India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: హిందూపురం నుంచి ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి టీడీపీ నుంచి బరిలో దిగనున్నారు.

IPL-2022 సీజన్‌లో ముగ్గురినే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో యుజ్వేంద్ర చాహల్‌ను రిటైన్ చేసుకోలేకపోయామని RCB మాజీ డైరెక్టర్ మైక్ హసన్ తెలిపారు. ‘వేలంలో చాహల్ పేరు ఆలస్యంగా రావడంతో అక్కడ కూడా ఆయనను దక్కించుకోలేకపోయాం. ఆయన వేలంలోకి రాకముందే హసరంగను తీసుకున్నాం. చాహల్‌తోపాటు హర్షల్‌ను కూడా దక్కించుకోలేకపోయాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా IPLలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చాహల్ చరిత్ర సృష్టించారు.

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 13-14 MP సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కేసీఆర్ వల్లే నల్గొండలో కరవు వచ్చిందని దుయ్యబట్టారు. బస్సు యాత్ర చేయడానికి బీఆర్ఎస్ చీఫ్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

TG: మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి <<13102228>>సవాల్<<>> విసిరారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తే గులాబీ పార్టీని రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించారు. తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. కొడంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సభలో సీఎం మాట్లాడారు. KCRను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే తిరిగి ఇటువైపు చూడలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదని దుయ్యబట్టారు.

హనుమాన్ జయంతి రోజున దర్శకుడు ప్రశాంత్ వర్మ కీలక అప్డేట్ ఇచ్చారు. తాను తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మూవీ ఐమాక్స్ 3డీ వెర్షన్‌లో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా మనమంతా విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంటూ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. అంతకుముందు శ్రీరామనవమి రోజున విడుదల చేసిన పోస్టర్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా 70% మంది కార్మికులకు వడగాలుల ముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 2000-2020 మధ్య ఈ ముప్పు 34.7% పెరిగిందని తెలిపింది. ‘వడగాలుల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య 2020 నాటికి 26.2 మిలియన్లుగా ఉంది. ఏటా 1.6 బిలియన్ల వర్కర్లు యూవీ రేడియేషన్‌కు గురవుతుండగా, 18,960 మంది స్కిన్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు’ అని పేర్కొంది.

APలో తమ కూటమి ఘనవిజయం సాధించబోతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ‘బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి నేతలు సీట్లు త్యాగాలు చేశారు. 30, 40 చోట్ల మా అభ్యర్థులకు సర్ది చెప్పా. వర్మ జనసేనకు మద్దతిచ్చి పిఠాపురంలో సీటు త్యాగం చేశారు. ఆయన్ను భవిష్యత్తులో ఉన్నత స్థానంలో కూర్చోబెడతాం’ అని పిఠాపురంలో నామినేషన్ అనంతరం మాట్లాడారు.

నామినేషన్ రిజెక్ట్ కావడంతో బీజేపీ విజయానికి పరోక్షంగా కారణమైన సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ అజ్ఞాతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నారట. ఆయన ఫోన్ స్విఛాఫ్ ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు నీలేశ్ ఇంటి ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కాగా ప్రతిపాదకుల సంతకాలు సరిగా లేకపోవడంతో నీలేశ్ నామినేషన్ రిజెక్ట్ అయింది.

TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. సిద్దిపేటలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేట వెళ్లనున్నారు. ఆ తర్వాత కారులో బహిరంగ సభ ప్రదేశానికి చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన భువనేశ్వర్ వెళ్తారు.

AP: వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికలు ముగిసే వరకు ఆమోదించవద్దని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ వాదించగా.. రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Sorry, no posts matched your criteria.