news

News April 13, 2024

భర్త మంచివాడని విడాకులు ఇచ్చిందట!

image

భాగస్వామి మంచివాడు కాదనో, హింసిస్తున్నాడనో, ఇతరత్రా కారణాలతో విడాకులు తీసుకోవడం చూస్తుంటాం. కానీ తన మాజీ భర్త, బ్రెజిల్ ఫుట్‌బాలర్ కాకా.. అతి మంచి వ్యక్తి కావడంతో అతనికి విడాకులిచ్చారట కరోలిన్ సెలికో. ‘కాకా నన్నెప్పుడూ మోసం చేయలేదు. బాగా చూసుకున్నారు. అయినా సంతోషంగా ఉండేదాన్ని కాదు. అతను నా విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండటమే సమస్య’ అని తాజాగా వెల్లడించారు. 2005లో వీరు పెళ్లి చేసుకోగా 2015లో విడిపోయారు.

News April 13, 2024

జాగ్రత్త జగన్ అన్న: KTR

image

ఏపీ సీఎం జగన్‌పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్న. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుల్ని శిక్షించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

News April 13, 2024

సీఎం జగన్‌పై దాడిని ఖండించిన తమిళనాడు సీఎం

image

AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయి దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. ‘రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకుందాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News April 13, 2024

సీఎంపై దాడి.. పవన్, చంద్రబాబు బాధ్యత వహించాలి: అంబటి

image

AP: సీఎం జగన్‌పై జరిగిన దాడి ప్రజల గుండెకు తగిలిన గాయం అని అంబటి రాంబాబు అన్నారు. పవన్, చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలన్నారు. అధికారంలోకి రాలేమని భయంతో టీడీపీ, జనసేన దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గతంలోనూ చంద్రబాబు ఇలా దాడులు చేయించారని అన్నారు. వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాలని.. ఈ ఘటనకు టీడీపీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు.

News April 13, 2024

YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40KM వేగంగా గాలులు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు.

News April 13, 2024

ఏ రాత్రైనా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తాం: ఇరాన్

image

ఏ రాత్రైనా తాము దాడి చేయొచ్చని, సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్‌ను ఇరాన్ తాజాగా హెచ్చరించింది. ‘మేమేం చేస్తామో ఇజ్రాయెల్‌కు తెలీదు. ఎక్కడ దాడి చేస్తామోనని బిక్కుబిక్కుమంటోంది. నిజమైన యుద్ధం కంటే ఈ మానసిక, రాజకీయ యుద్ధమే వారిని ఎక్కువ భయపడుతోంది’ అని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు రహీం తెలిపారు. సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఇజ్రాయెల్ చేసిందని ఇరాన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

News April 13, 2024

పచ్చ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారు: వైసీపీ

image

AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయి దాడిపై వైసీపీ Xలో స్పందించింది. ‘మన నాయకుడు జగన్‌పై పచ్చ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారు. మేమంతా సిద్ధం యాత్రకు వస్తోన్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ మూకలు పిరికిపంద చర్యకు పాల్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించండి. ఈ దాడికి ప్రజలంతా మే 13న సమాధానం చెప్తారు’ అని పేర్కొంది.

News April 13, 2024

కోడికత్తి కమల్ హాసన్ బ్యాక్: టీడీపీ

image

AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై టీడీపీ స్పందించింది. ‘కోడి కత్తి కమల్ హాసన్ బ్యాక్’ అంటూ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో మరో డ్రామాకి తెరలేపారంటూ ఆరోపించింది.

News April 13, 2024

జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేకే దాడి: పేర్ని నాని

image

వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక ఆయనపై టీడీపీ దాడి చేయించిందని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ‘ర్యాలీలో నేనూ ఆయనతో పాటే ఉన్నా. జనంలో జగన్‌కు విపరీతమైన క్రేజ్‌ను చూసి ఓర్వలేకే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. గాయానికి రెండు కుట్లు పడే అవకాశం ఉంది. ఓవైపు కళ్లు బైర్లు కమ్మినా మళ్లీ యాత్రను జగన్ కొనసాగిస్తున్నారు. శత్రువులు ఏం చేసినా కూడా ఆయన సంకల్పాన్ని ఆపలేరు’ అని పేర్కొన్నారు.

News April 13, 2024

అందుకే హీరోలు నాతో కలిసి నటించరు: విద్యాబాలన్

image

లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని.. కొందరు నటులు దాన్ని సహించలేరని బాలీవుడ్ నటి విద్యాబాలన్ అన్నారు. తాను ఎక్కువగా అలాంటి సినిమాలు చేయడం వల్లే తనతో నటించేందుకు హీరోలు ఇష్టపడరని చెప్పారు. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉంటుందనే ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. అలా అయితే స్టార్ కిడ్స్ అందరూ సక్సెస్ అయ్యేవారని పేర్కొన్నారు. తన నటన వల్లే అవకాశాలు దక్కాయని.. నేపథ్యం చూసి కాదని స్పష్టం చేశారు.