news

News March 24, 2024

BRSకు స్థానిక అభ్యర్థులు దొరకడం లేదు: రఘునందన్

image

TG: మెదక్‌లో బీఆర్ఎస్‌కు అభ్యర్థిగా స్థానికులు దొరకడం లేదా అని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. ‘కరీంనగర్ నుంచి హరీశ్ రావును తీసుకొచ్చి మెదక్‌లో రుద్దారు. హరీశ్ రావు చాలదన్నట్లు ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారు. తనది ఏ జిల్లా, ఏ ఊరో ఆయనకే తెలియదు. కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ప్రజలను దోచుకున్నారు. ఆ డబ్బును ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నారు’ అని రఘునందన్ ఆరోపించారు.

News March 24, 2024

ఓటర్ కార్డు లేకపోయినా వీటితో ఓటేయొచ్చు: EC

image

ఓటర్ కార్డు లేకపోయినా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేసేందుకు వీలుగా ఈసీ నోటిఫై చేసింది. అవి.. ఆధార్, ఉపాధి హామీ కార్డు, బ్యాంక్/ పోస్టాఫీస్ అకౌంట్ బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, NPR కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, పెన్షన్ డాక్యుమెంట్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు.

News March 24, 2024

డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయండి: VV లక్ష్మీనారాయణ

image

AP: DSC పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ECని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోరారు. ‘విస్తారమైన సిలబస్, 4 రోజుల గ్యాప్‌లో TET, TRT నోటిఫికేషన్లు రావడం. SGT పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు B.Ed అభ్యర్థులను అనుమతించడం, గిరిజన పోస్టులకు ఇతరులకు కేటాయించడం, చాలా మంది ఇన్విజిలేషన్, మూల్యాంకన పనితో బిజీగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పరిశీలించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

News March 24, 2024

27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

image

AP: ఈనెల 27 నుంచి TDP చీఫ్ చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. 27 నుంచి 31వరకు ప్రజాగళం పేరుతో సభలు, రోడ్‌షోల నిర్వహణకు పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు గ్రామీణం, 28న రాప్తాడు, శింగనమల, కదిరిలో ప్రచారం చేస్తారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి.. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు.

News March 24, 2024

లోక్‌సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు పోటీ

image

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి నామ్ తమిళర్ కట్చి పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె జులై 2020లో BJPలో చేరారు. రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవలే ఆ పార్టీని వీడి NTKలో చేరడంతో ఆ పార్టీ ఆమెకు ఎంపీ టికెట్‌ను కేటాయించింది.

News March 24, 2024

BRS మాజీ ఎంపీ సంతోష్‌పై ఫోర్జరీ కేసు

image

TG: మాజీ రాజ్యసభ సభ్యుడు, BRS నేత జోగినపల్లి సంతోష్‌ కుమార్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని కబ్జా చేసినట్లు నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2024

నిర్మాతతో తెలుగు హీరోయిన్ పెళ్లి?

image

తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ అంజలి వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న ఓ తెలుగు అగ్ర నిర్మాతతో ఆమె ఏడాదిగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అంజలి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆమె ప్రస్తుతం గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్ తదితర తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News March 24, 2024

తెలంగాణ, ఏపీ అభ్యర్థులు నేడు ఫైనల్?

image

తెలంగాణలో 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మిగతా 8 స్థానాల బరిలో నిలిచే వారి పేర్లను ఇవాళ ప్రకటించనుంది. ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. అటు ఢిల్లీలో జరిగే బీజేపీ సీఈసీ సమావేశంలో తెలంగాణలోని 2 పెండింగ్ స్థానాలు, ఏపీ అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది.

News March 24, 2024

లాక్‌డౌన్‌కు నాలుగేళ్లు

image

కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా లాక్​డౌన్ అమల్లోకి వచ్చింది. తొలుత 21 రోజులు విధించిన ఈ లాక్​డౌన్​ను క్రమంగా మూడుసార్లు పొడిగించారు. అత్యంత కఠినంగా అమలైన ఈ లాక్​డౌన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రికార్డు స్థాయిలో జీడీపీ పడిపోయేందుకు కారణమైంది.

News March 24, 2024

OGలో ఇమ్రాన్ హష్మీ పిక్ రిలీజ్

image

టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ‘ఓజీ’. పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ గ్లింప్స్ రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తాజాగా మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఫొటోను యూనిట్ షేర్ చేసింది. యుద్ధాన్ని ఊహించలేరు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.