news

News April 8, 2024

హీరోలు 33, హీరోయిన్లు 10.. సినిమా ఫ్లాప్

image

టైటిల్ చూసి షాకయ్యారా? మీరు చదివింది నిజమే. 2003లో JP దత్తా డైరెక్షన్‌లో వచ్చిన ‘LOC కార్గిల్’లో 33మంది హీరోలు, 10మంది హీరోయిన్లు నటించారు. 4.15గంటల నిడివున్న ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ₹33కోట్ల బడ్జెట్ పెడితే ₹31కోట్లు వచ్చాయి. ఇందులో సంజయ్ దత్, అజయ్ దేవ్‌గన్, సైఫ్, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, నాగార్జున, రాణీ ముఖర్జీ, మనోజ్ బాజ్‌పాయ్, కరీనా, రవీనా టాండన్, నమ్రత వంటి తారలు నటించారు.

News April 8, 2024

విడతల వారీగా బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం

image

TG: చేనేత కార్మికులు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకోవద్దని.. ఉపాధి కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల నుంచి వస్త్రాల ఎగుమతులకు చర్యలు తీసుకుంటామన్నారు. నేతన్నలు బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు పట్టించుకోవద్దని కోరారు. చేనేతల బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామన్నారు. కరెంట్ సబ్సిడీ, బీసీ కార్పొరేషన్‌లో లోన్లు ఇస్తామని తెలిపారు.

News April 8, 2024

టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించాలని ఫిర్యాదు

image

AP: TTD EO ధర్మారెడ్డిని తొలగించాలని కోరుతూ TDP-JSP-BJP కూటమి నేతలు CEO ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. తిరుమల, తిరుపతిలో రాజకీయ ప్రచారం, అక్రమాలకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు. ‘ధర్మారెడ్డి వల్ల టీటీడీ గౌరవ ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. TTDకి చెందిన రూ.5వేల కోట్ల నిధులను దారిమళ్లించారు. టీటీడీ ఛైర్మన్ తన అనుచరులకు రూ.1500 కోట్లు ఎలా విడుదల చేశారు?’ అని కూటమి నేతలు ప్రశ్నించారు.

News April 8, 2024

వావ్.. ఉద్యోగుల కోసం ఇళ్లు నిర్మించనున్న యాపిల్!

image

భారత్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్లలో పనిచేసే 78వేల మంది ఉద్యోగులకు ఇళ్లు నిర్మించాలని యాపిల్ సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్‌కు కొంతమేర నిధులు అందించనున్నాయి. తయారీదారులైన ఫాక్స్‌కాన్, టాటా, శాల్‌కాంప్ సంస్థల ఉద్యోగులకు ఈ ఇళ్లు నిర్మించనున్నారు. మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారట. కాగా చైనాలోనూ యాపిల్ ఇదే తరహాలో ఉద్యోగులకు ఇళ్లు నిర్మించింది.

News April 8, 2024

BIG ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.. రేపు ADB, ASF, మంచిర్యాల, NRML, NZB, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, పెద్దపల్లి, KMRD జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయంది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయంది. అటు GDL, MBNR, నాగర్‌కర్నూల్, WNP, NRPT, KMM, సూర్యాపేట జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.

News April 8, 2024

కవిత బెయిల్ పిటిషన్ విచారణ తేదీ మార్పు

image

TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ తేదీలో మార్పు చోటు చేసుకుంది. మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో సాధారణ బెయిల్‌పై విచారణ త్వరగా చేయాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో ఈనెల 20న జరగాల్సిన విచారణను 16కు కోర్టు వాయిదా వేసింది.

News April 8, 2024

టీడీపీలోనే కొనసాగుతా: మహాసేన రాజేశ్

image

టీడీపీలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ట్విటర్ వేదికగా మహాసేన రాజేశ్ ప్రకటించారు. ‘అందరి సూచనలు, సలహాల మేరకు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో ఉండాలని నిర్ణయించాం. నామీద నమ్మకముంచిన చంద్రబాబుకి ధన్యవాదాలు. మహాసేన అనేది ఇప్పుడు టీడీపీ ఆస్తి అని, మరొక 30 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించాలని ఆయన కోరారు. అందుకు మహాసేన కూడా సిద్ధం’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

News April 8, 2024

IPL: టాస్ గెలిచిన చెన్నై

image

ఐపీఎల్‌లో ఈరోజు తమ హోం గ్రౌండ్‌లో కోల్‌కతాతో చెన్నై తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై చివరిగా ఆడిన రెండు మ్యాచులూ ఓడిపోవడం గమనార్హం.

చెన్నై: రుతురాజ్, రచిన్, రహానే, మిచెల్, రిజ్వీ, జడేజా, ధోనీ, తీక్షణ, ముస్తాఫిజుర్, శార్దూల్, దేశ్‌పాండే

కోల్‌కతా: సాల్ట్, నరైన్, వెంకటేశ్, శ్రేయస్, రఘువంశీ, రస్సెల్, రింకూ, రమణ్‌దీప్, స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

News April 8, 2024

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ఉగాది శుభాకాంక్షలు

image

TG: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అంకితభావం, సేవతో మెరుగైన భవిష్యత్తుకు కట్టుబడి ఉందామని గవర్నర్ పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో ప్రజలకు శుభం కలగాలని రేవంత్ ఆకాంక్షించారు. సమృద్ధిగా వానలు కురిసి, రైతులు ఆనందంగా ఉండాలన్నారు.

News April 8, 2024

ఆఫీసులో ఓ కునుకు తీస్తున్నారా?

image

చాలా మంది ఉద్యోగులకు మధ్యాహ్నం అయ్యే సరికి చిన్న కునుకు తీస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇది మంచిదే అంటున్నారు పరిశోధకులు. తరచూ మధ్యాహ్నం కాసేపు నిద్రపోయే వారి మెదడు మిగతా వారితో పోలిస్తే చురుకుగా పనిచేస్తుందట. అంతేకాదు వీరికి 6.5 ఏళ్లు ఆలస్యంగా వృద్ధాప్యం వస్తుందట. క్రియేటివిటీ పెరిగి, మెరుగైన పనితీరు కనబరిచే అవకాశాలు ఎక్కువ ఉండటంతో పలు ఆఫీసులు స్లీప్ టైమ్‌ను కూడా కేటాయిస్తున్నాయి.