news

News January 7, 2025

షమీని ఇక NCAలోనే ఉంచుతారా?: రవిశాస్త్రి

image

BGTలో షమీని ఆడించకపోవడంపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. షమీ ఆడితే INDకు విజయావకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డారు. దేశవాళీ టోర్నీల్లో ఆడిన అతడిని AUSకు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. అతడి ఫిట్‌నెస్‌పై స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని, ఇంకెన్ని రోజులు NCAలోనే ఉంచుతారని అన్నారు. రవిశాస్త్రి కామెంట్స్‌తో రికీ పాంటింగ్ ఏకీభవించారు. షమీ కొన్ని ఓవర్లు వేసినా బుమ్రాకు మంచి సపోర్ట్ లభించేదని చెప్పారు.

News January 7, 2025

ఆప్ అజెండా ఇదే: కేజ్రీవాల్ కావాలా? వ‌ద్దా?

image

జైలు నుంచి విడుద‌ల‌య్యాక కేజ్రీవాల్‌ వ్యూహాత్మ‌కంగా CM ప‌ద‌వికి రాజీనామా చేశారు. నిజాయితీ నిరూపించుకోవడానికే ఆయన రాజీనామా చేశారని ఆప్ చెబుతోంది. ప‌దేళ్లుగా పాలించిన ప్రభుత్వంపై సాధారణంగా ఏర్పడే వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించేలా, ఈ ఎన్నిక‌ల్లో ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు కేజ్రీవాల్ కావాలా? వ‌ద్దా? అనేదే ప్రధాన అజెండాగా ఆప్ ప్రచారం చేస్తోంది. మరి ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ను విశ్వసిస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.

News January 7, 2025

Rewind: 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరిగిందంటే?

image

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ ఘన విజ‌యాన్ని నమోదు చేసింది. 70 స్థానాల్లో 62 చోట్ల విజ‌యం సాధించింది. 8 చోట్ల BJP గెలుపొందింది. కాంగ్రెస్ ఖాతా తెర‌వ‌లేదు. ఉచిత విద్యుత్‌, నీటి స‌ర‌ఫ‌రా, విద్యా రంగంలో సంస్క‌ర‌ణ‌ల‌కుగానూ 2015 (67), 2020లో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌న్ సైడ్‌గా న‌డిచాయి. ఇప్పుడు ప‌దేళ్ల అనంతరం ప్రభుత్వ వ్య‌తిరేక‌, అవినీతి ఆరోపణలు, CM మార్పు పరిణామాలతో ఆప్ తీవ్ర పోటీ ఎదుర్కొనుంది.

News January 7, 2025

BREAKING: FEB 5న ఢిల్లీ పోలింగ్, 8న రిజల్ట్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూలును ECI విడుదల చేసింది. ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. JAN 10న నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. నామినేషన్లకు చివరి తేదీని JAN 17గా పేర్కొన్నారు. మరుసటి రోజే స్క్రూటినీ జరుగుతుందన్నారు. FEB 5న ఓటింగ్, FEB 8న ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

News January 7, 2025

ఏకకాలంలో 3 భాషల్లో ‘డాకు మహారాజ్’ విడుదల!

image

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈనెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళంలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. తమిళంతోపాటు హిందీలో బిగ్ సినిమాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తెలుగులో ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ సినిమాల హవా నడవనుంది.

News January 7, 2025

జాహ్నవికి న్యాయం దక్కింది

image

2023 జనవరిలో అమెరికా సియాటెల్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కి ఎట్టకేలకు న్యాయం దక్కింది. కారును అతివేగంగా నడిపిన కెవిన్ డేవ్ అనే పోలీస్‌ను ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె మరణం పట్ల హేళనగా, నవ్వుతూ మాట్లాడిన <<13652111>>డానియెల్ అడెరర్‌ను<<>> ఇప్పటికే సస్పెండ్ చేశారు. ‘ఆమె మరణానికి విలువలేదు’ అంటూ అడెరర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి.

News January 7, 2025

కేటీఆర్‌కు మరోసారి నోటీసులు

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఆయన ఇవాళ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా, విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే వ్యవహారంలో ఈనెల 9న ఆయన ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

News January 7, 2025

ఫార్ములా-ఈ రేసు కేసు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును <<15086612>>ఆశ్రయిస్తే<<>> తమ వాదనలు కూడా వినాలంటూ కోరింది.

News January 7, 2025

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిరాజ్‌కు రెస్ట్!

image

ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు పేసర్ సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వాలని BCCI భావిస్తోంది. 2023 నుంచి 671.5 ఓవర్ల బౌలింగ్ వేసిన అతనిపై పనిభారం తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే T20లకు రెస్ట్ ఇచ్చి వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. BGTలో ఆశించిన మేర రాణించకలేకపోయినా కీలక సమయాల్లో సిరాజ్ వికెట్లు తీశారు. JAN 22-FEB 2వరకు 5 T20లు జరగనున్నాయి.

News January 7, 2025

విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి: మంత్రి అచ్చెన్న

image

AP: విశాఖ పర్యటనలో PM మోదీ శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌తో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. YCP హయాంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మోదీ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వేజోన్‌కు రేపు PM శంకుస్థాపన చేస్తారన్నారు. అటు హోంమంత్రి అనిత కూడా సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు.