news

News December 26, 2024

విరాళాల్లో బీజేపీ తర్వాత బీఆర్ఎస్సే!

image

2023-24 ఏడాదికి పొందిన అత్యధిక విరాళాల విషయంలో బీఆర్ఎస్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈసీ వెబ్‌సైట్ ప్రకారం.. విరాళాల రూపంలో BJP అత్యధికంగా రూ.2244 కోట్లను పొందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 3రెట్లు అధికం. ఇక తర్వాతి స్థానంలో రూ.495.5 కోట్లతో BRS నిలిచింది. కాంగ్రెస్ రూ.288.9 కోట్లు పొందింది. YSRCP 121.5 కోట్లు, DMK రూ.60 కోట్లు పొందినట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వెల్లడించాయి.

News December 26, 2024

గుకేశ్‌ను సత్కరించిన సూపర్ స్టార్

image

వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా అవతరించిన భారత చెస్ ప్లేయర్ గుకేశ్ దొమ్మరాజును సూపర్ స్టార్ రజినీకాంత్ అభినందించారు. గుకేశ్ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించిన రజినీ, సత్కరించి వారితో కొంత సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా తమను ఆహ్వానించినందుకు రజినీకాంత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ గుకేశ్ ట్వీట్ చేశారు. అలాగే హీరో శివ కార్తికేయన్‌ను కూడా ఆయన కలువగా దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు.

News December 26, 2024

శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు: సీఎం

image

సినీ పరిశ్రమకు అండగా ఉంటామంటూనే ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదన్నారు. హీరోల ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుందని, సొసైటీకి ఆదర్శంగా వారి ప్రవర్తన ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సంధ్య థియేటర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు.

News December 26, 2024

సినీ ప్రముఖులతో భేటీలో సీఎం ఆవేదన

image

TG: సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఈ భేటీకి మంత్రులు, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, చిక్కడపల్లి సీఐతో పాటు సినీ పరిశ్రమ నుంచి 46 మంది హాజరయ్యారు.

News December 26, 2024

కేంద్రం అనుమతిస్తే డీజిల్ టూ ఎలక్ట్రిక్ బస్సు?

image

TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.

News December 26, 2024

బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

image

సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.

News December 26, 2024

సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరం

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.

News December 26, 2024

సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో దిల్ రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News December 26, 2024

సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవేనా?

image

TG: సినీ ప్రముఖుల ముందు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలుస్తోంది. వీటిపై నిర్మాతలు, దర్శకులు, హీరోలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.
1.సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.
2.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా హీరో, హీరోయిన్ ప్రచార కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి.
3.కులగణన సర్వే ప్రచార కార్యక్రమాలకు సహకరించాలి.

News December 26, 2024

అంబటి రాంబాబు సంచలన ట్వీట్

image

AP: వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. ‘దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహార్ వంగవీటి మోహన రంగా’ అని Xలో పేర్కొన్నారు. కాగా 1988లో బెజవాడలో జరిగిన అల్లర్లలో మోహన రంగాను ప్రత్యర్థులు హతమార్చారు.