news

News April 1, 2024

ఇజ్రాయెల్ ప్రధానికి సర్జరీ

image

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హెర్నియా సర్జరీ జరిగింది. ఆదివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని పీఎం కార్యాలయం ప్రకటించింది. ఇటీవల చేసిన చెకప్‌లో వైద్యులు హెర్నియాను గుర్తించారని, వారి సూచనల మేరకు పీఎం సర్జరీ చేయించుకున్నారని స్పష్టం చేసింది. కాగా.. గాజాపై యుద్ధం విషయంలో నెతన్యాహు రాజీనామా చేయాలంటూ వేలాదిమంది ఇజ్రాయెల్ పౌరులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

News April 1, 2024

ఎన్నికలకు భారీగా బలగాలు

image

AP: మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఈసీ కసరత్తు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలను కాపాడేలా 1.14 లక్షల మంది సివిల్ పోలీసులు, 52 కంపెనీల సాయుధబలగాలు పోలింగ్ విధుల్లో పాల్గొననున్నాయి. వీటికి అదనంగా 491 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమని ఈసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. 7200 మందితో కూడిన 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి ఇప్పటికే చేరుకున్నాయి.

News April 1, 2024

రేషన్‌కార్డులు ఉన్న వారికి గుడ్‌న్యూస్

image

TG: రేషన్‌షాపుల్లో ఇవాళ్టి నుంచే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. గతంలో ప్రతి నెలా తొలి వారం ఆఖరులో, రెండో వారంలో రేషన్ షాపులు ప్రారంభం అయ్యేవి. దీనిపై లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇవాళ్టి నుంచి బియ్యం, గోధుమలు, చక్కెర పంపిణీకి ఏర్పాట్లు చేసింది.

News April 1, 2024

పాలిసెట్.. నేటి నుంచి ఫ్రీ కోచింగ్

image

AP: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు నేటి నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏప్రిల్ 25 వరకు కోచింగ్ ఇవ్వనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పదోతరగతి పరీక్షలు రాసిన వారందరూ హాజరుకావొచ్చన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు.

News April 1, 2024

సీఎం జగన్ పెన్షనర్లను రెచ్చగొడుతున్నారు: బొండా

image

AP: సీఎం జగన్ పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని TDP నేత బొండా ఉమ మండిపడ్డారు. వాలంటీర్లను పెన్షన్లు ఇవ్వొద్దని EC ఇచ్చిన ఆదేశాలను అదునుగా చేసుకుని ప్రజల్ని రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్లు తప్ప ప్రభుత్వంలో అధికారులే లేరా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని పర్మినెంట్ చేస్తామని తెలిపారు.

News April 1, 2024

అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. 2 రోజులుగా జ్వరం, దగ్గుతో ఆయన బాధపడుతున్నారు. పిఠాపురం సభ తర్వాత ఆయన నీరసపడినట్లు సమాచారం. దీంతో ఆయన హెలికాప్టర్‌లో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. అటు త్వరలోనే పవన్ తదుపరి పర్యటన షెడ్యూల్ ఖరారు చేసేందుకు జనసైనికులు కసరత్తు చేస్తున్నారు.

News April 1, 2024

నేడు అనంత జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర

image

AP: సీఎం జగన్ నిర్వహిస్తున్న’మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇవాళ అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. సంజీవపురం నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. రాఘవపల్లి క్రాస్, బత్తలపల్లి, రామాపురం, మలకవేముల మీదుగా సాగనుంది. కదిరిలో ముస్లింలతో ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటారు. రాత్రికి చీకటిమానిపల్లెలో బస చేస్తారు.

News April 1, 2024

వానాకాలం ఆరంభంలోనే విత్తనాలు

image

TG: వానాకాలంలో వేయాల్సిన పంటలకు సీజన్ ఆరంభంలోనే అన్ని రకాల విత్తనాలు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈమేరకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఏటా వానాకాలం సీజన్‌లో దాదాపు 1.26కోట్ల ఎకరాల మేర పంటలు సాగవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కల్తీ విత్తనాల బెడద ఉంది. రబీ సీజన్‌లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కల్తీ విత్తనాల కట్టడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

News April 1, 2024

ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేనా?

image

IPLలో ఈరోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఆడిన 2మ్యాచుల్లోనూ గెలిచి రాజస్థాన్‌ జోరు మీదుంది. మరోవైపు ముంబై ఆడిన రెండింట్లోనూ ఓడి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉంది. ఈరోజు గెలిచి బోణీ కొట్టాలని MI పట్టుదలతో ఉంది. ఇరుజట్లు ఇప్పటివరకు 28మ్యాచుల్లో తలపడగా.. ముంబై 15, రాజస్థాన్ 12 మ్యాచుల్లో గెలిచాయి. ఒక దాంట్లో ఫలితం రాలేదు.

News April 1, 2024

సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ

image

AP: ఏప్రిల్, మే, జూన్ నెల పింఛన్లను సచివాలయల వద్దే పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్ కార్డు ద్వారా సచివాలయ ఉద్యోగులు నగదు అందిస్తారని సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి తెలిపారు. ఇవి విఫలమైతే రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టం ద్వారా అందిస్తారని చెప్పారు. వాలంటీర్లు ఎన్నికలు పూర్తయ్యే వరకు పింఛన్ల పంపిణీలో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.