India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, చెరువులు ఎండిపోయాయి. అయితే.. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల సరిహద్దులోని డిండి రిజర్వాయర్ మాత్రం నిండుకుండలా నీటితో కళకళలాడుతోంది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా గతేడాది ఈ జలాశయాన్ని నింపారు. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 2.45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.95టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుత యాసంగిలో దీని నుంచి ఆయకట్టుకు నీరు వదల్లేదు.

AP: TDP అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ప.గో జిల్లా తణుకులో సా.4గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తూ.గో జిల్లా నిడదవోలులో రాత్రి 7 గంటలకు నిర్వహించే సభలో రాష్ట్ర BJP చీఫ్ పురందీశ్వరితో కలిసి పాల్గొననున్నారు. రేపు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. సా.4 గంటలకు అంబాజీపేట సభలో, రాత్రి 7కి అమలాపురం సభలో ప్రసంగిస్తారు.

TG: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను జూన్ నెలాఖరు వరకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5,923 కేంద్రాలను ప్రారంభించినట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. ఒక్క మే నెలలోనే 57% పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

IPL-2024లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా GT 4 మ్యాచుల్లో గెలిచింది. RR కేవలం ఒక మ్యాచులోనే నెగ్గింది. పాయింట్స్ టేబుల్‌లో 8 పాయింట్లతో RR టాప్‌లో ఉండగా, GT 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. నేడు ఏ టీమ్ గెలుస్తుందని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేటి నుంచి యథావిధిగా కొనసాగనుంది. ఇవాళ పల్నాడు జిల్లా గంటవారిపాలెం నుంచి ఆయన ఉ.9కి బయల్దేరుతారు. పుట్టావారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. భోజనం అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సా.3:30కి అయ్యప్పనగర్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ధూళిపాళ్లలో బస చేస్తారు.

TS EAPCETకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు మే 1 వరకు గడువు ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,49,247 దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు వస్తుండడంతో JNTU అధికారులు కొత్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సెంటర్లను ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల వల్ల రోజుకు 3,500 మరణాలు సంభవిస్తున్నాయని WHO వెల్లడించింది. హెపటైటిస్ మరణాల సంఖ్య 2019లో 1.1 మిలియన్లుగా ఉండగా, 2022లో 1.3 మిలియన్లకు పెరిగిందని తెలిపింది. మొత్తం హెపటైటిస్ కేసుల్లో మూడింట రెండొంతులు బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, వియత్నాంలో నమోదవుతున్నట్లు WHO నివేదిక పేర్కొంది.

IPLలో అన్ని జట్లు రోహిత్ శర్మను కెప్టెన్ చేయడానికి ఇష్టపడతాడని అంబటి రాయుడు అన్నారు. 2025 సీజన్‌లో ఏ జట్టుకు ఆడాలనేది రోహిత్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ముంబై కంటే బెటర్‌గా ట్రీట్ చేసే ఫ్రాంచైజీకి వెళ్లాలని అతను అనుకుంటాడని చెప్పారు. RCBకి హిట్‌మ్యాన్ అవసరం ఉందా అని ఓ రిపోర్టర్ అడగగా.. ‘ఆ విషయం నాకు తెలియదు. కానీ మీకు ఒక హెడ్‌లైన్ కావాలనే విషయం అర్థం అవుతోంది’ అని సరదాగా బదులిచ్చారు.

సినీపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత ఆర్ఎం వీరప్పన్ (97) అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత నటుడు ఎంజీఆర్‌కు ఆయన సన్నిహితుడు. ఎంజీఆర్, కమల్‌హాసన్, రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్స్‌తో ఆయన పలు సినిమాలను నిర్మించారు. రజనీకాంత్ ‘బాషా’ మూవీకి కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ సాయంత్రం నుంగంబాకంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

దేశవ్యాప్తంగా MBBS, BDSకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-2024) రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. రాత్రి 11:50 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్ ఫీజు చెల్లించవచ్చని NTA పేర్కొంది. గత నెల 16న రిజిస్ట్రేషన్ గడువు ముగియగా, తాజాగా మరోసారి రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని తెలిపింది.
Sorry, no posts matched your criteria.