news

News September 7, 2025

వాలంటీర్ల పనులు మాతో ఎందుకు.. సచివాలయ ఉద్యోగుల నిరసన

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పోరాటానికి దిగారు. వాలంటీర్ల విధులను చేయాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తున్నామని జేఏసీ తెలిపింది. నిన్న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాగా వైసీపీ హయాంలో 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండగా.. కూటమి సర్కార్ ఆ వ్యవస్థను పక్కనబెట్టింది. ఇప్పుడు నాలుగైదు క్లస్టర్లకు ఓ సచివాలయ ఉద్యోగికి కేటాయించి పనులు చేయాలని సూచించింది. తమపై ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు.

News September 7, 2025

మహిళలూ.. జింక్ తగ్గిందా..?

image

మహిళల ఆరోగ్యానికి జింక్ ఎంతో అవసరం. జింక్‌ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. గర్భాశయానికి రక్తప్రసరణ పెంచి, నెలసరిలో వచ్చే నొప్పుల్ని తగ్గిస్తుంది. గాయాలు, వాపులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. చర్మ కణాల పునరుద్ధరణకు సాయపడుతుంది. పునరుత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది. జింక్ కోసం చిక్కుళ్లు, శనగలు, గుమ్మడి, పుచ్చగింజలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.

News September 7, 2025

సముద్రం పాలవుతున్న కృష్ణా-గోదావరి వరద

image

గోదావరి, కృష్ణా బేసిన్లలో భారీ రిజర్వాయర్లు లేక వరద జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి నిన్నటివరకు గోదావరి నుంచి 2,350, కృష్ణా నుంచి 726 TMCలు సముద్రంలో కలిశాయి. కృష్ణా బేసిన్‌లో నాగార్జునసాగర్ 312.04 TMC, శ్రీశైలం 215.80, గోదావరి బేసిన్‌లో MH పైఠన్‌లో జయక్వాడీ 102, TGలో శ్రీరామ్‌సాగరే(80TMC) పెద్ద రిజర్వాయర్లు. పోలవరం(194 TMC) నిర్మాణం పూర్తైతే అదే అతిపెద్ద జలాశయం అవుతుంది.

News September 7, 2025

పాలలో కొవ్వు శాతం తగ్గడానికి కారణాలు

image

* గేదె, ఆవు పాలకు మార్కెట్‌లో మంచి ధర రావాలంటే వాటిలోని కొవ్వు శాతమే కీలకం.
* పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గతుంది.
* అలాగే పశువులను అధిక దూరం నడిపించినప్పుడు, అవి ఎదలో ఉన్నప్పుడు, వ్యాధులకు గురైనప్పుడు కూడా ప్రభావం పడుతుంది.
* అకస్మాత్తుగా మేతను మార్చినప్పుడు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి సమంగా ఇవ్వకపోవడం వల్ల కూడా వెన్నశాతం అనుకున్నంత రాదు.

News September 7, 2025

ఉసిరితో కురులు మురిసె

image

* వర్షాకాలంలో జుట్టు సమస్యలు తగ్గడానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది
* ఎండు ఉసిరి ముక్కలను కొబ్బరి/బాదం నూనెతో తక్కువ మంట మీద వేడిచేసి, చల్లార్చి ఫిల్టర్ చేయాలి.
* ఈ నూనెను వారానికి 2, 3సార్లు తలకు మసాజ్ చేసి తేలికపాటి షాంపూతో స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
* ఉసిరి పొడిని పెరుగు/కొబ్బరిపాలతో పేస్టులా తయారుచేసి కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. 30ని. తర్వాత వాష్ చేసుకుంటే జుట్టు మృదువుగా మారుతుంది.

News September 7, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం ఏపీలోని విజయవాడ, గుంటూరులో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220 ఉండగా, ఇవాళ రూ.240కి విక్రయిస్తున్నారు. అటు హైదరాబాద్‌, కామారెడ్డిలో రూ.240గా ఉంది. వినాయక నిమజ్జనాలు ముగియడం, ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

News September 7, 2025

‘ఫర్నిచర్ డిజైన్’తో కెరియర్ డిజైన్(1/2)

image

ప్రస్తుత ఆధునిక కాలానికి తగ్గట్లుగా ఇంట్లో ఫర్నిచర్‌ను డిజైన్ చేయించుకోవడం పెరిగింది. ఈ రంగంలో అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో సోఫాలు, కుర్చీలు, బల్లలు, బెడ్స్ తదితర వస్తువులను వినూత్నంగా తీర్చిదిద్దే సృజనాత్మక ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంది. NIFT, NID, UCEED, NEED వంటి ప్రవేశపరీక్షలు రాసి యూజీ స్థాయిలో ఫర్నిచర్ డిజైన్ కోర్సుల్లో చేరవచ్చు. తర్వాత పీజీ కూడా చేయొచ్చు.

News September 7, 2025

‘ఫర్నిచర్ డిజైన్’తో కెరియర్ డిజైన్(2/2)

image

ఫర్నిచర్ డిజైన్ కోర్సులు చేసినవారు ఇంటీరియర్ డిజైనర్, ఫర్నిచర్ కన్జర్వేటర్, ప్రొడక్ట్ రీసెర్చర్, ఇన్నోవేటర్ వంటి ఉద్యోగాల్లో చేరవచ్చు. గోద్రేజ్, ఐకియా, నీల్‌కమల్, స్టైల్ స్పా, ఫ్లోరెన్స్ వంటి అనేక పెద్ద కంపెనీలు ఏటా పెద్దఎత్తున ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. వర్క్‌షాప్స్, వెబినార్స్, కన్వెన్షన్స్, ఈవెంట్లకు హాజరవుతూ ఈ రంగంపై నిత్యం అప్డేట్‌గా ఉంటే మంచి జీతంతో దూసుకుపోవచ్చు.

News September 7, 2025

సముద్రం లోపల ఫైబర్ కేబుల్స్ కట్

image

ఎర్ర సముద్రం లోపల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కట్ అయ్యాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీనివల్ల ఆసియా, యూరప్‌ ప్రాంతాల్లో తమ Azure సర్వీసులకు అంతరాయం కల్గుతుందని పేర్కొంది. రిపేర్ చేసేందుకు సమయం పడుతుందని, రోజువారీ అప్‌డేట్స్ ఇస్తామని తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్లౌడ్ సేవలందించే సంస్థ Azure. ఆ కేబుళ్లను హౌతీలు కట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News September 7, 2025

త్వరలో భారత్‌కు మాల్యా, నీరవ్?

image

ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను త్వరలోనే భారత్ తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే UKకు చెందిన ఓ బృందం ఢిల్లీలోని తీహార్ జైలులో వసతులను పర్యవేక్షించింది. జైలులోని సదుపాయాలతో వాళ్లు సంతృప్తి చెందినట్లు, UK అథారిటీలకు ఫేవరబుల్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జైలు వసతుల విషయంలో యూకే కోర్టులు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సంతృప్తి చెందకపోతే ఖైదీల అప్పగింతకు నిరాకరిస్తాయి.