news

News April 1, 2024

యువతితో అసభ్య ప్రవర్తన.. నిలదీసిన తండ్రి గొంతు కోశారు

image

TG: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. స్థానిక దుకాణానికి వెళ్లిన ఓ యువతిపై సురేశ్ అనే యువకుడు నీళ్లు పోసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వెళ్లి జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. సురేశ్‌ని నిలదీసేందుకు యువతి తల్లిదండ్రులు వెళ్లగా వారిపై నిందితుడి గ్యాంగ్ దాడి చేసింది. సురేశ్ స్నేహితుడు కత్తితో యువతి తండ్రి గొంతు కోశాడు. బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 1, 2024

నేటి నుంచి కొత్త ఈపీఎఫ్ఓ రూల్స్

image

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా నేటి నుంచి EPFO కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఉద్యోగులు కంపెనీలు మారితే ఆటోమేటిక్‌గా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పాత పన్ను విధానాన్ని సెలక్ట్ చేసుకోని వారందరికీ నేటి నుంచి ఆటోమెటిక్‌గా కొత్త పన్ను విధానం అమలు కానుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు ఆధార్ బేస్డ్ అథంటికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

News April 1, 2024

చిన్న మెజారిటీ కాదు భారీ మెజారిటీతో గెలిపించండి: పవన్

image

పిఠాపురంలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ శ్రేణులను కోరారు. పలు నియోజకవర్గాల టీడీపీ నేతలు జనసేనలో చేరిన సందర్భంగా పవన్ ప్రసంగించారు. ‘సినిమాలు ఫ్లాప్ అయ్యే కొద్దీ హీరోగా ఎదిగాను. అందుకే మొన్న సినిమాలో హరీశ్ శంకర్ గ్లాసుకు పదునెక్కువ, పగిలేకొద్దీ పదునెక్కుతుంది అనే డైలాగ్ రాశాడు. నన్ను, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్‌ను చిన్న మెజారిటీ కాదు భారీ మెజారిటీతో గెలిపించండి’ అని కోరారు.

News April 1, 2024

రూ.151 చెల్లిస్తే ఇంటికే రాములోరి తలంబ్రాలు: TSRTC

image

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. రూ.151 చెల్లిస్తే రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేస్తామని తెలిపింది. ఇందుకోసం టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని, వివరాలకు 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించింది.

News April 1, 2024

పలాసలో గెలుపు ఎవరికో?

image

AP: పలాస నియోజకవర్గం(శ్రీకాకుళం) 2008లో ఏర్పడింది. 2009లో జగన్నాయకులు(INC), 2014లో గౌతు శివాజీ(TDP), 2019లో సీదిరి అప్పలరాజు(YCP) ఎన్నికయ్యారు. ఈసారి YCP నుంచి సీదిరి, TDP నుంచి గౌతు శిరీష బరిలో దిగుతున్నారు. ఉద్ధానంలో మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ సెంటర్ తనను గెలిపిస్తాయని సీదిరి ధీమాగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ ఫ్యామిలీకి ఉన్న మంచి పేరు కలిసొస్తుందని శిరీష భావిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 1, 2024

పెన్షన్లపై కీలక UPDATE

image

AP: పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండొద్దని ఈసీ ఆదేశించిన వేళ.. సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా వారంలో పెన్షన్లు ఇవ్వొచ్చని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. పెన్షన్ల పంపిణీపై రాత్రికి మార్గదర్శకాలు ఇస్తామని సీఎస్ పేర్కొన్నారు.

News April 1, 2024

అల్లుఅర్జున్-అట్లీ సినిమాలో సమంత?

image

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుందట. ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సామ్ గతంలో అట్లీతో ‘తేరి’, బన్నీతో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు చేశారు. పుష్పలో ఐటమ్ సాంగ్‌లో కనిపించారు.

News April 1, 2024

KCR పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు: భట్టి

image

TG: అక్కసుతోనే KCR తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘BRS నేతలు కాంగ్రెస్‌లో చేరుతుంటే KCR తట్టుకోలేకపోతున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని సమస్యలకు గత ప్రభుత్వమే కారణం. 3 నెలల నుంచి వ్యవస్థలను దారికి తీసుకొస్తున్నాం. కాళేశ్వరంలో జరిగిన పొరపాటును ఆయన ఒప్పుకోవడం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.

News April 1, 2024

అందుకోసం గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రయోగించేవాళ్లు: బాలీవుడ్ నటి

image

బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1990లలో నటీనటుల మధ్య పోటీ ఎక్కువగా ఉండేదని అన్నారు. కెరీర్ పట్ల అభద్రతా భావంతో ఉన్నవారు ఇతరుల సక్సెస్‌ను ఓర్వలేకపోయేవారని చెప్పారు. వారిని కిందికి లాగేందుకు అవసరమైతే బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్‌ని ప్రయోగించేవాళ్లని తెలిపారు. ఇలాంటి పరిస్థితితో తాను ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. సినిమాల నుంచి ఎవరినీ తీసెయ్యాలని తాను ప్రయత్నించలేదన్నారు.

News April 1, 2024

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఈసీ వాయిదా వేసింది. రేపు కౌంటింగ్ జరగాల్సి ఉండగా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. మార్చి 28న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.