news

News January 8, 2025

ఫార్ములా-ఈ కేసు: నేడు ఇద్దరి నిందితుల విచారణ

image

TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో ఏ2గా అరవింద్, ఏ3గా BLN రెడ్డి ఉన్నారు. HMDA నుంచి FEOకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై వీరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

News January 8, 2025

స్నానం ఆపేస్తే ఆయుష్షు 34% పెరుగుతుందా!

image

చలికాలంలో స్నానం చేయడం మానేస్తే జీవితకాలం 34% పెరుగుతుందనడంలో నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి మానేస్తే ఫర్వాలేదంటున్నారు. చల్లదనం వల్ల అసలే మెటాబాలిజం తగ్గుతుందని, స్నానం ఆపేస్తే ఇంకా కష్టమని పేర్కొంటున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం పెరిగి రిలాక్సేషన్ లభిస్తుందని చెప్తున్నారు. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా బాడీ హైజీన్ పెంచుతుందని వెల్లడించారు.

News January 8, 2025

వాట్సాప్‌లో ‘ఫొటో పోల్స్’

image

వాట్సాప్ ‘ఫొటో పోల్స్’ ఫీచర్‌ను తీసుకురానుంది. దీని ద్వారా టెక్స్ట్‌తో అవసరం లేకుండా పోల్స్‌లో ఫొటోలను అటాచ్ చేసేందుకు వీలుంటుంది. ముందుగా ఛానల్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ను ఆ తర్వాత గ్రూప్ చాట్స్, పర్సనల్ చాట్స్‌లోనూ ప్రవేశపెడతారని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. టెక్స్ట్‌లో చెప్పలేని విషయాలను ఫొటోలతో ఈజీగా చెప్పేందుకు ఈ ఫీచర్ సాయపడనుందని పేర్కొంది.

News January 8, 2025

నేడు అక్కడ స్కూళ్లకు సెలవు

image

AP: ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో ప్రేమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా మరో రోజు స్కూళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. నేడు సాయంత్రం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖలో రోడ్ షో చేయనున్నారు.

News January 8, 2025

నెల్లూరు జిల్లా నేతలతో నేడు జగన్ సమావేశం

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన జగన్ భవిష్యత్ కార్యాచరణపై ఒక్కో జిల్లా నేతలతో సమావేశం అవుతోన్న విషయం తెలిసిందే.

News January 8, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఇదేనా!

image

వచ్చే నెల 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025కి భారత జట్టు ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకొని షమీ తిరిగి జట్టులో చేరనున్నట్లు సమాచారం. CTలో భారత్ తొలి మ్యాచ్ FEB 20న బంగ్లాదేశ్‌తో, 23న పాక్‌తో ఆడనుంది.
జట్టు అంచనా: రోహిత్(C), కోహ్లీ, గిల్, జైస్వాల్, శ్రేయస్, రాహుల్, పంత్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, షమీ, అర్ష్‌దీప్.

News January 8, 2025

సంక్రాంతి సెలవులు.. ఎవరికి ఎన్నిరోజులంటే?

image

ఈసారి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులపై కాస్త గందరగోళం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు హాలిడేస్ ఎప్పుడనే వివరాలు చూద్దాం.
* TGలో స్కూళ్లకు ఈనెల 11-17 వరకు
* జూనియర్ కాలేజీలకు 11-16 వరకు
* APలో స్కూళ్లకు ఈనెల 10-19 వరకు
* క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు 11-15 వరకు
* జూనియర్ కాలేజీలకు ఇంకా సెలవులు ప్రకటించలేదు.

News January 8, 2025

రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు!

image

AP: వయసు మీదపడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్ల చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవట్లేదని తల్లిదండ్రులు ట్రైబ్యునల్ అధికారిగా ఉండే RDOకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో నిజమని తేలితే RDO ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు.

News January 8, 2025

ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

image

TG: పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఏడాదిగా ఆరోగ్యశ్రీ, EHS, JHS కింద రూ.1000Cr పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. దీంతో ఆసుపత్రులు నడిపే పరిస్థితులు లేకుండాపోయాయని వెల్లడించాయి. కాగా ఏడాదిలో రూ.920Cr బిల్లులు చెల్లించామని, మరో రూ.450-500 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News January 8, 2025

చనిపోయిన జవాన్లలో ఐదుగురు మాజీ మావోలు

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో సోమవారం మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది జవాన్లు చనిపోయిన <<15079768>>విషయం<<>> తెలిసిందే. అయితే వీరిలో ఐదుగురు మాజీ మావోయిస్టులని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లుగా పోలీసు శాఖ నియమించుకుంటుంది. అలా చేరిన బయన్ సోధీ, పండరురామ్ పొయం, డుమ్మా మార్కం, బుద్రామ్ కొర్పా, సోమడు వెట్టి ఈ ఘటనలో చనిపోయారు.