news

News November 4, 2025

12 నెలల పాటు ChatGPT ఫ్రీ.. ఇలా చేయండి

image

ఓపెన్ ఏఐ కంపెనీ 12 నెలల పాటు ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ను <<18129528>>ఫ్రీగా<<>> అందిస్తోంది. ఇందుకోసం ఇలా చేయండి.
*ChatGPT యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
*యాప్ ఓపెన్ చేయగానే పైన కనిపించే Try Go, Freeపై క్లిక్ చేయాలి
*ఆ తర్వాత Upgrade to Goపై క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
*రూ.2 డెబిట్ అయి వెంటనే క్రెడిట్ అవుతాయి.
NOTE: ప్లాన్ యాక్టివేట్ అయ్యాక ఆటో రెన్యువల్ క్యాన్సిల్ చేయడం మర్చిపోవద్దు.

News November 4, 2025

ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీల అల్టిమేటం

image

TG: పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే డిసెంబర్‌లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ₹3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీలో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.

News November 4, 2025

నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్

image

TG: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండో విడత విచారణ చేపట్టనున్నారు. 6, 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్‌, 7, 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను రెండు సార్లు విచారించనున్నారు. తొలుత పిటిషనర్లు, తర్వాత ప్రతివాదులను ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అంతకుముందు తొలి విడతలో <<17912398>>ఇద్దరు<<>> ఎమ్మెల్యేలను విచారించిన సంగతి తెలిసిందే.

News November 4, 2025

APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(APEDA) 6 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc( అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్), పీజీ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ) అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 4, 2025

డ్రైవరన్నా.. వేగం తగ్గించు!

image

TG: ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం వేగంగా వెళ్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, ఒత్తిడికి గురవుతున్నామని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.

News November 4, 2025

వరి కోతలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది

image

వరి వెన్నులో 80-90% గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంటను కోయాలి. ఈ దశలో గింజల్లో తేమ 18-24% వరకు ఉంటుంది. గింజలు పూర్తిగా ఎండే వరకు ఉంచకూడదు. పంట పక్వానికి వచ్చాక ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గి, గింజలపై పగుళ్లు ఏర్పడి ధాన్యాన్ని మర పట్టించినప్పుడు నూక శాతం పెరుగుతుంది. గింజలలో తేమ శాతం తగ్గించడానికి పనలను 4 నుంచి 5 రోజులు చేనుపై ఎండనివ్వాలి. పనలను తిరగతిప్పితే సమానంగా ఎండుతాయి.

News November 4, 2025

ఫ్లాప్స్ వచ్చినా ఆఫర్లకు కొదవలేదు..

image

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా హీరోయిన్ శ్రీలీల హవా కొనసాగుతోంది. పెళ్లి సందడితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ధమాకా, భగవంత్ కేసరి వంటి హిట్లు ఖాతాలో వేసుకున్నారు. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, మాస్ జాతర అలరించలేకపోయాయి. 10కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి సక్సెస్ రేట్ 30శాతమే ఉంది. ప్రస్తుతం శ్రీలీల 3-4 సినిమాల్లో నటిస్తున్నారు.

News November 4, 2025

‘Admin123’.. అంతా కొట్టేశాడు!!

image

గుజరాత్ హ్యాకర్ పరిత్ ధమేలియా 2024లో ఢిల్లీ, నాసిక్, ముంబై తదితర నగరాల్లో 50K CCTV క్లిప్స్ తస్కరించాడు. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లోని ఈ క్లిప్స్ పోర్న్ మార్కెట్లో అమ్మేశాడు. మొదట రాజ్‌కోట్ పాయల్ ఆస్పత్రిలో గైనకాలజీ టెస్ట్స్ ఫుటేజ్ కోసం CCTV హ్యాక్ చేస్తే పాస్‌వర్డ్ Admin123 అని తెలిసింది. ఇదే పాస్వర్డ్‌తో ఇతర నగరాల్లోనూ హ్యాక్ చేశాడు. ఈ Febలో అరెస్టైన పరిత్ నేర వివరాలు తాజాగా బయటకొచ్చాయి.

News November 4, 2025

కెనడా ‘కల’గానే మిగులుతోంది

image

కెనడాలో విద్య, ఉద్యోగాల కోసం పెట్టుకున్న భారతీయుల వీసా అప్లికేషన్స్ ఈసారి 74% రిజెక్ట్ అయ్యాయి. ఆ దేశంతో రిలేషన్ గ్యాప్‌తో దరఖాస్తులు గణనీయంగా తగ్గగా, అప్రూవల్స్ సైతం అలాగే ఉన్నాయి. 2023లో 20K ఇండియన్స్ అప్లై చేస్తే 32% రిజెక్టవగా ఇప్పుడు 4,515లో అప్రూవ్డ్ 1,196. ఓవరాల్‌గా ఫారిన్ స్టూడెంట్ వీసాలు తగ్గించడంతో కెనడా వర్సిటీలకూ నిధుల లోటు తప్పట్లేదు. ఇక ఇండియన్స్ ఇప్పుడు UK, AUS వైపు చూస్తున్నారట.

News November 4, 2025

ఓల్డ్ బ్యాంకు అకౌంట్‌లో డబ్బు ఫ్రీజ్ అయిందా?

image

మీ కుటుంబసభ్యులు తమ బ్యాంకు అకౌంట్లలో డబ్బు ఉంచి మర్చిపోయారా? పదేళ్ల కంటే ఎక్కువ సమయం కావడంతో అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారా? అలా ఫ్రీజ్ చేసిన డబ్బును RBI తన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. వీటిని తిరిగి పొందవచ్చు. udgam.rbi.org.inలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తనిఖీ చేయొచ్చు. బ్యాంకుకు వెళ్లి KYC సమర్పించి డబ్బును తిరిగి పొందొచ్చు. SHARE IT