news

News September 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 7, 2025

శుభ సమయం (7-09-2025) ఆదివారం

image

✒ తిథి: పూర్ణిమ రా.11.50 వరకు
✒ నక్షత్రం: శతభిషం రా.10.58 వరకు
✒ శుభ సమయములు: ఉ.8.35-ఉ.9.10, మ.3.00-మ.3.10
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: ఉ.6.26-ఉ.8.00
✒ అమృత ఘడియలు: సా.3.53-సా.5.25

News September 7, 2025

HEADLINES

image

* ప్రపంచ శాంతి కోసం భారత్-ఫ్రాన్స్ కలిసి పనిచేస్తాయి: PM మోదీ
* హైదరాబాద్‌లో అట్టహాసంగా నిమజ్జనం.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
* చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
* GST ఎఫెక్ట్స్‌తో కార్ల ధరలు తగ్గించిన మారుతీ, మహీంద్రా, టొయోటా
* ఈ నెల 9న ‘అన్నదాత పోరు’: YCP
* లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

News September 7, 2025

జస్టిస్ సుదర్శన్ రెడ్డికి MIM మద్దతు

image

వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం ప్రెసిడెంట్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ తనను కోరినట్లు అసద్ Xలో పోస్ట్ చేశారు. ‘హైదరాబాదీ, న్యాయనిపుణుడైన సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం. ఆయనతో మాట్లాడి బెస్ట్ విషెస్ చెప్పాను’ అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈనెల 9న జరగనుంది.

News September 7, 2025

RRBలో 434 పోస్టులు.. గడువు పెంపు

image

RRBలో 434 పారామెడికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. ఈ నెల 18 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని RRB తెలిపింది. నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్ట్, టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వంటి పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం పోస్టులను బట్టి రూ.21,700 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. <>rrbsecunderabad.gov.in<<>>లో అప్లై చేసుకోవచ్చు.

News September 7, 2025

35 ఏళ్లుగా చాయ్ మాత్రమే తాగుతోంది!

image

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాకు చెందిన పల్లి దేవి గత 35 ఏళ్లుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం టీ తాగుతూ జీవిస్తున్నారు. ఆమె తన 11 ఏళ్ల వయసు నుంచే ఆహారం, నీటికి బదులుగా టీ తాగుతూ శివుడి పూజలో నిమగ్నమైపోయారు. రోజుకు ఒకసారి బ్లాక్ టీ తాగుతున్నట్లు ఆమె కుటుంబీకులు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా టీ మాత్రమే తాగి జీవించడం అసాధ్యమని, ఇప్పటికీ ఆమె ఆరోగ్యంగా ఉండటంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

News September 7, 2025

అందుబాటులో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు: సీఎం

image

AP: రాష్ట్రంలో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని CM చంద్రబాబు తెలిపారు. ‘రేపు కాకినాడకు షిప్ ద్వారా 15వేల మెట్రిక్ టన్నుల ఎరువులు వస్తాయి. మరో 10 రోజుల్లో 41 వేల టన్నుల ఎరువులు రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాను పరిశీలించాలి’ అని టెలీ కాన్ఫరెన్సులో ఉన్నతాధికారులను CM ఆదేశించారు.

News September 7, 2025

బిగ్‌బాస్-9 కంటెస్టెంట్లు వీరేనా?

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న <<17604853>>బిగ్‌బాస్-9లో<<>> పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ SMలో చక్కర్లు కొడుతోంది. వీరిలో ఆషా సైనీ, సంజనా గల్రానీ, ఇమ్మాన్యుయేల్, రీతూ, తనూజ గౌడ, శ్రష్ఠి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, భరణి ఉన్నారని సమాచారం. ఈసారి ఆరుగురు సామాన్యులకు అవకాశం కల్పించినట్లు టాక్. మాస్క్ మ్యాన్ హరీశ్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, మనీష్, ప్రియ వీరిలో ఉన్నట్లు తెలుస్తోంది.

News September 7, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే.

News September 6, 2025

దేశవ్యాప్తంగా SIR అమలుకు ఈసీ సన్నాహాలు!

image

దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడంపై ఈ నెల 10న ఎలక్షన్ కమిషన్(EC) కీలక భేటీ నిర్వహించనుంది. 2026లో బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో త్వరగా SIR కింద ఓట్ల వడపోత చేపట్టాలని భావిస్తోంది. అయితే బిహార్‌లో SIR అమలును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. దానిపై రాహుల్ ఏకంగా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.