news

News October 26, 2024

దూకుడే కొంపముంచిందా?

image

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అనుసరించిన వ్యూహాలను న్యూజిలాండ్‌తో రిపీట్ చేయడం భారత జట్టు ఘోర పరాజయానికి కారణమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న జట్లపై దూకుడు మంత్రం ఫలించినా న్యూజిలాండ్ వంటి జట్టుపై ఆచితూచి ఆడాల్సిందని చెబుతున్నారు. ముఖ్యంగా భాగస్వామ్యాలు నెలకొల్పడంపై ఆటగాళ్లు దృష్టి సారిస్తే చారిత్రక పరాజయం ఖాతాలో చేరేది కాదని అంటున్నారు. మరి మీరేమంటారు?

News October 26, 2024

నవంబర్ 4 వరకు ఆ సేవలు నిలిపివేత

image

AP: భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్‌లైన్‌లో పర్మిషన్లు ఇచ్చే పోర్టల్‌లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 4 వరకు ఆన్‌లైన్ అనుమతుల సేవలు నిలిపివేసినట్లు DPMS డైరెక్టర్ తెలిపారు. సర్వర్ మైగ్రేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News October 26, 2024

టీమ్ ఇండియాకు బ్యాడ్ డేస్

image

గత రెండు వారాల్లోనే భారత పురుషుల జట్టు, మహిళల, యువకుల జట్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్నాయి. కివీస్‌పై మెన్స్ టీమ్ 36 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆసియా కప్‌లో ఉమెన్స్ టీమ్ సెమీ ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. దుబాయ్‌లో జరిగిన ఎమర్జింగ్ టోర్నీ సెమీ ఫైనల్‌లో పసికూన అఫ్గానిస్థాన్‌పై భారత యువ జట్టు ఓడి ఫైనల్‌కు చేరలేకపోయింది. దీంతో భారత జట్టుకు ఇవి మంచి రోజులు కావంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

News October 26, 2024

సన్న వడ్లకు రూ.500 బోనస్.. క్యాబినెట్ ఆమోదం

image

TG: సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ములుగులో సమ్మక్క-సారలమ్మ వర్సిటీకి భూకేటాయింపునకు మంత్రివర్గం ఆమోదించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంచాలని నిర్ణయించింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

News October 26, 2024

‘లక్కీ భాస్కర్’ ఈవెంట్‌కు గెస్టులుగా విజయ్, త్రివిక్రమ్

image

హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ దీపావళి సందర్భంగా ఈనెల 31న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మేకర్స్ రేపు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. దీనికి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్టులుగా వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. HYDలోని JRC కన్వెన్షన్ సెంటర్‌లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.

News October 26, 2024

గంభీర్‌ కోచింగ్‌పై విమర్శలు

image

స్వదేశంలో తొలిసారిగా న్యూజిలాండ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ ఓడటంపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచే ఓటములు మొదలయ్యాయంటూ ఆరోపిస్తున్నారు. శ్రీలంకపై 27 ఏళ్లలో తొలిసారిగా వన్డే సిరీస్ ఓటమి, స్వదేశంలో 12ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఓటమి గంభీర్ వైఫల్యాలేనంటూ విమర్శిస్తున్నారు. ఆటగాళ్లు విఫలమైతే కోచ్ ఏం చేస్తారంటూ గంభీర్ ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

News October 26, 2024

దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. కేంద్రం వార్నింగ్!

image

దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In సూచించింది. ఫిషింగ్, లాటరీ, జాబ్, టెక్ సపోర్ట్, ఇన్వెస్ట్‌మెంట్, COD, ఫేక్ ఛారిటీ, పొరపాటున నగదు పంపడం, డిజిటల్ అరెస్ట్, ఫోన్, పార్సిల్ స్కామ్‌లపై వార్నింగ్ ఇచ్చింది. కాలర్‌ను వెరిఫై చేసుకోవాలని, భయపడొద్దని, వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్, APPS ఇన్‌స్టాల్ చేయొద్దని, లింకులు క్లిక్ చేయొద్దని చెప్పింది.

News October 26, 2024

భారత్ FINALకు వెళ్లాలంటే..

image

NZపై సిరీస్ ఓటమితో భారత WTC ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. తుది సమరానికి అర్హత సాధించాలంటే భారత్ మిగతా 6 మ్యాచుల్లో కచ్చితంగా 4 గెలవాలి. అందులో ఒకటి NZ, 5 AUSతో ఉన్నాయి. అంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. ఇక ఆస్ట్రేలియా 7లో 4, సౌతాఫ్రికా 5లో 4, న్యూజిలాండ్ 4కు 4, శ్రీలంక 4లో 3 గెలిస్తే FINALకు వెళ్తాయి. పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, WIకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

News October 26, 2024

నేను ఖేల్ రత్న అవార్డుకు అర్హురాలినా?: మనూ భాకర్

image

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన భారత షూటర్ మనూ భాకర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘నేను కేంద్ర ప్రభుత్వం అందించే ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు పొందేందుకు అర్హురాలినా? చెప్పండి. ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో దేశం గర్వించేలా చేసిన భాకర్‌ దీనికి అర్హురాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే అవార్డుల ప్రకటనలో ఆమె పేరు ఉంటుందని అంటున్నారు.

News October 26, 2024

ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన జైస్వాల్

image

భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ అగ్రస్థానానికి చేరారు. 2024లో భారత్‌లో జరిగిన 9 టెస్టుల్లో జైస్వాల్ 66 సగటుతో 1056 రన్స్ చేశారు. వాటిలో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో 77 రన్స్ చేసిన యశస్వి.. దిగ్గజ బ్యాటర్ గుండప్ప విశ్వనాథ్ 1979లో (13 మ్యాచుల్లో 1047 రన్స్) నెలకొల్పిన రికార్డును అధిగమించారు.