India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి పూట పలు జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాత్రి పూట 26 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయని పేర్కొంది. గత కొన్ని రోజుల వ్యవధిలోనే 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగడం గమనార్హం.

AP: జగన్ గొడ్డలితో తెగబడితే, YCP కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారని TDP నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘సత్యసాయి జిల్లా కుటాలపల్లిలో TDP కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. అది ముమ్మాటికీ YCP సైకోల పనే. ఓటమి భయంతో మా కార్యకర్తల్ని అంతమొందిస్తున్నారు. YCP కాలకేయులకు ఇదే నా హెచ్చరిక. మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు’ అని వార్నింగ్ ఇచ్చారు.

AP: రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలను వైసీపీ ప్రభుత్వం తెంచేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని తెలిపారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖీలో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. కుప్పంలో లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అయోధ్య బాలరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ మరో చిన్నారి రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన సమయంలో దీనిని రూపొందించడం గమనార్హం. రామ్ లల్లా విగ్రహ తయారీతో యోగిరాజ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబో మరోసారి రిపీట్ కానుంది. సుక్కు డైరెక్షన్‌లో రామ్ చరణ్ తన 17వ సినిమా చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

అస్సాంలో కాంగ్రెస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తన భార్యకు MP టికెట్ అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఆ పార్టీ MLA భరత్ చంద్ర నారా రాజీనామా చేశారు. ఆయన భార్య రాణీ నారా గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఆమె లఖింపూర్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ అక్కడ ఉదయ్ శంకర్ హజారికాకు ఛాన్స్ ఇచ్చింది. దీంతో రాణీ నారా భర్త భరత్ చంద్ర నారా పార్టీకి రాజీనామా చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు.

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇవాళ సాయంత్రం విడుదల కానుంది. స్టార్‌స్పోర్ట్స్‌లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొలుత మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తేదీలు వెలువడిన నేపథ్యంలో నేడు పూర్తి షెడ్యూల్‌ను ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించనుంది.

TG: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. జగదీశ్, ఆయన అనుచరులు నల్గొండ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలను దోచుకున్నారని విమర్శించారు. ఆ భూములు ఉన్న గ్రామాలు, సర్వే నంబర్లతో నిరూపించడానికి తాను సిద్ధమని తెలిపారు. కొల్లగొట్టిన భూములను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారంపై త్వరలో సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని చెప్పారు.

చెన్నైలో ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సౌత్ చెన్నై బరిలో ఉన్న BJP అభ్యర్థి డా.తమిళిసై సౌందరరాజన్, DMK తరఫున పోటీ చేస్తున్న తమిళచ్చి తంగపాండ్యన్ ఒకే సమయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో విమర్శలు చేసుకునే వీరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రాజకీయాల్లో ఇదో మంచి పరిణామమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

TG: నీరు లేక పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ‘20లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీఎం, మంత్రులు అన్నదాతకు భరోసా కల్పించడం లేదు. కాంగ్రెస్ పాలనలో వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రుణాలు చెల్లించాలని అధికారులు రైతులను వేధిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు’ అని హరీశ్ అన్నారు.
Sorry, no posts matched your criteria.