news

News April 5, 2024

ALL TIME RECORD

image

IPL 2024లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అత్యధిక టీమ్ స్కోరు రికార్డు బ్రేక్ అవ్వగా.. అత్యంత వేగంగా 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న సీజన్‌గా నిలిచింది. కేవలం 17 మ్యాచుల్లోనే ప్లేయర్లు 300కు పైగా సిక్సర్లు బాదడం గమనార్హం. ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ ఇంత తక్కువ మ్యాచుల్లో ఈ సంఖ్యలో సిక్సర్లు నమోదుకాలేదు. కాగా గత సీజన్‌లో ప్లేయర్లు 1,124 సిక్సర్లు బాదారు.

News April 5, 2024

శాంతిస్వరూప్ మృతికి నేతల సంతాపం

image

న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన ఆయన, న్యూస్ రీడర్‌గా తనదైన ముద్ర వేశారని రేవంత్ కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేని రోజుల్లోనే ఆయన చేసిన కృషి ఎంతోమంది వార్తా ప్రసారకులకు స్ఫూర్తినిచ్చిందని జగన్ అన్నారు. ఇక BRS చీఫ్ కేసీఆర్, TDP అధినేత చంద్రబాబు కూడా శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

News April 5, 2024

ఇది రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో: రాహుల్

image

కాంగ్రెస్ రిలీజ్ చేసింది రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో అని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ నిధులెలా సమకూర్చుకుందో బయటపడిందన్నారు. పొలిటికల్, ఫైనాన్షియల్ ప్రయోజనాల కోసం సీబీఐ, ఈడీని ప్రయోగించి బెదిరింపులకు పాల్పడిందని రాహుల్ విమర్శించారు.

News April 5, 2024

హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు: షర్మిల

image

తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలను AP కాంగ్రెస్ చీఫ్ షర్మిల వెల్లడించారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ చేస్తున్నానని ఆమె తెలిపారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

News April 5, 2024

అమ్మాయిలంతా తననే ఇష్టపడుతున్నారని..

image

‘అమ్మాయిలంతా నన్నే చూస్తున్నారు మామా’ ఈ మాటలు మన స్నేహితుల్లో కొందరి నుంచి వింటూ ఉంటాం. అయితే.. ఇలాగే భావించిన చైనీస్ యూనివర్సిటీకి చెందిన లియుకి వింత అనుభవం ఎదురైంది. అతడు చదువులో వెనకబడ్డాడు. ప్రవర్తన మారింది. నిద్రలేదు. చివరికి అతడికి ఉన్నది ఓ మానసిక రుగ్మత అని వైద్యులు తేల్చారు. వీరు వాస్తవిక ప్రపంచంలోకి రాకుండా.. ఊహల్లోనే ఉంటారని చెప్పారు. సైకోథెరపీ తీసుకుంటున్న లియు క్రమంగా కోలుకుంటున్నాడు.

News April 5, 2024

‘దేవర’ ఇవాళే రావాల్సింది.. కానీ మిస్సయ్యాడు!

image

అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే NTR హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమా పార్ట్-1 ఇవాళ థియేటర్లలో సందడి చేసేది. కానీ షూటింగ్ పూర్తికాకపోవడంతో విడుదల తేదీని అక్టోబర్ 10కి మార్చారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఇవాళ తమ హీరో సినిమా థియేటర్లలోకి వచ్చేదని NTR ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

News April 5, 2024

సూర్య వచ్చేశాడు!

image

విధ్వంసకర బ్యాటర్, MR.360 సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరారు. ఈనెల 7న ఢిల్లీతో మ్యాచ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే MI క్యాంపునకు వచ్చేశారు. గాయం కారణంగా సూర్య గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. NCA నుంచి NOC రావడంతో జట్టులో చేరిన SKY.. వరుస ఓటములకు బ్రేక్ వేస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News April 5, 2024

FakeNews: వార్తల వెరిఫికేషన్ చాలా సులువు

image

Way2News లోగోతో కొందరు తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నారు. వీటిని నమ్మినా, షేర్ చేసినా మనం ఇబ్బందులు పడవచ్చు. మేము పబ్లిష్ చేసే ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేస్తే ఆ ఫార్వర్డ్ ఆర్టికల్ కన్పించాలి. లేదంటే మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ మాది కాదు అని గ్రహించండి. మీరు Way2News లోగోతో ఫేక్ వార్తలు పొందితే ఈ-మెయిల్‌లో రిపోర్ట్ చేయండి. grievance@way2news.com -ధన్యవాదాలు

News April 5, 2024

కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్‌రెడ్డి సెటైర్లు

image

కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు. గ్యారంటీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ తమ పార్టీ కార్యాలయాల్లో డబ్బు ముద్రిస్తుందేమో అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలన్నారు.

News April 5, 2024

‘ది గర్ల్ ఫ్రెండ్’గా రష్మిక.. పోస్టర్స్ విడుదల

image

రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని మూవీ టీమ్ తెలిపింది.