India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ప్రత్యర్థులంతా ఒక్కటై తనపై యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ‘టీడీపీ, బీజేపీ, దత్తపుత్రుడు కలిసిపోయారు. చంద్రబాబుకి శవరాజకీయాలు, కుట్రలు అలవాటు. నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు. ఒంటరిగా వచ్చే ధైర్యం ఒక్కరికి కూడా లేదు. మోసాలు చేసే కూటమి మనకు ప్రత్యర్థిగా ఉంది. వారికి నైతిక విలువలు లేవు’ అని జగన్ మండిపడ్డారు.

భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి చూపుతోంది. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇందుకు BCCI, PCB అంగీకరిస్తే సిరీస్ నిర్వహిస్తామని తెలిపింది. భారత్-పాక్ జట్లు తమ దేశంలో పోటీ పడాలని ప్రపంచంలోని ప్రతీ దేశం కోరుకుంటుందని.. తాము కూడా అలాగే భావిస్తున్నామని పేర్కొంది.

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఎచ్చెర్ల-ఈశ్వరరావు, విశాఖ నార్త్-విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ-రాజారావు, అనపర్తి-శివకృష్ణంరాజు, కైకలూరు-కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్-సుజనా చౌదరి, బద్వేల్-బొజ్జ రోశన్న, జమ్మలమడుగు-ఆదినారాయణరెడ్డి, ఆదోని-పార్థసారథి, ధర్మవరం నుంచి వై.సత్యకుమార్ పోటీ చేయనున్నారు.

AP: విశాఖ డ్రగ్స్ కేసుపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. ‘చంద్రబాబు వదినగారి చుట్టం కంపెనీలో డ్రైఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే సీబీఐ రైడ్స్ చేసింది. దీంతో ఎల్లో బ్రదర్స్ అంతా ఉలిక్కిపడ్డారు. తీరా చూస్తే సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీకి డైరెక్టర్లు. వారు బాబు బంధువులు. నేరం చేసింది వారు.. తోసేది మన మీదికి’ అని జగన్ మండిపడ్డారు.

TG: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా హైకోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల స్థలాన్ని, బడ్జెట్‌లో రూ.1000 కోట్లను కేటాయించింది.

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్‌శర్మ, ఇషాన్‌కిషన్, తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్య(C), టిమ్ డేవిడ్, నమన్ ధీర్, కోయెట్జీ, బుమ్రా, పీయూష్ చావ్లా, ములానీ, క్వేనా మఫాకా.
SRH: ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్‌శర్మ, మార్క్రమ్, క్లాసెన్, సమద్, షాబాజ్ అహ్మద్, కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉనద్కత్.

AP: మాజీ మంత్రి వివేకానంద మరణంపై CM జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో? వారి వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజూ కనిపిస్తూనే ఉంది. చిన్నాన్నను అతిదారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారు. వాడిని చంద్రబాబు, అతడి ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటున్నాయి’ అని ఆరోపించారు.

కెనడాలోని డా.కుల్వీందర్ కౌర్ గిల్ అనే భారత సంతతి వైద్యురాలికి X (ట్విటర్) అండగా నిలిచింది. ప్రభుత్వంపై ఆమె పోరాడుతున్న కేసుకు సంబంధించిన ఫీజు $3,00,000ను (రూ.2.4కోట్లు) తామే భరించనున్నట్లు ప్రకటించింది. కాగా గతంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడాన్ని తప్పుపడుతూ కుల్వీందర్ ట్విటర్‌లో పోస్టులు చేశారు. తాజాగా ఫీజు చెల్లించేందుకు ఆమె క్రౌడ్ ఫండింగ్‌కు పిలుపునివ్వగా మస్క్ ఇందుకు సానుకూలంగా స్పందించారు.

లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆయన.. ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ, మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ చేసిన హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని EDని ఆదేశించింది.

ఒకప్పుడు తనకు వరుస పరాజయాలు ఎదురై నిద్రలేని రాత్రులు గడిపినట్లు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తెలిపారు. తాను నటించిన ‘క్రూ’ సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘పాతికేళ్ల నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. నా సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ అయ్యేవి. హిట్స్ కంటే డిజాస్టర్స్‌తో అందరికీ తెలిసిపోయా. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడేదాన్ని. నేను కాబట్టి తట్టుకోగలిగాను’ అని ఆమె తెలిపారు.
Sorry, no posts matched your criteria.