India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బేల మండలంలోని వాడగూడ, జంగుగూడ, మసాలా (బి), సదల్పూర్, మరిన్ని గ్రామాలలో ఏర్పాటు చేసిన దీపావళి దండారి ఉత్సవాల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఆయనకు ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. జోగు రామన్న మాట్లాడుతూ.. దండారీలకు రూ.10 వేల ఆర్థిక సాయం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనే ఆదివాసీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు రామన్న పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా.. పట్టణంలోని YSR కాలనీకి చెందిన నరేశ్(25) తామర పువ్వుల కోసం చెరువుకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. కాగా, బంగల్పేట్ చెరువులో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు జోగుల సీతారాం మేస్త్రిగా గుర్తించారు.
ఆదిలాబాద్ పట్టణంలో గురువారం దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులు నిర్వహించిన లక్ష్మీ పూజలో ఎంపీ గొడం నగేశ్ పాల్గొన్నారు. ఈ మేరకు ఓ ట్రావెల్స్ కార్యాలయంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొని టపాసులు కాల్చారు. అనంతరం జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నవంబర్ 2న ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అండర్ 19 ఖోఖో ఉమ్మడి జిల్లా స్థాయి బాలురులకు ఎంపిక పోటీలను ఎస్జీఎఫ్ సెక్రటరీ బాబురావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ రవీందర్ తెలిపారు. ఈ పోటీలకు ఇంటర్మీడియట్ చదువుతూ 19 సంవత్సరాలలోపు వయసు కలిగిన విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులు బోనఫైడ్, ఆధార్ కార్డు తీసుకుని ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో NHM పథకంలో జిల్లా కార్యక్రమ సమన్వయకర్త, సీనియర్ డాట్స్ ప్లస్ టీబీ, హెచ్ఐవీ(STS), TBHV ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసినట్లు DMHO కృష్ణ తెలిపారు. అలాగే మూడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఒక PMDT, TBHV సమన్వయకర్త పోస్టుల ప్రొవిజనల్ జాబితాను సైతం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. జాబితాలను కార్యాలయ నోటీసు బోర్డుపై ఉన్నాయన్నారు.
తాంసి మండల మార్కెట్ పరిధిలో సోయా కొనుగోళ్లను గురు, శుక్ర, శని, ఆదివారాల్లో నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్‌ఛార్జ్ చింతల కేశవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి సందర్భంగా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తిరిగి నవంబర్ 4వ తేదీన కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు.
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ RM సోలోమన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిపోల నుంచి వేములవాడకు, తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేందుకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణలకు వెళ్లే భక్తులు ఆన్‌లైన్లో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓటు నమోదుపై అవగాహన, ఎన్నికల సంఘం, అధికారులు చేపట్టిన కార్యక్రమాలతో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో మొత్తం 23,10,190 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 11,31,150 మంది పురుష ఓటర్లు, 11,78,906 మంది మహిళా ఓటర్లు, 134 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళల జనాభానే అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
మిస్సింగ్, అసహజ మరణాల కేసులపై ప్రత్యేక దృష్టి సాధించాలని CP శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీస్ అధికారులతో ఆన్ లైన్ జూమ్ మీటింగ్ ద్వారా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. CPమాట్లాడుతూ.. అసహజ, మరణాలు మిస్సింగ్ కేసుల గురించి అధికారులు రివ్యూ చేసి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. త్రీ లేయర్ పద్ధతి ద్వారా NBW’s ఎగ్జిక్యూటివ్ చేయాలని సూచించారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు బుధవారం హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. నేడు ఆయా జిల్లాలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షం కురిసింది. దీంతో పొలాల్లో పంట చేతికొచ్చే సమయంలో వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Sorry, no posts matched your criteria.