news

News March 25, 2024

హైదరాబాద్ VS చెన్నై.. టికెట్ల బుకింగ్ షురూ

image

ఐపీఎల్-2024లో భాగంగా ఏప్రిల్ 5న HYDలో జరగనున్న SRH, CSK మ్యాచ్ టికెట్ల విక్రయం ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://insider.in/hyderabad వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రెండు టికెట్లు కొంటే ఒక ఫ్యాన్ జెర్సీ ఫ్రీగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News March 25, 2024

గంజాయి తాగించి స్నేహితుడిని చంపేశాడు

image

TG: గంజాయి మత్తులో అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి <<12915954>>అత్యాచారం<<>> చేయగా, తాజాగా ఓ యువకుడు ఫ్రెండును చంపేశాడు. HYD బాలానగర్‌లో స్నేహితులు ప్రణీత్(20), సమీర్(20) గంజాయికి బానిసలయ్యారు. ఇటీవల సమీర్ తల్లిని ప్రణీత్ దూషించాడు. ఇది మనసులో పెట్టుకున్న సమీర్.. నిన్న ఉదయం ప్రణీత్‌ను బయటికి తీసుకెళ్లాడు. గంజాయి తాగించి కత్తితో పొడిచేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

News March 25, 2024

విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి?

image

AP: పొత్తులో భాగంగా బీజేపీ కోసం జనసేన వదులుకున్న సీటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. ఈయన NTR జిల్లా కంచికచర్లకు చెందిన వారే. కాగా టీడీపీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుజనా చౌదరి.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగాను పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కాగా ఈ సీటు తమకే కేటాయించాలని స్థానిక జనసేన నేత పోతిన మహేశ్ వర్గం ఆందోళన చేస్తోంది.

News March 25, 2024

ఆ 23లో జనసేనకు ఒకటి

image

AP: గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ 23 నియోజకవర్గాలు TDPకి కంచుకోటల్లా నిలిచాయి. పొత్తులో భాగంగా వీటిలో నుంచి ఓ సీటు జనసేనకు దక్కింది. వైజాగ్ సిటీలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ స్థానాల్లో TDP అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయగా.. విశాఖ దక్షిణ స్థానాన్ని జనసేనకు టీడీపీ కేటాయించింది. ఇంకా జనసేన అభ్యర్థి ఖరారు కాలేదు. 2019లో ఇక్కడి జనసేన అభ్యర్థి గంపల గిరిధర్‌కు 18,119 ఓట్లు పోలయ్యాయి.

News March 25, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లను నిందితులు ట్యాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హవాలా వ్యక్తులను బెదిరించి ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు భారీగా డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారస్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నిందితులు ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బెదిరించినట్లు సమాచారం.

News March 25, 2024

TRAINS: మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?

image

వేసవి సెలవులు రావడంతో సొంతూళ్లకు, ఇతర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లాలనుకునే వారికి బెర్తులు దొరకడం లేదు. టికెట్ రిజర్వేషన్లకు వెసులుబాటు కల్పించినా, ఒకట్రెండు రోజుల్లోనే టికెట్లు అయిపోతున్నాయి. దీంతో అత్యవసరంగా వెళ్లే వారికి ఇబ్బంది ఎదురవుతోంది. అలాగే సొంతూళ్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News March 25, 2024

ఈమె భార్య కాదు.. రాక్షసి

image

TG: సొంతిల్లు కట్టుకోవడానికి ఓ వ్యక్తి కష్టపడి సంపాదించిన ₹16 లక్షలను భార్య చేతికిచ్చాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఆమె సొమ్మును పోగొట్టింది. భర్త నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఫ్రెండ్స్ మందలించబోగా.. అందరి పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటానని ఆమె బెదిరించడంతో అతను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. భువనగిరిలో ఈ ఘటన జరిగింది. ఆన్‌లైన్ గేమ్‌లతో జీవితం నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

News March 25, 2024

2019లో జనసేనకు పోలైన ఓట్లు..1/4

image

➥పిఠాపురం: 28,011(5% ఓట్లు, 3వ స్థానం.. 2009లో ప్రజారాజ్యం గెలుపు)
➥అనకాపల్లి: 12,988(7.53%, 3వ స్థానం.. 2009లో PRP గెలుపు)
➥కాకినాడ R: 40,001(22%, 3వ స్థానం.. 2009 PRP గెలుపు)
➥రాజానగరం: 20,847(11.79%, 2009 PRP 27% ఓట్లు)
➥తెనాలి: 29,905 ఓట్లు(14.53%, 2009లో PRPకి 22%)
➥నిడదవోలు: 23,079(13.73%, 2009 PRPకి 29.40%).

News March 25, 2024

2019లో జనసేనకు పోలైన ఓట్లు..2/4

image

➣పెందుర్తి: 19,626(9.79%, 2009 PRP అభ్యర్థి గెలుపు)
➣ఎలమంచిలి: 19,774(11.72%, 2009 PRP 30% ఓట్లు)
➣పి.గన్నవరం: 36,259(23.91%, 2009 PRP 30.74%)
➣రాజోలు: 50,053(32.92% ఓట్లతో జనసేన గెలుపు)
➣తాడేపల్లిగూడెం: 36,197(21.58%, 3వ స్థానం, 2009 PRP గెలుపు)
➣భీమవరం: 62,285(32.88%,2వ స్థానం, 2009 PRP 26.42%)

News March 25, 2024

కాంగ్రెస్‌లో చేరనున్న మరో వైసీపీ ఎమ్మెల్యే?

image

AP: చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. నిన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలతో HYDలో భేటీ అయ్యారు. ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కాంగ్రెస్‌ గూటికి చేరిన విషయం తెలిసిందే.