం https://nvs.ntaonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

News April 27, 2024

‘నవరత్న’ అంటే ఏంటి? – 1/2

image

ప్రభుత్వ రంగ సంస్థలకు వాటి వృద్ధిని బట్టి కేంద్రం మినీరత్న, నవరత్న, మహారత్న హోదాలు ఇస్తూ ఉంటుంది. మినీరత్నలో రెండు కేటగిరీలు ఉంటాయి. మూడేళ్లలో వార్షిక ఆదాయం సగటు రూ.120కోట్లు, ఒక్కసారైనా రూ.30కోట్ల ప్రీట్యాక్స్ ప్రాఫిట్ నమోదైతే అది మొదటి కేటగిరీ. వార్షిక ఆదాయం సగటు రూ.80కోట్లు, ప్రీట్యాక్స్ ఫ్రాఫిట్ రూ.20కోట్లు ఉంటే అది రెండో కేటగిరీ. ప్రస్తుతం దేశంలో 75 మినీరత్న సంస్థలు ఉన్నాయి.

News April 27, 2024

‘నవరత్న’ అంటే ఏంటి? – 2/2

image

ఇక మినీరత్న స్థాయిని దాటితే సంస్థలకు నవరత్న హోదా అందుతుంది. ఈ హోదా అందుకుంటే సంస్థలు కేంద్రం అనుమతి అవసరం లేకుండా రూ.1000కోట్ల వరకు పెట్టుబడులను పెట్టొచ్చు/సమీకరించొచ్చు. ప్రస్తుతం 17 నవరత్న కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల నికర విలువ రూ.15వేల కోట్లకు చేరి, మూడేళ్లలో వార్షిక లాభం రూ.5వేల కోట్లు నమోదు చేస్తే సంస్థలు మహారత్న హోదా అందుకుంటాయి. కాగా ప్రస్తుతం దేశంలో 13 మహారత్న కంపెనీలు ఉన్నాయి.

News April 27, 2024

ఇండిపెండెంట్లతో ఈజీ కాదు!

image

AP: ప్రతి ఎన్నికల్లో ప్రధాన పార్టీలపైనే ప్రజల ఫోకస్ ఉంటుంది. ఇండిపెండెంట్లను అంత సీరియస్‌గా తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ గత ఎన్నికల సరళిని చూస్తే స్వతంత్రుల జోరు బాగానే ఉందని చెప్పక తప్పదు. వీరు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తున్నారు. 2014లో స్వతంత్రులకు 5,14,129 ఓట్లు పడగా ఇద్దరు(పిఠాపురం-SVSN వర్మ, చీరాల- ఆమంచి కృష్ణమోహన్) గెలిచారు. 2019లో వీరికి 2,86,859 ఓట్లు పడ్డాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 27, 2024

పెన్షన్ రూ.3,500కు పెంచుతాం: జగన్

image

AP: వైఎస్సార్ పెన్షన్ కానుకను రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతామని జగన్ ప్రకటించారు. జనవరి 1, 2028న రూ.250, జనవరి 1, 2029న మరో రూ.250 పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం పెన్షన్ నెలకు రూ.3,000 వస్తోందని, 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని జగన్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తామే ఎక్కువ మందికి, ఎక్కువ మొత్తం ఇస్తున్నామని పేర్కొన్నారు.