India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరి వెన్నులో 80-90% గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంటను కోయాలి. ఈ దశలో గింజల్లో తేమ 18-24% వరకు ఉంటుంది. గింజలు పూర్తిగా ఎండే వరకు ఉంచకూడదు. పంట పక్వానికి వచ్చాక ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గి, గింజలపై పగుళ్లు ఏర్పడి ధాన్యాన్ని మర పట్టించినప్పుడు నూక శాతం పెరుగుతుంది. గింజలలో తేమ శాతం తగ్గించడానికి పనలను 4 నుంచి 5 రోజులు చేనుపై ఎండనివ్వాలి. పనలను తిరగతిప్పితే సమానంగా ఎండుతాయి.

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా హీరోయిన్ శ్రీలీల హవా కొనసాగుతోంది. పెళ్లి సందడితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ధమాకా, భగవంత్ కేసరి వంటి హిట్లు ఖాతాలో వేసుకున్నారు. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, మాస్ జాతర అలరించలేకపోయాయి. 10కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి సక్సెస్ రేట్ 30శాతమే ఉంది. ప్రస్తుతం శ్రీలీల 3-4 సినిమాల్లో నటిస్తున్నారు.

గుజరాత్ హ్యాకర్ పరిత్ ధమేలియా 2024లో ఢిల్లీ, నాసిక్, ముంబై తదితర నగరాల్లో 50K CCTV క్లిప్స్ తస్కరించాడు. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లోని ఈ క్లిప్స్ పోర్న్ మార్కెట్లో అమ్మేశాడు. మొదట రాజ్‌కోట్ పాయల్ ఆస్పత్రిలో గైనకాలజీ టెస్ట్స్ ఫుటేజ్ కోసం CCTV హ్యాక్ చేస్తే పాస్‌వర్డ్ Admin123 అని తెలిసింది. ఇదే పాస్వర్డ్‌తో ఇతర నగరాల్లోనూ హ్యాక్ చేశాడు. ఈ Febలో అరెస్టైన పరిత్ నేర వివరాలు తాజాగా బయటకొచ్చాయి.

కెనడాలో విద్య, ఉద్యోగాల కోసం పెట్టుకున్న భారతీయుల వీసా అప్లికేషన్స్ ఈసారి 74% రిజెక్ట్ అయ్యాయి. ఆ దేశంతో రిలేషన్ గ్యాప్‌తో దరఖాస్తులు గణనీయంగా తగ్గగా, అప్రూవల్స్ సైతం అలాగే ఉన్నాయి. 2023లో 20K ఇండియన్స్ అప్లై చేస్తే 32% రిజెక్టవగా ఇప్పుడు 4,515లో అప్రూవ్డ్ 1,196. ఓవరాల్‌గా ఫారిన్ స్టూడెంట్ వీసాలు తగ్గించడంతో కెనడా వర్సిటీలకూ నిధుల లోటు తప్పట్లేదు. ఇక ఇండియన్స్ ఇప్పుడు UK, AUS వైపు చూస్తున్నారట.

మీ కుటుంబసభ్యులు తమ బ్యాంకు అకౌంట్లలో డబ్బు ఉంచి మర్చిపోయారా? పదేళ్ల కంటే ఎక్కువ సమయం కావడంతో అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారా? అలా ఫ్రీజ్ చేసిన డబ్బును RBI తన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. వీటిని తిరిగి పొందవచ్చు. udgam.rbi.org.inలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తనిఖీ చేయొచ్చు. బ్యాంకుకు వెళ్లి KYC సమర్పించి డబ్బును తిరిగి పొందొచ్చు. SHARE IT

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<

పెద్దలు మనల్ని దీవించేటప్పుడు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని అంటారు. మరి ఆ అష్టైశ్వర్యాలేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే 8. అందుకే అష్టైశ్వర్యాలంటే డబ్బే అనుకుంటారు. కానీ, కాదు. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయం.. ఇవే 8 ఐశ్వర్యాలు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే కావాల్సినవి ఇవే. డబ్బు కాదు. అందుకే ఇవి కలగాలని పెద్దలు మనల్ని అలా జీవిస్తారు.

భారత మహిళా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వన్డే వరల్డ్ కప్ కలను నెరవేర్చుకున్న ఉమెన్ ఇన్ బ్లూ ముందు మరో లక్ష్యం ఉంది. అదే T20 వరల్డ్ కప్. ఇప్పటివరకు జరిగిన 9 సీజన్లలో ఆస్ట్రేలియా(5), ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ విజేతగా నిలిచాయి. 2020లో రన్నరప్‌గా నిలవడమే టీమ్ ఇండియాకు ఉత్తమ ప్రదర్శన. ప్రస్తుతం మూడో ర్యాంకులో ఉన్న ఇండియా వచ్చే ఏడాది జరిగే WCను గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

వరి పంటను ముందుగా కోసినట్లయితే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, కంకిలోని చివరి గింజలు పూర్తిగా నిండుకోక చాలా సన్నగా పొట్ట తెలుపు కలిగి ఉంటాయి. దీని వల్ల మిల్లింగ్ చేసినప్పుడు నిండు గింజల దిగుబడి తగ్గి అధికంగా నూక, తౌడు వస్తాయి. గింజలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పంటను సకాలంలో కోత కోయక పోతే గింజలు ఎక్కువగా ఎండి రాలిపోవడమే కాకుండా పగుళ్లు ఏర్పడతాయి.

ఇవాళ రా.10.30 నుంచి రేపు సా.6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేసుకోవాలని సూచిస్తున్నారు. రేపు ఉ.4:52-5.44 వరకు నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి. సా.5.15-7.05 వరకు దీపారాధాన చేసేందుకు మంచి సమయమని చెబుతున్నారు. ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే దోషాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.