news

News November 4, 2025

మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వరా: KTR

image

నిన్న మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వ్యాన్‌లో తరలించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ‘మరణంలోనూ కనీస గౌరవం లేకపోవడం బాధాకరం. రాష్ట్రంలో అంబులెన్స్‌లు / మార్చురీ వ్యాన్‌లు లేవా? చనిపోయిన వారికి & వారి కుటుంబాలకు కనీస గౌరవం ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారు. తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, చెత్త వ్యాన్లు, టోయింగ్ వాహనాలపై ఇలా తీసుకెళ్లడం ఏంటి’ అంటూ X వేదికగా మండిపడ్డారు.

News November 4, 2025

మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

image

మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

News November 4, 2025

ప్రభాస్‌తో నటిస్తారా.. రష్మిక ఏమన్నారంటే?

image

ఈ నెల 7న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రిలీజ్ నేపథ్యంలో Xలో అభిమానుల ప్రశ్నలకు హీరోయిన్ రష్మిక ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్‌తో నటించే అవకాశముందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా ‘ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూస్తారని అనుకుంటున్నా. త్వరలోనే మేము కలిసి పనిచేస్తామని నమ్ముతున్నా’ అని తెలిపారు. హీరో మహేశ్ బాబుకు రోజు రోజుకు వయసు తగ్గుతోందని మరో ప్రశ్నకు బదులిచ్చారు.

News November 4, 2025

ఫ్రీగా త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా అప్లై

image

AP: దివ్యాంగులకు ఉచితంగా 1,750 త్రీవీలర్ <<18191488>>మోటార్ సైకిళ్లు<<>> అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
>అర్హతలు
*రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, కనీసం 10th పాసై స్వయం ఉపాధి
*18-45 ఏళ్ల లోపు వయసు. 70% అంగవైకల్యం
*డ్రైవింగ్ లైసెన్స్
> దరఖాస్తులకు లాస్ట్ డేట్ నవంబర్ 25. సైట్ <>www.apdascac.ap.gov.in<<>>

News November 4, 2025

ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో 55 ఉద్యోగాలు

image

ఎయిమ్స్ <>గోరఖ్‌పూర్<<>> 55 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు NMC/MCIలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నవంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. అప్లికేషన్ ఫామ్‌పై ట్రాన్సాక్షన్ నంబర్ రాయాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్:https://aiimsgorakhpur.edu.in

News November 4, 2025

మనవరాలు, తల్లి, తాత.. ముగ్గురూ మృతి

image

TG: నిన్న మీర్జాగూడ <<18183262>>బస్సు<<>> ప్రమాదంలో మరణించిన తల్లీకూతుళ్ల ఫొటో గుండెలను పిండేసిన విషయం తెలిసిందే. తాండూరుకు చెందిన ఖాలీద్.. తన 40 రోజుల మనవరాలికి నామకరణం చేసేందుకు రెండు రోజుల క్రితం HYD నుంచి తీసుకొచ్చారు. అత్తారింట్లో దిగబెట్టేందుకు బస్సులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. తల్లి సలేహ బిడ్డకు హాని జరగకుండా పొత్తిళ్లలో గట్టిగా హత్తుకున్నా ప్రాణాలు దక్కలేదు. ఆ ప్రమాదంలో ఖాలీద్ కూడా చనిపోయారు.

News November 4, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,12,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 4, 2025

కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..

image

TG: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంలేని కుటుంబసభ్యులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఝరాసంగం మం. కక్కర్‌వాడలోని విఠల్ కూతురు, అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో విఠల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి రాధాకృష్ణ తండ్రిపై ఘోరంగా దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు.

News November 4, 2025

వంటింటి చిట్కాలు

image

*మరమరాలు మెత్తబడినప్పుడు రెండు నిమిషాలు వేయిస్తే మళ్లీ కరకరలాడతాయి.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.
* ఉసిరికాయ నిల్వ పచ్చడి నలుపెక్కకుండా ఉండాలంటే జాడీలో పెట్టిన తర్వాత మధ్యలో ఇంగువ ముక్క ఉంచండి.
* బెండకాయలు 2, 3 రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలతో పాటు రెండో చివరను కూడా కోసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

News November 4, 2025

RITESలో 600 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.