news

News April 5, 2024

TODAY HEADLINES

image

✒ AP: ఇంటర్ కాలేజీలకు మే 31 వరకు సెలవులు
✒ AP: టిప్పర్ డ్రైవర్లకూ రూ.10,000: CM జగన్
✒ AP: పోలీసులు జగన్‌ను లోపల వేయాలి: CBN
✒ AP: చంద్రబాబుకు EC నోటీసులు
✒ AP: అవినాశ్ బెయిల్ రద్దు చేయాలి: CBI
✒ TG: టెస్లాతో చర్చలు జరుపుతున్నాం: శ్రీధర్ బాబు
✒ TG: ఫోన్ ట్యాపింగ్‌లో KCR ప్రమేయం: కిషన్ రెడ్డి
✒ TG: నేతన్నలపై కాంగ్రెస్ కక్ష కట్టింది: KTR
✒ TG: కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తీర్పు

News April 5, 2024

జూన్‌లో ‘రాయన్’?

image

సూపర్‌స్టార్‌ ధనుశ్ నటిస్తున్న 50వ చిత్రం ‘రాయన్’. ఈ మూవీలో ధనుశ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. జూన్ 7న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

News April 4, 2024

BREAKING: పంజాబ్ సూపర్ విక్టరీ

image

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో చేధించింది. 111 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో శశాంక్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 29 బంతుల్లోనే 4 సిక్సులు, 6 ఫోర్లతో 61 రన్స్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరో ఎండ్‌లో అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 పరుగులతో రాణించారు.

News April 4, 2024

ఉప్పల్ స్టేడియంకు విద్యుత్ పునరుద్ధరణ

image

ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై మ్యాచ్‌కు ఆటంకాలు తొలగాయి. నాలుగైదు గంటల తర్వాత స్టేడియంకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. దీంతో శుక్రవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ యధాతథంగా జరగనుంది.

News April 4, 2024

రేపు కాంగ్రెస్ పార్టీలోకి కూన శ్రీశైలం గౌడ్?

image

TG: బీజేపీ నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి.. కూన శ్రీశైలంను కలిసి, పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి శ్రీశైలం గౌడ్ అంగీకరించారని, రేపే హస్తం పార్టీలో చేరతారని సమాచారం.

News April 4, 2024

మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు

image

AP: చంద్రబాబే పింఛన్లు ఆపారంటూ మంత్రి జోగి రమేశ్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అలాగే వాలంటీర్ల సేవల నిలిపివేతకూ చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు చేసిన ట్వీట్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో జోగి రమేశ్‌తో పాటు ఎమ్మెల్సీ, ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

News April 4, 2024

బీర్లు తాగేవారికి బ్యాడ్ న్యూస్!

image

గ్రేటర్ హైదరాబాద్‌లోని బీర్ల తయారీ కంపెనీలు నీటి ఎద్దడితో ఇబ్బందిపడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బీర్ల తయారీకి నీటి కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. నగరంలోని బీర్ల తయారీ కంపెనీలకు రోజుకు 44 లక్షల లీటర్ల నీరు అవసరం. 1999 తర్వాత తొలిసారిగా బీర్ల తయారీపై ఎఫెక్ట్ పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేక బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

News April 4, 2024

అనపర్తి టికెట్ టీడీపీకి దక్కనుందా?

image

AP: పొత్తులో భాగంగా BJPకి కేటాయించిన అనపర్తి టికెట్ TDPకే దక్కనున్నట్లు సమాచారం. అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి TDP రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించడంతో ఇరు పార్టీలు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీటును BJPకి కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదని కొవ్వూరు సభలో చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నల్లమిల్లి కూడా రెండు రోజుల్లో కార్యకర్తల ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పడం గమనార్హం.

News April 4, 2024

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం

image

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత నమోదైంది. భూకంప కేంద్రం చంబాలో ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2024

ఫుట్‌బాలర్ దారుణ హత్య

image

దక్షిణాఫ్రికా ఫుట్‌బాలర్ ల్యూకె ఫ్లెయర్స్ (24) దారుణ హత్యకు గురయ్యారు. జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద దుండగులు కాల్పులు జరపడంతో ల్యూకె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఫ్లెయ‌ర్స్ హ‌త్య‌పై పోలీసులు మ‌ర్డ‌ర్, కారు హైజాకింగ్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఫ్లెయర్స్ టోక్యో ఒలింపిక్స్‌లో అండ‌ర్-23 జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించారు.