news

News April 7, 2024

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం: శ్రీధర్‌బాబు

image

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతలు రైతులను లూటీ చేశారని, ఇప్పుడు వారి కోసం ధర్నాలంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

News April 7, 2024

KCR కీలక సమావేశం

image

TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక కోసం BRS అభ్యర్థి ఎంపికపై మాజీ సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో కేటీఆర్, హారీశ్‌రావు సహా పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ తమ అభ్యర్థిగా శ్రీగణేశ్ పేరును ప్రకటించిన నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం కేసీఆర్ వేట కొనసాగిస్తున్నారు.

News April 7, 2024

బీజేపీకి తిరుగులేదు.. 300+ సీట్లు ఖాయం: ప్రశాంత్ కిశోర్

image

ప్రస్తుతం దేశంలో బీజేపీకి తిరుగులేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఆ పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. కమలం పార్టీని, ప్రధాని మోదీని అడ్డుకునేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ విపక్షాలు తప్పుడు వ్యూహాలు, బద్ధకంతో వాటిని కోల్పోయాయని తెలిపారు. ఇక తెలంగాణలో బీజేపీ తొలి లేదా రెండో స్థానంలో, ఒడిశా, బెంగాల్‌లో నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు.

News April 7, 2024

పాసెంజర్‌కు ఎయిర్ ఇండియా క్షమాపణలు

image

విమానంలో విరిగిపోయిన కుర్చీని కేటాయించారంటూ ఓ పాసెంజర్ ఎయిర్ ఇండియా సంస్థపై ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించానని, విండో సీటు కోసం రూ.1000 అదనంగా చెల్లించానని సదరు వ్యక్తి తెలిపారు. అయినప్పటికీ తనకు విరిగిన కుర్చీని కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పోస్టుకు స్పందించిన ఎయిర్ ఇండియా సారీ చెప్పింది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

News April 7, 2024

నేను వారితో కలిసి ఉండలేను: రోహిత్ శర్మ

image

రూమ్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఎవరితో కలిసి ఉంటారనే ప్రశ్నకు కపిల్ శర్మ షోలో రోహిత్ శర్మ సరదాగా స్పందించారు. ‘ధవన్, పంత్‌లతో కలిసి ఉండలేను. వారు గదిని మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ అవగానే దుస్తులను మంచంపై పడేస్తారు. మధ్యాహ్నం వరకు నిద్రపోతారు. రూమ్ తలుపులపై డిస్టర్బ్ చేయవద్దు అనే నోటీస్ ఉంటుంది. దీంతో శుభ్రపరిచే సిబ్బందీ రారు. గదులు చిందరవందరగా ఉంటాయి. అందుకే వారితో ఉండాలనుకోను’ అని చెప్పారు.

News April 7, 2024

మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం, 11మంది మృతి

image

మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురును వెలికితీసే పెమెక్స్ సంస్థ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో 11మంది మ‌ృతిచెందినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ పైప్ లైన్లు ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, మృతుల సంఖ్య పెరగొచ్చని పేర్కొన్నారు.

News April 7, 2024

వచ్చాడు.. వెళ్లాడు

image

ముంబై ‘మిస్టర్ 360’ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యారు. మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అతడు నోకియా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. ఇక ధనాధన్ ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్ మొదలు పెట్టిన రోహిత్ శర్మ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 49 రన్స్ చేశారు. హిట్‌మ్యాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

News April 7, 2024

నరసన్నపేటకు పెద్దన్న ఎవరో?

image

AP: శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం 1989 నుంచి ధర్మాన కుటుంబానికి కంచుకోటగా ఉంది. 4సార్లు ధర్మాన కృష్ణదాస్, 2సార్లు ధర్మాన ప్రసాదరావు గెలిచారు. మొత్తంగా 7సార్లు INC, 4సార్లు TDP, 2సార్లు YCP, 2సార్లు స్వతంత్ర పార్టీ, ఓసారి కృషికార్ లోక్ పార్టీ విజయం సాధించింది. ఈసారి YCP నుంచి సిట్టింగ్ MLA ధర్మాన కృష్ణదాస్, TDP నుంచి బగ్గు రమణమూర్తి బరిలో దిగుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 7, 2024

పుష్ప-2 నుంచి క్రేజీ అప్‌డేట్

image

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. రేపు ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రేపు టీజర్ విడుదల టైమ్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 8న ఉదయం 11.07 గంటలకు పుష్పరాజ్ వస్తాడని పేర్కొన్నారు. దీంతో పుష్ప-2 టీజర్‌పై మరింత ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న టీజర్ నెట్టింట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

News April 7, 2024

KL రాహుల్ ‘స్పేర్ టైర్’ లాంటోడు: సిద్ధు

image

టీమ్ ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ‘స్పేర్ టైర్’ లాంటి వాడని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు అన్నారు. ‘రాహుల్‌ను ఏ స్థానంలోనైనా ఆడించవచ్చు. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా, మిడిలార్డర్ బ్యాటర్‌గా ఉపయోగించుకోవచ్చు. అతడిలో తప్ప మరెవరిలోనూ ఈ సత్తా లేదు. అతడో బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలాంటి వారు ప్రస్తుతం ప్రపంచంలో ఎవరూ లేరు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.