news

News October 26, 2024

క‌ర్ణాట‌క‌లో మ‌రో రాజ‌కీయ దుమారం

image

KAలోని విజ‌య‌పుర జిల్లా హొన్వాడాలో 1,500 ఎకరాల భూమిని తిరిగి వక్ఫ్ బోర్డుకు కేటాయించిన వ్యవహారం దుమారం రేపింది. త‌మ పూర్వీకుల‌కు చెందిన‌ భూమిని వ‌క్ఫ్ బోర్డుకు తిరిగి కేటాయించిన‌ట్టుగా త‌హ‌శీల్దార్ లేఖ రాశార‌ని గ్రామ రైతులు తెలిపారు. దీంతో వ‌క్ఫ్ ప్రాప‌ర్టీగా నిర్ధారించేందుకు ఆధారాలు లేవ‌ని BJP.. స్థలాలు వ‌క్ఫ్ బోర్డుకు చెందినవి కాబ‌ట్టే నోటీసులు ఇచ్చార‌ని కాంగ్రెస్ మాటల యుద్ధానికి దిగాయి.

News October 26, 2024

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా షర్మిల: వరుదు కళ్యాణి

image

AP: పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారని, ఆయన చేతిలో కీలు బొమ్మలా మారారని వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తోంది. రక్తం పంచుకుని పుట్టిన తన అన్న జగన్‌పై ఇలా మాట్లాడటం దుర్మార్గం. సొంత అన్న అనే అనుబంధం కూడా లేకుండా ఆమె ప్రవర్తిస్తున్నారు. ఆమె తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మరు’ అని కళ్యాణి ఫైర్ అయ్యారు.

News October 26, 2024

గ్రూప్-1: మరో అభ్యర్థి డిబార్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన అభ్యర్థిని ఎగ్జామినర్లు డిబార్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణమ్మ కాలేజీలో చిట్టీలు తీసుకొచ్చి రాస్తున్నట్లుగా గుర్తించారు. నిన్న సీవీఆర్ కాలేజీలో ఓ అభ్యర్థిని డిబార్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ పరీక్షకు 21,181 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరు శాతం 67.4గా నమోదైంది. రేపటితో మెయిన్స్ పరీక్షలు ముగియనున్నాయి.

News October 26, 2024

జియో ఆఫర్.. రూ.699కే..

image

జియో భారత్ 4G ఫోన్ ధర రూ.999 నుంచి రూ.699కి తగ్గింది. ఈ ధ‌ర దీపావళి సంద‌ర్భంగా మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని జియో తెలిపింది. ఇక ఈ ఫోన్‌లో వాడే నెల‌వారీ రీఛార్జ్ ప్లాన్ ఇత‌ర సంస్థ‌ల బేసిక్ ప్లాన్ కంటే రూ.76 త‌క్కువ ధ‌ర‌తో రూ.123 మాత్రమే అని వెల్ల‌డించింది. ఈ ర‌కంగా వినియోగ‌దారులు 9 నెల‌ల్లో ఫోన్ కోసం చెల్లించిన ధ‌ర‌ను తిరిగి పొంద‌వ‌చ‌వ్చ‌ని పేర్కొంది. ఇందులో అన్ని డిజిటల్ సేవలను జియో అందిస్తోంది.

News October 26, 2024

మా పౌరుడి డెత్ స‌ర్టిఫికెట్ మీకెందుకు?.. NIAకి కెనడా కౌంటర్ ప్రశ్నలు

image

ఖ‌లిస్థానీ వేర్పాటువాది నిజ్జ‌ర్ డెత్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌న్న NIA విజ్ఞ‌ప్తిపై కెన‌డా కాల‌యాప‌న చేస్తోంది! కెనడా పౌరుడి డెత్ సర్టిఫికెట్ మీకెందుకు అంటూ కౌంటర్ ప్రశ్నలు వేస్తోంది. నిజ్జ‌ర్‌పై 9 కేసుల్లో NIA ద‌ర్యాప్తు చేస్తోంది. న్యాయ‌ప‌ర‌మైన అవ‌స‌రాల నిమిత్తం నిజ్జ‌ర్ మృతిపై కోర్టుల‌కు స‌మాచారం ఇవ్వాల్సి ఉంద‌ని ఎన్ఐఏ బ‌దులిచ్చిన‌ట్టు తెలుస్తోంది. నిజ్జర్ హత్య కేసులో దౌత్య వివాదం ఇంకా కొనసాగుతోంది.

News October 26, 2024

వ్యర్థాలను తొలగించని బిల్డర్లపై చర్యలు: హైడ్రా

image

TG: హైడ్రా కూల్చిన తర్వాత భవన వ్యర్థాలను తొలగించే బాధ్యత సంబంధిత బిల్డర్లదేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. వాటిని తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చం. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది చెరువులు, నాలాల్లో చేపట్టిన నిర్మాణాలనే కూల్చుతాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.

News October 26, 2024

మెట్రో విస్తరణకు క్యాబినెట్ ఆమోదం

image

TG: హైదరాబాద్‌లో మెట్రో రైల్ మార్గం విస్తరణకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, LB నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించేందుకు ఆమోదం తెలిపింది.

News October 26, 2024

జగన్ పతనాన్ని కోరుకుంటున్న షర్మిల: గుడివాడ అమర్నాథ్

image

AP: PCC చీఫ్ షర్మిల దిగజారి ప్రవర్తిస్తున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఆమె చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మేం నిజాలను బయటపెడుతుంటే షర్మిల ఉలిక్కిపడుతున్నారు. సొంత అన్న గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సైకో, శాడిస్ట్ అంటూ జగన్ పతనాన్ని కోరుకుంటున్నారు. ఆయనపై ఇలానే మాట్లాడితే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఊరుకోరు’ అని ఆయన హెచ్చరించారు.

News October 26, 2024

CSK రిటెయిన్ చేసుకునేది వీరినేనా?

image

వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జడేజా, రుతురాజ్, పతిరణ, ధోనీని రిటెయిన్ చేసుకోవచ్చని క్రిక్‌బజ్ వెబ్‌సైట్ తెలిపింది. వీరిలో జడేజా తొలి రిటెన్షన్‌గా, రుతురాజ్ రెండు, పతిరణ మూడో రిటెన్షన్లుగా ఉంటారని అంచనా వేసింది. ధోనీని అన్‌క్యాప్డ్ ఆటగాడిగా తీసుకోనుందని క్రిక్‌బజ్ స్పష్టం చేసింది. రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశముందని చెప్పింది.

News October 26, 2024

చైనాతో ఒప్పందం ఎలా సాధ్యమైందంటే..: ఎస్ జైశంకర్

image

తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఉపసంహరణ విషయంలో చైనా, భారత్‌ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు అంశాలు ఆ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘మన సైన్యం అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడింది. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణం. ఇక సరిహద్దు వెంబడి దశాబ్దకాలంగా మనం అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు రెండో కారణం’ అని వివరించారు.