India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: DSC పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ECని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోరారు. ‘విస్తారమైన సిలబస్, 4 రోజుల గ్యాప్‌లో TET, TRT నోటిఫికేషన్లు రావడం. SGT పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు B.Ed అభ్యర్థులను అనుమతించడం, గిరిజన పోస్టులకు ఇతరులకు కేటాయించడం, చాలా మంది ఇన్విజిలేషన్, మూల్యాంకన పనితో బిజీగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పరిశీలించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

AP: ఈనెల 27 నుంచి TDP చీఫ్ చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. 27 నుంచి 31వరకు ప్రజాగళం పేరుతో సభలు, రోడ్‌షోల నిర్వహణకు పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు గ్రామీణం, 28న రాప్తాడు, శింగనమల, కదిరిలో ప్రచారం చేస్తారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి.. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు.

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి నామ్ తమిళర్ కట్చి పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె జులై 2020లో BJPలో చేరారు. రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవలే ఆ పార్టీని వీడి NTKలో చేరడంతో ఆ పార్టీ ఆమెకు ఎంపీ టికెట్‌ను కేటాయించింది.

TG: మాజీ రాజ్యసభ సభ్యుడు, BRS నేత జోగినపల్లి సంతోష్ కుమార్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని కబ్జా చేసినట్లు నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ అంజలి వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న ఓ తెలుగు అగ్ర నిర్మాతతో ఆమె ఏడాదిగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అంజలి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆమె ప్రస్తుతం గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్ తదితర తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తెలంగాణలో 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మిగతా 8 స్థానాల బరిలో నిలిచే వారి పేర్లను ఇవాళ ప్రకటించనుంది. ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. అటు ఢిల్లీలో జరిగే బీజేపీ సీఈసీ సమావేశంలో తెలంగాణలోని 2 పెండింగ్ స్థానాలు, ఏపీ అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది.

కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తొలుత 21 రోజులు విధించిన ఈ లాక్‌డౌన్‌ను క్రమంగా మూడుసార్లు పొడిగించారు. అత్యంత కఠినంగా అమలైన ఈ లాక్డౌన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రికార్డు స్థాయిలో జీడీపీ పడిపోయేందుకు కారణమైంది.

టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ‘ఓజీ’. పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ గ్లింప్స్ రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తాజాగా మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఫొటోను యూనిట్ షేర్ చేసింది. యుద్ధాన్ని ఊహించలేరు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

TG: ఆదిలాబాద్ జిల్లాలో BJPకి షాక్ తగిలే అవకాశం ఉంది. సిట్టింగ్ MP సోయం బాపురావు రెబల్‌గా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు బుజ్జగించినా సోయం వెనక్కి తగ్గడం లేదు. పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్న ఆయన.. క్యాడర్ ఉన్న తాను కావాలో? వలస నేత కావాలో తేల్చుకోవాలని అధిష్ఠానానికి సవాల్ విసిరారు. ఆదివాసీ పెద్దలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సోయం తెలిపారు.

TG: ఒక ఆస్తి మొదటి రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా తర్వాత కొనుగోలు చేసిన వారు హక్కులు పొందలేరని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ చిన్న కథ చెప్పారు. ‘పాండవులకు 5 గ్రామాలు ఇవ్వాలని దుర్యోధనుడిని కృష్ణుడు అడిగాడు. వాటిని సామంతులకు ఇచ్చాను.. పాండవులకు ఇవ్వలేనని దుర్యోధనుడు చెప్తాడు. ఆ ప్రకారం ఆస్తిపై హక్కులు కోల్పోయిన వారు ఇతరులకు హక్కులను ఇవ్వలేరు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.