news

News September 6, 2025

వైసీపీ ‘ఉల్లి’ వీడియోలకు టీడీపీ కౌంటర్

image

AP: రాష్ట్రంలో <<17631026>>ఉల్లి రైతులకు<<>> ఎలాంటి సమస్య లేకుండా కూటమి సర్కార్ పనిచేస్తోందని TDP ట్వీట్ చేసింది. కానీ YCP తమ కార్యకర్తలతో దీనిపై కుట్రపూరితంగా ప్రచారం చేస్తోందని మండిపడింది. ‘కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం పోలకల్‌కు చెందిన గుండ్లకొండ కృష్ణ, వెంకటనాయుడు YCP కార్యకర్తలు. వారు కావాలనే ఖాళీ పురుగుల మందు డబ్బాలో మద్యం కలుపుకుని తాగారు. వారి ఉల్లికి క్వింటాకు రూ.800 ఇస్తామన్నా తిరస్కరించారు’ అంటూ పేర్కొంది.

News September 6, 2025

మంచి నిద్ర కోసం ఇలా చేయండి!

image

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటారు. అయితే రాత్రి నిద్రపోవడానికి ముందు కొన్ని రకాల ఆకులు నమలడం/హెర్బల్ టీ చేసుకుని తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తులసి, పుదీనా, సెలరీ, వేప, అశ్వగంధ, బ్రహ్మి ఆకుల్లో ఏదైనా ఒక రకంలో నాలుగు ఆకులను నమలడం వల్ల మంచి నిద్ర పడుతుందని సూచిస్తున్నారు.

News September 6, 2025

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం అప్డేట్స్

image

* ఇప్పటివరకు 2,54,685 వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి
* హుస్సేన్ సాగర్‌ వద్ద అట్టహాసంగా సాగుతున్న ప్రక్రియ. గంగమ్మ ఒడికి చేరిన 10వేల విగ్రహాలు
* మరో 4,500 పెద్ద విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందన్న సీపీ సీవీ ఆనంద్
* నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు తెల్లవారుజాము 4.40 గంటల వరకు నడవనున్న MMTS రైళ్లు

News September 6, 2025

చరిత్ర సృష్టించిన సికందర్ రజా

image

జింబాబ్వే క్రికెటర్ సికందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మాట్‌(టెస్టులు ఆడే దేశాలు)లో అత్యధిక POTMలు అందుకున్న ప్లేయర్‌గా రజా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆయన POTMగా నిలిచి ఈ ఫీట్ సాధించారు. రజా తర్వాత కోహ్లీ, సూర్యకుమార్(16), మహమ్మద్ నబీ, రోహిత్(14), మహ్మద్ రిజ్వాన్, వార్నర్, మ్యాక్స్‌వెల్ (12) ఉన్నారు.

News September 6, 2025

SBIలో 6,589 జాబ్స్.. పరీక్షల తేదీ ప్రకటన

image

6,589 క్లర్క్(జూనియర్ అసోసియేట్స్) పోస్టుల భర్తీకి ఈనెల 20, 21, 27 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు SBI ప్రకటించింది. త్వరలో కాల్ లెటర్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా AUG 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం పోస్టుల్లో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలున్నాయి. వీటిలో APలో 310, TGలో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెబ్‌సైట్: <>sbi.co.in/web/careers<<>>

News September 6, 2025

అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

APలో LAWCET, PGLCET, EdCET, PECETలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. LAWCET, PGLCETకు ఈనెల 8-11 మధ్య దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 12-14 మధ్య వెబ్ ఆప్షన్స్, 17న సీట్ల కేటాయింపు చేపడతారు. EdCETకు 9-12 మధ్య ఫీజు చెల్లింపు, 13-15 మధ్య వెబ్‌ ఆప్షన్స్, 18న సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది. PECETకు 10-13 మధ్య ఫీజు చెల్లింపు, 14-16 మధ్య వెబ్‌ ఆప్షన్స్‌, 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

News September 6, 2025

GREAT: 20లక్షల పుస్తకాలతో లైబ్రరీ

image

పుస్తకాలు సేకరించే అభిరుచిని ప్రజా ప్రయోజనంగా మార్చారు కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ. బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి సాహిత్యంలో మాస్టర్స్ పూర్తి చేశారు. పుస్తకాల సేకరణకు తన ఆస్తిని కూడా అమ్మేశారు. ప్రస్తుతం ఆయన 20లక్షల పుస్తకాలతో వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేయగా అందులో 5లక్షల విదేశీ పుస్తకాలు, వివిధ భాషలకు చెందిన 5K నిఘంటువులు ఉన్నాయి. ఈ లైబ్రరీకి న్యాయమూర్తులు సైతం వెళ్తుంటారు.

News September 6, 2025

రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

image

AP: చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ‘మ.3.30గంటలకు ఆలయం మూసివేస్తాం. ఎల్లుండి సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తాం. మధ్యాహ్నంలోపు 30వేల మందికి దర్శనం కల్పిస్తాం. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు’ అని చెప్పారు. అలాగే శ్రీశైలం ఆలయం కూడా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు.

News September 6, 2025

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత ఆర్చర్లు

image

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారత ఆర్చర్లు వెన్నం సురేఖ, రిషభ్ యాదవ్ సత్తా చాటారు. సెమీ ఫైనల్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చైనీస్ తైపీ జట్టుపై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. చైనీస్ తైపీపై 157-155 పాయింట్ల తేడాతో నెగ్గారు. ఫైనల్లో నెదర్లాండ్స్‌ను వీరు ఎదుర్కొంటారు.

News September 6, 2025

GST ఎఫెక్ట్.. ఫార్చునర్‌పై రూ.3.49 లక్షల తగ్గింపు

image

జీఎస్టీ శ్లాబుల మార్పుల వేళ <<17624320>>టాటా<<>>, మహీంద్రా బాటలోనే టొయోటా కూడా కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫార్చునర్‌పై అత్యధికంగా రూ.3.49లక్షల వరకు తగ్గనున్నట్లు తెలిపింది. గ్లాంజాపై రూ.85,300 వరకు, టైసోర్‌పై రూ.1.11 లక్షల వరకు, ఇన్నోవా క్రిస్టాపై రూ.1.8లక్షల వరకు, హైలక్స్‌పై రూ.2.52లక్షల వరకు, వెల్‌ఫైర్‌పై రూ.2.78లక్షల వరకు ధర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇవి ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తాయంది.