India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
RRBలో 434 పారామెడికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. ఈ నెల 18 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని RRB తెలిపింది. నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్ట్, టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వంటి పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం పోస్టులను బట్టి రూ.21,700 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. <
ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాకు చెందిన పల్లి దేవి గత 35 ఏళ్లుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం టీ తాగుతూ జీవిస్తున్నారు. ఆమె తన 11 ఏళ్ల వయసు నుంచే ఆహారం, నీటికి బదులుగా టీ తాగుతూ శివుడి పూజలో నిమగ్నమైపోయారు. రోజుకు ఒకసారి బ్లాక్ టీ తాగుతున్నట్లు ఆమె కుటుంబీకులు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా టీ మాత్రమే తాగి జీవించడం అసాధ్యమని, ఇప్పటికీ ఆమె ఆరోగ్యంగా ఉండటంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
AP: రాష్ట్రంలో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని CM చంద్రబాబు తెలిపారు. ‘రేపు కాకినాడకు షిప్ ద్వారా 15వేల మెట్రిక్ టన్నుల ఎరువులు వస్తాయి. మరో 10 రోజుల్లో 41 వేల టన్నుల ఎరువులు రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాను పరిశీలించాలి’ అని టెలీ కాన్ఫరెన్సులో ఉన్నతాధికారులను CM ఆదేశించారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న <<17604853>>బిగ్‌బాస్-9లో<<>> పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ SMలో చక్కర్లు కొడుతోంది. వీరిలో ఆషా సైనీ, సంజనా గల్రానీ, ఇమ్మాన్యుయేల్, రీతూ, తనూజ గౌడ, శ్రష్ఠి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, భరణి ఉన్నారని సమాచారం. ఈసారి ఆరుగురు సామాన్యులకు అవకాశం కల్పించినట్లు టాక్. మాస్క్ మ్యాన్ హరీశ్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, మనీష్, ప్రియ వీరిలో ఉన్నట్లు తెలుస్తోంది.
AP: వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడంపై ఈ నెల 10న ఎలక్షన్ కమిషన్(EC) కీలక భేటీ నిర్వహించనుంది. 2026లో బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో త్వరగా SIR కింద ఓట్ల వడపోత చేపట్టాలని భావిస్తోంది. అయితే బిహార్‌లో SIR అమలును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. దానిపై రాహుల్ ఏకంగా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
కోల్డ్ ప్లే కన్సర్ట్‌లో ఆస్ట్రోనోమర్ CEO ఆండీ బైరోన్‌తో కిస్ <<17113447>>క్యామ్‌లో<<>> దొరికిన HR క్రిస్టిన్ తన భర్త ఆండ్రూ నుంచి విడిపోతున్నారు. AUG 13న ఆమె న్యూ హాంప్‌షైర్‌లోని పోర్ట్స్‌మౌత్ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. తాజాగా ఈ విషయం బయటికొచ్చింది. కిస్ క్యామ్ వీడియో వైరల్ కాగా సదరు కంపెనీ బైరోన్, క్రిస్టిన్‌ను తొలగించింది. ఇక అప్పటి నుంచే ఆండ్రూ-క్రిస్టినా వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం.
ఈజీగా గుర్తుంటాయని చాలామంది 1234, 1111, 2222, 3333, 0000 వంటి నంబర్లను ATM పిన్ నంబర్లుగా పెట్టుకుంటారు. కొందరు రివర్స్ ఆర్డర్‌లో 4321 అని, 1212, 1122 వంటి ప్యాటర్న్ ఆధారిత నంబర్లనూ యాడ్ చేస్తుంటారు. ఇవి ఏమాత్రం సురక్షితం కావని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నంబర్లను ఈజీగా హ్యాక్ చేస్తారని అంటున్నారు. పుట్టిన తేదీలు కూడా పెట్టుకోవద్దని, SMలో మీ DOBలు తెలుసుకొని సైబర్ అటాక్ చేయొచ్చంటున్నారు.
భారత్‌లో జరుగుతున్న హాకీ ఆసియా కప్ సెమీ ఫైనల్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. బిహార్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో చైనాపై 7-0గోల్స్‌తో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో 9సార్లు ఆసియా కప్ ఫైనల్ చేరిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఫైనల్ మ్యాచ్ రేపు సౌత్ కొరియాతో జరగనుంది. తుదిపోరులో గెలిచిన జట్టు 2026 FIH హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుంది.
GST సంస్కరణలకు మద్దతిచ్చిన అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులకు లేఖలు రాశారు. పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినా, చివరకు GST కౌన్సిల్ నిర్ణయాలతో ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. తాజా తగ్గింపుతో రాష్ట్రాలతో పాటు కేంద్రమూ ఆదాయం కోల్పోతుందని, రేట్లు తగ్గితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆదాయాలు భర్తీ చేసుకోవచ్చని తెలిపారు.
Sorry, no posts matched your criteria.