India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ గడువును SBI సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో ఉన్న ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 7.6%, మిగిలిన వారికి 7.1% వడ్డీ లభిస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం వడ్డీపై TDS ఉంటుంది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. కాగా సాధారణ డిపాజిట్లలో రెండేళ్ల కాలవ్యవధికి సీనియర్లకు 7.3%, ఇతరులకు 6.80% వడ్డీ లభిస్తుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘జాతీయ అవార్డుగ్రహీత, చక్కటి అభినయ కౌశలం కలిగిన కథానాయకుడు అల్లు అర్జున్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో బన్నీ మరిన్ని పురస్కారాలు, విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ ప్రకటన విడుదల చేశారు.

IPL2024లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు 21 మ్యాచులు జరగ్గా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మనోళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ 316 రన్స్, సాయి సుదర్శన్ 191, రియాన్ పరాగ్ 185, శుభ్‌మన్ గిల్ 183, శాంసన్ 178 రన్స్‌తో టాప్‌లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ 8 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 7, మోహిత్ శర్మ 7తో టాప్-3లో ఉన్నారు. T20 WC ముంగిట ఇది మంచి పరిణామమే.

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘కన్నప్ప’లో నటిస్తోన్న నటీనటుల జాబితా పెరుగుతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం ఈ మూవీలో నటిస్తుండటంతో బిజినెస్ మరింత పెరిగింది. ‘కన్నప్ప’లో నటించేది వీరే.. మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్, కౌశల్, నయనతార, దేవరాజ్‌తో పాటు మరికొందరున్నారు.

AP: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిపై సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని ఫైరయ్యారు. ఆయన మాదిరి తాను బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టలేదని, ప్రజలను మోసం చేయలేదని స్పష్టం చేశారు. ‘నాని ఓసారి అమరావతి రాజధాని కావాలంటారు.. మరోసారి వద్దంటారు. ఆయనకు మైండ్ పనిచేయట్లేదు. నాని పదేళ్లుగా ఎంపీగా ఉన్నా.. నేనెప్పుడూ ఆఫీస్‌కు వెళ్లలేదు. ఎక్కడా ఆయన తమ్ముడినని చెప్పుకోలేదు’ అని పేర్కొన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారు. వీసా పనిపై బంగ్లాదేశ్‌కు వెళ్లిన అతడు గత మ్యాచ్‌కు దూరమయ్యారు. తాజాగా అతడు జట్టులో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ చెన్నై వేదికగా కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముస్తాఫిజుర్, పతిరణ అందుబాటులో ఉంటారని చెన్నై బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తెలిపారు.

రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అమెరికా సాయం చేయకపోతే రష్యా చేతిలో ఓటమి తప్పదన్నారు. అమెరికా కాంగ్రెస్ తమకు మిలిటరీ సాయాన్ని ఆమోదించాలని కోరారు. సాయం లేకపోతే తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ ఉక్రెయిన్ ఓడితే.. ఇతర రాష్ట్రాలపైనా దాడులు జరుగుతాయన్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన దాడి రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది.

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఆట తీరుపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఆడిన 4మ్యాచుల్లోనూ మూడింట్లో లెఫ్టార్మ్ పేసర్లకే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావ్ యశస్వీ? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు’ అని చోప్రా సూచించారు. కాగా గత సీజన్లో ఈ యంగ్ ప్లేయర్ 14 మ్యాచుల్లో 625 రన్స్ చేశారు.

బెంగాల్‌లో ఎన్నికల వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2022 పేలుళ్ల కేసులో ఇద్దరు తృణమూల్ నేతలను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టిన ఆ పార్టీ.. ఎన్నికల వేళ NIA BJP మధ్య పొత్తు కుదిరిందని ఆరోపించింది. మరోవైపు మహిళను వేధించారన్న ఆరోపణలతో NIA అధికారులపై బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అరెస్ట్ అయిన TMC నేత మనోబ్రోతో భార్య మోని ఫిర్యాదు చేశారు. కాగా TMC ఆరోపణలను NIA ఖండించింది.

చార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పరీక్షలను జూన్‌లో నిర్వహించాలని కొంత మంది సీఏ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే మే నెలలో సీఏ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
Sorry, no posts matched your criteria.