news

News April 7, 2024

9,144 రైల్వే ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

image

ఇండియన్ రైల్వేలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-3 జాబ్స్ 8,052 ఉన్నాయి. జులై 1 2024 నాటికి వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్‌-1కు రూ.29,200-రూ.92,300, గ్రేడ్-3కి రూ.19,900-రూ.62,200 పే స్కేల్ లభించనుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను <>https://indianrailways.gov.in<<>> సంప్రదించాలి.

News April 7, 2024

అమెరికాకు పోటీగా చైనా సైనిక విన్యాసాలు

image

దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరికి కళ్లెం వేసేందుకు అమెరికా, ఫిలిప్పీన్స్, జపాన్, ఆస్ట్రేలియా తాజాగా సంయుక్త విన్యాసాలు ప్రారంభించాయి. అయితే వాటికి పోటీగా చైనా కూడా వెంటనే అదే సముద్రంలో విన్యాసాల్ని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. తమ నేవీ, వైమానిక దళాలు ఇందులో పాల్గొన్నాయని బీజింగ్ స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

News April 7, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందాం: పవన్

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు సాధారణ ప్రజలు సైతం కలిసి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘ఇది నేను ఒక్కడినే చేసే పని కాదు. ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న అంశమిది. అందరూ కలిసి రోడ్లపైకి రావాలి. ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడం మా కూటమి లక్ష్యం. ఉద్దానం సమస్య తీరేందుకు పోరాడినట్లే దీని కోసం బలంగా నిలబడదాం’ అని ఆకాంక్షించారు.

News April 7, 2024

సూర్య డకౌట్.. నెటిజన్ కామెంట్ వైరల్

image

ముంబై స్టార్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ డకౌట్ అవడంపై ఓ కామెంట్ నెట్టింట వైరలవుతోంది. రెండ్రోజుల క్రితం ముంబై జట్టులో చేరిన సూర్య బ్యాక్ హోమ్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఓ నెటిజన్ ‘ఢిల్లీతో మ్యాచ్‌లో సున్నా కంటే ఎక్కువ పరుగులు చేస్తే నువ్వు గే’ అంటూ కామెంట్ పెట్టారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లో సూర్య డకౌట్ కావడంతో ‘మిస్టర్ 360 గే కాదని నిరూపించారు’ అంటూ ఆ కామెంట్‌ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

News April 7, 2024

తిరుమల ప్రసాదంలో అనకాపల్లి బెల్లం: పవన్

image

AP: అనకాపల్లి బెల్లానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘గతంలో తిరుమల శ్రీవారి ప్రసాదం కోసం ఉపయోగించారు. ఈ YCP ప్రభుత్వం ప్రసాదంలో ఈ బెల్లం వాడటం మానేసింది. మేం అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రసాదానికి అనకాపల్లి బెల్లం ఉపయోగించేలా, గ్లోబల్ ట్యాగ్ వచ్చేలా చేస్తాం. శారదా నదిపై మినీ ప్రాజెక్టులు, కాల్వలకు మరమ్మతులు చేసి ప్రతి పొలానికి నీళ్లు ఇస్తాం’ అని పేర్కొన్నారు.

News April 7, 2024

సీపీఎస్‌కు పరిష్కారం చూపిస్తాం: పవన్

image

AP: తమ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ‘నేను సాధారణ ఉద్యోగి కుమారుడిని. ఉద్యోగులకు పెన్షన్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. NDA ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే న్యాయం చేస్తాం. అనకాపల్లి SEZలో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తాం. యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించారు.

News April 7, 2024

జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి: పవన్

image

AP: సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. ‘అమ్మ ఒడి పథకం ఎంతమంది పిల్లలున్నా వేస్తామని చెప్పి.. 83 లక్షల మంది లబ్ధిదారుల్లో 44 లక్షల మందికే ఇచ్చారు. రూ.19,600కోట్లు అమ్మఒడికి ఇచ్చి.. మద్యం అమ్మి నాన్న తడి పథకం కింద రూ.లక్ష కోట్లు దోచేసిన సారా వ్యాపారి జగన్. మనకి ఈ కోడిగుడ్డు ప్రభుత్వం, కోడిగుడ్డు మంత్రి వద్దు’ అని అనకాపల్లి సభలో జనసేనాని వ్యాఖ్యానించారు.

News April 7, 2024

ఉద్యోగాల్లేక యువత HYD వెళ్లే దుస్థితి: చంద్రబాబు

image

AP: రాజధాని అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం వచ్చేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పామర్రులో మాట్లాడుతూ.. ‘రోడ్ల మీద గుంతలు పూడ్చలేని జగన్ 3 రాజధానులు కడతారంట. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క యువత హైదరాబాద్‌కు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు.

News April 7, 2024

FLASH: ముంబైకి తొలి విజయం

image

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. ఢిల్లీపై 29 పరుగుల తేడాతో గెలిచింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 205/8 స్కోర్ చేయగలిగింది. పృథ్వీ షా 66, అభిషేక్ పోరెల్ 41 రాణించగా, చివర్లో స్టబ్స్ 25 బంతుల్లోనే 71 పరుగులు(7 సిక్సులు, 3 ఫోర్లు) చేసినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో గెరాల్డ్ 4, బుమ్రా 2 వికెట్లు, షెఫర్డ్ ఒక వికెట్ తీశారు.

News April 7, 2024

IPL: టాస్ గెలిచిన LSG

image

ఈరోజు LSG, GTకి మధ్య జరగనున్న మ్యాచ్‌లో లక్నో టాస్ గెలుపొంది బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

GT జట్టు: గిల్, సుదర్శన్, విజయ్ శంకర్, బీఆర్ శరత్, తెవాతియా, రషీద్, నల్కండే, నూర్ అహ్మద్, ఉమేశ్, స్పెన్సర్, మోహిత్

LSG జట్టు: డికాక్, రాహుల్, పడిక్కల్, స్టొయినిస్, పూరన్, బదోనీ, కృనాల్, బిష్ణోయీ, యశ్ థాకూర్, నవీన్ ఉల్-హక్, మయాంక్ యాదవ్