India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZపై సిరీస్ ఓటమితో భారత WTC ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. తుది సమరానికి అర్హత సాధించాలంటే భారత్ మిగతా 6 మ్యాచుల్లో కచ్చితంగా 4 గెలవాలి. అందులో ఒకటి NZ, 5 AUSతో ఉన్నాయి. అంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. ఇక ఆస్ట్రేలియా 7లో 4, సౌతాఫ్రికా 5లో 4, న్యూజిలాండ్ 4కు 4, శ్రీలంక 4లో 3 గెలిస్తే FINALకు వెళ్తాయి. పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, WIకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన భారత షూటర్ మనూ భాకర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘నేను కేంద్ర ప్రభుత్వం అందించే ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు పొందేందుకు అర్హురాలినా? చెప్పండి. ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో దేశం గర్వించేలా చేసిన భాకర్ దీనికి అర్హురాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే అవార్డుల ప్రకటనలో ఆమె పేరు ఉంటుందని అంటున్నారు.
భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ అగ్రస్థానానికి చేరారు. 2024లో భారత్‌లో జరిగిన 9 టెస్టుల్లో జైస్వాల్ 66 సగటుతో 1056 రన్స్ చేశారు. వాటిలో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో 77 రన్స్ చేసిన యశస్వి.. దిగ్గజ బ్యాటర్ గుండప్ప విశ్వనాథ్ 1979లో (13 మ్యాచుల్లో 1047 రన్స్) నెలకొల్పిన రికార్డును అధిగమించారు.
ఈ నెల 28న ఓ భారీ గ్రహశకలం భూమి సమీపానికి రానున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’ అనే పేరు పెట్టారు. 70 అంతస్తుల భవనమంత పరిమాణం ఉండే ఈ గ్రహ శకలం భూమికి 3.3 మిలియన్ కి.మీ దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు. ఇది సెకనుకు 9.43 కి.మీ వేగంతో భూమి వైపుగా దూసుకొస్తోందని తెలిపారు. దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు యాప్‌ను పరిశీలించిన ఆయన పలు మార్పులు చేయాలని సూచించారు. వచ్చే వారం దీనిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు.
టెస్ట్ సిరీస్ ఓటమితో ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న టీమ్ ఇండియాకు కొందరు ఫ్యాన్స్ బాసటగా నిలుస్తున్నారు. ఓటమిలోనూ మీ వెంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వరుస విజయాలు సాధించినప్పుడు ప్రశంసించడమే కాదు.. వరుస పరాజయాలు ఎదురైనప్పుడు కూడా వారికి అండగా నిలవాలని అంటున్నారు. మరోవైపు సొంత గడ్డపై భారత జట్టు సిరీస్ కోల్పోవడాన్ని కొందరు ఫ్యాన్స్ జీర్ణించుకోలేక ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న Coldplay, Diljit కన్సర్ట్స్‌కు సంబంధించి నకిలీ టికెట్లు, ధరల దోపిడీ వ్యవహారంలో ED దర్యాప్తు ముమ్మరం చేసింది. BookMyShow, పలువురిపై నమోదైన కేసుల్లో ఢిల్లీ, ముంబై, జైపూర్, చండీగఢ్, బెంగళూరులో సోదాలు నిర్వహించింది. సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ మార్కెట్‌కు తెరలేపి అనధికార, నకిలీ టికెట్లు విక్రయిస్తున్న వారిని గుర్తించినట్టు ED అధికారి తెలిపారు.
న్యూజిలాండ్‌పై రోహిత్, కోహ్లీ పేలవ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ప్రతిపాదికన కాకుండా ఆటతీరును దృష్టిలో పెట్టుకొని ప్లేయర్లకు జట్టులో చోటివ్వాలని క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. దిగ్గజ ప్లేయర్ సచిన్ తన 40 ఏళ్ల వయసులోనూ దేశవాళీ క్రికెట్ ఆడారని గుర్తు చేస్తున్నారు. ఎంత అనుభవమున్నప్పటికీ రోహిత్, కోహ్లీ ఇదే ఫాలో కావాలని సూచిస్తున్నారు.
భారత పర్యటనకు ముందు శ్రీలంక చేతిలో పరాజయం. కీలక ప్లేయర్, కెప్టెన్ విలియమ్సన్ గాయంతో దూరమయ్యారు. దీంతో NZపై భారత్ సులభంగా సిరీస్ గెలిచేస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ కివీస్ క్రికెటర్లు అద్భుతంగా ఆడారు. తొలి టెస్టులో పేస్‌తో దెబ్బకొట్టి, రెండో టెస్టులో స్పిన్‌తో భారత ప్లేయర్లను అల్లాడించారు. 1955 తర్వాత భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించారు.
బిజినెస్ ఏదైనా విజయవంతంగా నడపాలంటే డిసిషన్ మేకింగ్ చాలా ముఖ్యం. ఆ సామర్థ్యం లేకుంటే కలిగే నష్టం అపారం. ఇంటెల్‌కు 2005లో $20bnsతో Nvidiaను కొనే అవకాశం వచ్చింది. దాని సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయక రిజెక్ట్ చేసింది. ఇప్పుడదే Nvidia మార్కెట్ విలువ ఏకంగా $3trnsకు చేరుకుంది. ఇంటెల్ $100bnsకు పడిపోయింది. AI చిప్ తయారీలో వెనకబడింది. లో కాస్ట్ AI చిప్ Gaudi 3ని తీసుకొచ్చినా ఏం లాభం లేకుండాపోయింది.
Sorry, no posts matched your criteria.