India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాజర్షి షా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. టపాసుల వెలుగులతో, దీప కాంతుల జ్యోతులతో, సిరి సంపదల రాసులతో ఈ దీపావళి ప్రతి ఇంట సిరుల పంట కురిపించాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలను, కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తన్నట్లు పేర్కొన్నారు.
ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్లో నవంబర్ 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీలను అండర్–17 బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని యోగా పోటీల కన్వీనర్, పాఠశాల హెచ్ఎం నరేందర్ రావు తెలిపారు. బుధవారం ఆయన మస్కాపూర్‌లో మాట్లాడారు. బాలబాలికలు స్టడీ సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డు వెంట తీసుకుని రావాలన్నారు. వివరాలకు 99631 68632ను సంప్రదించాలన్నారు.
ఆదిలాబాద్ DSCలో ర్యాంకులు సాధించిన శివాజీ, సాయికృష్ణ, సౌజన్య అభ్యర్థులకు 3 రోజుల్లో ఆర్డర్ కాపీ ఇస్తామని Undertaking ఇచ్చి, నేటికి 15 రోజులు గడుస్తున్న ఇవ్వకపోవడంతో బాధిత అర్హత గల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎవరో చేసిన తప్పిదాలకు తమని తమ కుటుంబాన్ని ఎందుకు ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి న్యాయం జరగడం లేదని వాపోయారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువును మరోసారి పొడిగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో 4,58,338 మంది ఓటర్లు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను కలెక్టర్ రాజర్షి షా విడుదల చేశారు. జిల్లా ఎన్నికల అధికారి అన్ని తహశీల్దార్ కార్యాలయాల నోటీసుబోర్డులపై అందుబాటులో ఉంచారు. జిల్లాలో పురుష ఓటర్లు 2,23,176 మంది, మహిళా ఓటర్లు 2,35,154 మంది, ఇతరులు మరో 8 మంది ఉన్నారు. పురుషులతో పోల్చితే జిల్లాలో మహిళా ఓటర్లు 11,978 మంది ఎక్కువగా ఉన్నారు.
పోక్సో కేసులో ఇద్దరికి ASF కోర్ట్ జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ASF జిల్లా బెజ్జూర్ మండలం బారెగుడకు చెందిన ఇద్దరు వ్యక్తులు మైనర్ బాలికలను 2018లో మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి ఆత్యాచారం చేయగా SC/ST యాక్ట్ కేసులో టాకిరే ప్రకాశ్‌కు యావజ్జీవ, కామ్రే గణేశ్‌కు 10 సం.రాల జైలు శిక్ష విధిస్తూ ఆసిఫాబాద్ కోర్టు తీర్పును వెలువరించిందన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అఘోరి నాగసాధు వచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రధాన రహదారిపై తన వాహనంలో అఘోరి నాగసాధు ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. నెన్నెల మండలానికి చెందిన అఘోరి నాగసాదు వ్యవహారం ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లాస్థాయి నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు, సలహాలు చేశారు.
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని బుగ్గగట్టులో గొర్రెల మందపై పెద్దపులి దాడి చేయడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గొర్రెల మందపై పులి దాడి చేసిన సమాచారంతో అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాదముద్రల ఆధారంగా పెద్దపులిగా గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.